Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…

May 10, 2026 by M S R

.

ఎప్పుడైనా మనసు ఏదో వెలితిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రభ తిరగేయడం అలవాటు… ఏదో ఓ వార్త కనిపిస్తుంది… బాగా నవ్విస్తుంది… అది ఘనమైన పాత్రికేయ ప్రమాణాలను చూసి వైరాగ్యంతో వచ్చే నవ్వు… నన్నెప్పుడూ నిరాశపరచలేదు అది… కానీ కొన్నిసార్లు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి కూడా ఆంధ్రప్రభను మించిపోతుంటాయి…

ఎక్కువగా బాబుగారి భజన కనిపించే ఏపీ ఎడిషన్‌లో కనిపిస్తుంటాయి అవి… అందుకే ఏపీ ఎడిషన్ చదవకపోతే, ఏదో మంచి బీపీ రిలాక్సింగ్ సెషన్ మిస్సయిన భావన ఆవరిస్తుంది… ఉదాహరణ కావాలా..? సరే, నిన్నటి ఏపీ ఎడిషన్‌లో ఓ వార్త… అది కలెక్టర్ల సమావేశం… వాళ్లిచ్చిన రిపోర్టులను వాళ్లకే వినిపిస్తుంటాడు చంద్రబాబు సాధారణంగా… దశాబ్దాలుగా ఆయన అంతే…

Ads

చిత్రవిచిత్ర పారామీటర్లలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, కమిషనర్ల పనితీరును కూడా లెక్కిస్తుంటాడు… అందులో ఫైళ్ల క్లియరెన్స్ వేగం కూడా ఒకటి… ఒక ఫైల్ క్లియర్ కావడానికి చాలా దశలుంటాయి… ఇలా రాగానే అలా సంతకం చేసి పారేయడం కాదు… ఇదంతా చెబితే చంద్రబాబు ఒప్పుకోడు… ఫైల్ క్లియర్ చేయాలంటే థరోగా చదవాలి, అవగాహన చేసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి… అదంత వీజీ కాదు… స్పీడ్ కాదు ముఖ్యం, నాణ్యత ప్రధానం…

ఫైల్ క్లియరెన్స్(ప్రతీకాత్మక చిత్రం)

చీఫ్ సెక్రెటరీ జి.సాయిప్రసాద్… రెవిన్యూ, సాగునీటి శాఖ ఫైళ్లను ఆయన పది గంటల్లో… మీరు చదివింది నిజమే, పదే పది గంటల్లో ఏకంగా 3870 ఫైళ్లను క్లియర్ చేశాడట… చంద్రబాబు అభినందించాడు… ఎవరెవరు లేటుగా ఫైళ్లు క్లియర్ చేస్తున్నారో ఓ రిపోర్టు కూడా చదివాడు…

సరే, 10 గంటలు… అంటే 600 నిమిషాలు… అంటే 36 వేల సెకన్లు… మధ్యలో లంచో, టిఫినీయో, కాఫీలలో గట్రా లేకపోతే… ఏకబిగిన ఫైళ్లు చూస్తే… 3870 ఫైళ్లు అంటే… సగటున 9.30 సెకన్లు… అంతేనా..? అసలే మేం మ్యాథ్స్‌లో వీక్… ఇప్పుడు చూద్దాం…

ఒక ఫైల్ ముందుకు జరుపుకుని, ఓపెన్ చేసి, కనీసం నోట్ ఫైల్ చదివి, అర్థం చేసుకుని, సంతకం చేసి, కింద డేట్ వేసి, ఫైల్ మూసి, పక్కకు జరపడానికి జస్ట్ 9 సెకన్లు సరిపోయిందా..? ఇవి ఫిజికల్ ఫైళ్లు అయితే… ఆన్‌లైన్‌లో అయినా సరే… ఫైల్ క్రక్స్ ఏమిటో చదవాలి, అవగాహన చేసుకోవాలి, తరువాత క్లియర్ చేయాలి… ఫైల్ ఓపెన్ చేసి, కాస్త పైపైన చూసినా సరే 9 సెకన్లు సరిపోతుందా..? ఈ రిపోర్టును చంద్రబాబు నమ్మాడు… అభినందించాడు… అంతా విచిత్రంగా ఉంటుంది…

పైగా అవి సాగునీటి శాఖ, రెవిన్యూ ఫైళ్లు… ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత క్లిష్టమైన ఫైళ్లు అవి… తేడా వస్తే ఫస్ట్ బుక్కయ్యేది కూడా చీఫ్ సెక్రెటరీయే..! మరి అంత స్పీడుగా ఎలా క్లియర్ చేసినట్టు..? స్టాఫ్ ఫైళ్లు ముందు పెడుతూ ఉంటే సంతకాలు చేస్తూ పోయాడా..? అసలు దానికైనా 9 సెకన్ల సమయం సరిపోతుందా..?! హేమిటో మరి..!!!

అన్నట్టు ఆమ్రపాలి వంటి స్పీడ్ ఐఏఎస్ అధికారులకు అయిదేసి రోజులు పట్టిందట… అంటే సగటున ఒక ఫైల్‌కా ..? ఎన్ని ఫైళ్లు అయిదు రోజుల్లో..? ప్రభాకర రెడ్డి ‘ముస్తాబు’ బాగుందట, కానీ పనితీరు మెరుగుపరుచుకోవాలట.,. అంటే ఏమిటో..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…
  • విజయ్‌లో ఓ సుగుణం… తక్కువ మాట్లాడతాడు… అవసరమైతే తప్ప…
  • ‘ఆపరేషన్ సిందూర్-2’ …. ఇదే సంభవిస్తే కథ పూర్తిగా వేరే ఉంటది..!!
  • ‘చక్రధారి’ స్టాలిన్..! పర్‌ఫెక్ట్ ‘చదరంగం’… మళ్లీ తన పెత్తనమే…!!
  • పిల్లలు మన నీతులు వినరు – మన ప్రవర్తనను అనుసరిస్తారు
  • బుడ్డోడు నిలబడకపోతే… మిగతా ప్లేయర్లు వరుసగా పడిపోవడమే..?!
  • చైనా మిలిటరీలో సంక్షోభం… మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష…
  • పాకిస్థాన్‌ను గంగవెర్రులెత్తించే వార్త… భారత్‌కు మరిన్ని ఎస్-400 …
  • డౌన్ టు ఎర్త్… బ్రహ్మచారి… పుదుచ్చేరి అంటే ఎన్.రంగస్వామే…
  • సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions