Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…

May 11, 2026 by M S R

.

క్రిెకెట్ ప్రేమికులు ఈసారి రాత్రి ఆ చివరి ఓవర్ చూసి మస్తు థ్రిల్ ఫీలై ఉంటారు… వాట్ ఏ ఓవర్… బాల్ బాల్ కూ ట్విస్టు… చివరి బాల్ దాకా ఉత్కంఠ… కామెంటేటర్ల భాషలో చెప్పాలంటే నరాలు తెగే ఉత్కంఠ… నిజంగానే స్టేడియంలో ప్రేక్షకులు లేచి నిలబడి ఆ ఉత్కంఠను అనుభవించారు… ఓసారి వివరంగా చెప్పుకుందాం…

ముంబైకి బెంగుళూరుకు నడుమ మ్యాచ్… ఈ సీజన్‌లో ముంబై మొదటి నుంచీ బాగా ఆడటం లేదు మనకు తెలుసు… బుమ్రా, సూర్యకుమార్, రోహిత్ శర్మ వంటి అతిరథులున్నా ఆట అంతంతమాత్రమే… మరోవైపు డిఫెండింగ్ చాంపియన్లు బెంగుళూరు మంచి ఆటతీరు కనబరుస్తోంది…

Ads

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 166 రన్స్ చేసింది.., పవర్ ప్లేలో భువనేశ్వర్ మూడు వికెట్లు తీసి ముంబై వెన్నెముక విరిచాడు… తరువాత బ్యాటింగుకు దిగింది… బెంగుళూరు మొదటి ఓవర్‌లోనే కోహ్లీ ఔట్… ఁఇది రెండో వరుస డకౌట్… గాయాలతోనే బాధను ఓర్చుకుంటూ, మొండిగా క్రీజులో నిలబడి కృనాల్ పాండ్యా 73 రన్స్ చేశాడు…

చివరి ఓవర్‌కు వద్దాం… అప్పటికి 7 వికెట్లు పడ్డాయి… హిట్టర్లు లేరు… 16 పరుగులు చేయాలి…

ఫస్ట్ బాల్… బావా బౌలింగ్… వైడ్… ఆరు బాల్స్ 15 పరుగులు కావాలి…

మళ్లీ ఫస్ట్ బాల్… ఈసారి నో బాల్… సో, ఆరు బాల్స్ 14 పరుగులు కావాలి…

ఫ్రీ హిట్ బాల్… షెఫర్డ్ ఒకటే రన్ తీశాడు… సో, 5 బాల్స్, 13 పరుగులు కావాలి…

సెకండ్ బాల్… వైడ్, ఓ రన్ కూడా తీశారు, అంటే 2 రన్స్… 5 బాల్స్, 10 పరుగులు కావాలి…

మళ్లీ సెకండ్ బాల్… నో రన్…

మూడో బాల్… షెఫర్డ్ ఔట్…

నాలుగో బాల్… భువనేశ్వర్ వచ్చాడు బ్యాటింగుకు, బౌలింగులో నాలుగు వికెట్లు తీశాడు సరే, ఈ పది చేయగలడా..? వైడ్… సో, 4 బాల్స్, 9 రన్స్ కావాలి…

మళ్లీ నాలుగో బాల్… ఈసారి భువనేశ్వర్ సిక్స్ కొట్టాడు… సో, 3 బాల్స్, 3 రన్స్ కావాలి…

అయిదో బాల్… సింగిల్ రన్ వచ్చింది… సో, ఒక బాల్, రెండు రన్స్ కావాలి… ఒకటి చేస్తే సూపర్ ఓవర్ తప్పదు… గెలవాలంటే రెండు రన్స్ చేయాలి…

ఆరో బాల్… ఆడుతున్నది రసిఖ్ సలాం… కొట్టాడు… ఒక రన్, తరువాత మరో రన్‌కు ఉరుకుతున్నాడు… ఫీల్డర్ స్టంప్స్ పైకి బాల్ విసిరాడు… కానీ నో యూజ్… టూ రన్స్ వచ్చాయి… థర్డ్ అంపైర్ నాటవుట్ అని ప్రకటించాడు… బెంగుళూరు ఓ అసాధారణ ఓవర్‌లో గెలిచేసింది… లక్ కూడా కలిసొచ్చింది…

ఈ దెబ్బకు ముంబై ఇంటికి వెళ్లిపోయింది… అవమానకరంగా… బెంగుళూరు 14 పాయింట్లలో, మంచి రన్‌రేటుతో టాప్ వన్ ప్లేసులోకి చేరిపోయింది… హైదరాబాద్, గుజరాత్ కూడా 14 పాయింట్లే… కానీ రన్ రేట్ ఆధారంగా రెండు, మూడు ప్లేసుల్లో… అంతకుముందు, అంటే మధ్యాహ్నం జరిగిన మ్యాచులో లక్నో జట్టు చెన్నై మీద ఓడిపోయి అదీ ఇంటి దారి పట్టింది… సో, రెండు జట్లు ఔట్… మొదటి నుంచీ దరిద్రంగా ఆడుతున్న చెన్నై హఠాత్తుగా పుంజుకుని 3 వరుస గెలుపులతో 5వ ప్లేసులోకి వచ్చింది… విశేషమే… పాపం, రాజస్థాన్ 6వ ప్లేసు..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…
  • విద్వేషం లేదు- విషం లేదు..! సరైన దిశలో ఒక పీఎం- ఒక సీఎం…!!
  • ఇది బాబాయ్ హోటల్ స్టోరీ అస్సలు కాదు … జస్ట్, ఒక బాబాయ్ స్టోరీ …
  • ఇది యూనివర్శల్… ఇంత భట్టీయం పుస్తకం మరొకటి లేదు…
  • ఖైదీకి మనసిచ్చింది… మనువాడింది… లవ్ జిహాద్ కాదు… రివర్స్…
  • మ్యాచులు పెద్దగా చూడటం లేదు… జియో ఆదాయానికి భారీ దెబ్బ…
  • వ్యూహకర్త నుంచి ‘మంత్రి’ వరకు.., విజయ్ కేబినెట్‌లో కీర్తన మెరుపులు..!
  • బాబు గారి పాలన అంటే అంతే మరి… జస్ట్, 9 సెకన్లకు ఓ ఫైల్ క్లియర్…
  • విజయ్‌లో ఓ సుగుణం… తక్కువ మాట్లాడతాడు… అవసరమైతే తప్ప…
  • ‘ఆపరేషన్ సిందూర్-2’ …. ఇదే సంభవిస్తే కథ పూర్తిగా వేరే ఉంటది..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions