Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పిల్లలు మన నీతులు వినరు – మన ప్రవర్తనను అనుసరిస్తారు

May 10, 2026 by M S R

.
Murali Buddha …. పిల్లలు మన నీతులు వినరు – మన ప్రవర్తనను అనుసరిస్తారు … దాదాపు రెండు దశాబ్దాల క్రితం… బైక్ మీద పిల్లలతో ఓల్డ్ సిటీలో ఎమ్‌సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సెంటర్ వెతుకుతూ వెళుతున్నాను … ఓ మిత్రుడి నుంచి ఫోన్… అతను ప్రముఖ పత్రికలో ఎడ్యుకేషన్ బీట్ చూసే రిపోర్టర్ … ఎక్కడున్నావ్ అంటే చెప్పాను …

ఓల్డ్ సిటీకి ఏం వెళ్తావు… నేను jntu వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో ఉన్నాను, ఇక్కడే వెరిఫికేషన్ చేయించుకోవచ్చు, మా అబ్బాయిది ఇక్కడే చేయిస్తున్నాను అన్నాడు … నన్ను అక్కడికే రమ్మంటే  నేను రాను అని చెప్పి నా దారిన వెళ్ళిపోయాను . పిల్లలు కారణం అడిగితే చెప్పాను .

చెమటలు కక్కుతూ ఓల్డ్ సిటీ వెళ్ళాలి, అది కష్టమే . Jntu vc ac ఛాంబర్ లో హాయిగా టీ తాగుతూ vc తో కబుర్లు చెబుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవచ్చు . కానీ ఏదైనా తేడా వస్తే మన సీటు గోవిందా … అదే మనకు కేటాయించిన సెంటర్ లో సాంకేతిక సమస్యలు వస్తే వాళ్ళే బాధ్యత వహిస్తారు . Vc తో టీ తాగుతూ కబుర్లు చెబుతుంటే రేపు కాలేజీలో చేరాక లెక్చరర్ ను చూసి, మాకు vc కూడా తెలుసు, ఆఫ్టరాల్ లెక్చరర్ ఏమిటీ అనిపిస్తుంది . మనం నిబంధనలు కచ్చితంగా పాటిస్తే చొక్కా పట్టుకొని తప్పును ప్రశ్నించే అధికారం ఉంటుంది అని చెప్పాను …

Ads

ఈ మధ్య ఆ మిత్రుడు తన కుమారుడు అనుకున్నట్టుగా సక్సెస్ కాలేదు అన్నాడు… అంటే 20 ఏళ్ల క్రితం నాటి ఈ సంఘటన గుర్తు చేసి తప్పు నీదే అన్నాను …

ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే హిందీ కోచ్ వీడియోలు వింటుంటాను … ఓసారి అతనికి ఓ రిక్షా అతనితో వివాదం… తప్పు రిక్షా అతనిదే అయినా ఇతనే సారీ చెప్పి వెళ్లిపోయాడట . ఎందుకంటే రిక్షా వాడితో గొడవపడి గెలిచినా అతన్ని రిక్షావాడిని ఒకే గాటన కడతారు . అందుకే సారీ చెప్పి వెళ్లి పోయాను అంటూ… కింది వాడితో ఎప్పుడూ గొడవ పడొద్దు అని పాఠం చెప్పాడు … నాకు బాగా నచ్చింది . ఇది నేను పాటిస్తాను, పిల్లలకు కూడా చెప్పాను .

ఓసారి సికింద్రాబాద్ తాజ్ మహల్ వద్ద బైక్ పార్క్ చేస్తే ట్రాఫిక్ హోమ్ గార్డ్ వచ్చాడు . ఫైన్ వేసుకో అని చెప్పాను . అతని ఇగో హార్ట్ అయింది . బతిమిలాడుతాను అనుకున్నాడు . డబ్బు కట్టు అన్నాడు . సొంతానికా , ఫైన్ కో తెలియదు . నువ్వు ఇలా డబ్బు అడగడానికి అధికారం లేదు . ఫైన్ వేయవద్దు అనడం లేదు . ఫైన్ వెయ్ అన్నాను .

అతని అహం దెబ్బ తిని అన్ని లైసెన్స్ లు అడిగాడు . చూపించి … నవ్వాను . మాగ్జిమమ్ ఫైన్ ఎంతో అంత వేశాడు . ఇంటికి వచ్చాక పిల్లలతో – ‘నేను ఆ హోమ్ గార్డ్ తో మాట్లాడాల్సింది కాదు . ఎంతైనా ఫైన్ వేసుకోనివ్వు అని వదిలేయాల్సింది’ అన్నాను … అది విని మేమూ అదే అనుకుంటున్నాం … కింది వారితో గొడవ పడొద్దు, విననట్టే వెళ్లి పోవాలి అని మాకు చెప్పావు కదా అనుకున్నాం అన్నారు పిల్లలు.  సో, నాదే తప్పు అని పిల్లలకు చెప్పడం మంచిదైంది అనుకున్నాను . లేక పోతే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనుకుంటారు…

మీ గురించి ఎవరో ఇలా రాశారు అని ఎవరైనా చెప్పినా సరే, టుంరీలు ఏదో రాస్తారులే, నేను వారికి విలువ ఇవ్వను అని వదిలేస్తా, కానీ ఏం రాశారు అని కూడా అడగను .

తండ్రి మైకుల ముందే అన్ని బూతులు మాట్లాడుతూ రౌడీఇజం చేస్తుంటే పిల్లలు అదే నేర్చుకుంటారు … పోక్సో కేసుల్లో ఇరుకుతారు . హత్యాచారాలు చేస్తారు . హత్యలు చేస్తారు . కోట్ల రూపాయల అక్రమ సంపాదన సంతానానికి ఇస్తారేమో కానీ వారికి సంస్కారం ఇవ్వరు … అందుకే ఇలా తయారవుతారు … అక్రమ సంపాదనపరుల పిల్లల పరిస్థితి చాలా మందిది ఇదే పరిస్థితి .

అన్ని రకాల అక్రమ విందు వినోదాల్లో వీరిదే రాజ్యం . సంపన్నుడు అంటే పాత కాలం రోజులు వేరు . ఈ రోజుల్లో సంపన్నులు కావడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి . సంస్కారవంతమైన వారసులను తయారు చేసుకోవడం కష్టం . అక్రమ సంపాదనపరుల పిల్లలు ఇలా అక్రమ మార్గంలోనే గౌరవం లేకుండా జీవిస్తారు .

బస్తీలో రౌడీని చూసి బస్తీవాసులు అంతా వీడితో మనకెందుకు అని పక్క నుంచి వెళ్లి పోతారు . అది గౌరవంతో కాదు, అసహ్యంతో . మీరెంత అక్రమ సంపాదన కూడబెడితేనేం మీ పిల్లలకు మీరంటే గౌరవం ఉండదు . సమాజానికి మీ పిల్లలు అంటే గౌరవం ఉండదు ….. ఏదో చెప్పాలి అనిపించి … ఇదంతా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పిల్లలు మన నీతులు వినరు – మన ప్రవర్తనను అనుసరిస్తారు
  • బుడ్డోడు నిలబడకపోతే… మిగతా ప్లేయర్లు వరుసగా పడిపోవడమే..?!
  • చైనా మిలిటరీలో సంక్షోభం… మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష…
  • పాకిస్థాన్‌ను గంగవెర్రులెత్తించే వార్త… భారత్‌కు మరిన్ని ఎస్-400 …
  • డౌన్ టు ఎర్త్… బ్రహ్మచారి… పుదుచ్చేరి అంటే ఎన్.రంగస్వామే…
  • సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!
  • బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు… ఓ అమ్మాయిపై ఘాతుకం… కానీ..?
  • అతిశయం, ఆభిజాత్యం… వాణిశ్రీకి సరిగ్గా నప్పే ప్రౌఢ పాత్ర…
  • నంబర్లాట- నవ్వులాట..! అనామక పార్టీలూ ‘ఆడుకుంటున్నయ్’…!!
  • ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions