.
హబ్బ… ఎంత సంస్కారం, ఎంత హుందాతనం, తను ముఖ్యమంత్రి అయ్యాక జోసెఫ్ విజయ్ పాత ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్లాడు… వాట్ ఏ గ్రేట్ గెశ్చర్… అని చాలామంది పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో… ట్రూ… నిజం… అభినందిద్దాం.., మంచి వ్యవహార ధోరణి… తను సీఎం గాకుండా అనేక అంశాలు, రాజకీయాలు అడ్డుపడుతున్నా సరే ఎవరినీ ఒక్క మాట నిందించకుండా ఎలా హుందాగా, నిండుగా కనిపించాడో… ఇదీ అంతే… అయితే..?
మరో కోణం కూడా చూడాలి… విజయ్ థాంక్స్ చెప్పడానికి వెళ్లాడు స్టాలిన్ దగ్గరకు… ఎందుకంటే..? బీజేపీ, అన్నాడీఎంకే విశ్వప్రయత్నాలు చేశాయి విజయ్ సీఎం గాకుండా… చివరకు అన్నాడీఎంకేలోనే చీలిక ప్రమాదం ఏర్పడితే… డీఎంకే- అన్నాడీఎంకే ఉమ్మడి ప్రభుత్వం దాకా ఆలోచనలు, సంప్రదింపులు, ప్రయత్నాలు చేశారు… ఈ స్థితిలో మేం 107 మందిమీ రాజీనామా చేస్తామని ఇదే విజయ్ హెచ్చరించాడు…
Ads
ఈ స్థితిలో మొత్తం చక్రం తిప్పింది స్టాలిన్… విజయ్ సీఎం కావడానికి అన్ని అడ్డంకుల్ని తనే ఛేదించి, తమ మిత్రపక్షాల్ని కూడా ఇచ్చి, బీజేపీ-అన్నాడీఎంకే ఎత్తులన్నీ బ్రేక్ చేసి… విజయ్ సీఎం అయ్యే మార్గాన్ని క్లియర్ చేసి సహకరించింది స్టాలిన్… తద్వారా అన్నాడీఎంకేను మరింత దెబ్బతీయడం, పరోక్షంగా తన మిత్రపక్షాల ద్వారా విజయ్ ప్రభుత్వం తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడం… అదీ స్ట్రాటజీ…
తనెలాగూ ఓడిపోయాడు… సీనియర్ పొలిటిషియన్ కదా, బాధ నుంచి గంటల్లోనే తేరుకున్నాడు, తన నియోజకవర్గానికి వెళ్లాడు, కేడర్‌ను కలిశాడు… అదీ గ్రేట్… (గతంలో కరీంనగర్‌లో బండి సంజయ్ చేసిందీ ఇదే)… ఓడిపోతావా గెలుస్తావా అనేది కాదు, ఓడినా గెలిచినా జనంలో ఉన్నావాలేదానేది ముఖ్యం… ఓడిపోగానే జనంపై అలిగి ఫామ్‌హౌజులో పడుకోవడం కాదు నిజమైన ప్రజాజీవితం అంటే… గెలిచినా గడీభవన్ వదిలి రాకపోవడమూ అంతే…

ఎప్పుడైతే 10 సీట్ల దాకా విజయ్‌కు అదనపు మద్దతు కావాలో… ముందుగా కాంగ్రెస్‌ను, తరువాత వీసీకే, లెఫ్ట్, ఐయూఎంఎల్… అందరినీ ఒప్పించి, పంపించింది స్టాలిన్… ఆ పార్టీలన్నీ బీజేపీ భావజాల వ్యతిరేక పార్టీలే… సో, తమిళనాడులో బీజేపీ ప్రభావం ఎక్కడికక్కడ తుంచేయడానికి, అడ్డుకోవడానికి విజయ్‌కు మద్దతునిద్దాం అని చెప్పి ఒప్పించింది స్టాలిన్…
మన చేతుల్లో ఉంటుంది ప్రభుత్వం అనీ చెప్పాడు… సో, స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ థాంక్స్ చెప్పాడు విజయ్… ఇంటికి రాగానే ఆయన ఈయనకు శాలువా కప్పాడు, ప్రతిగా ఈయన ఆయనకు కప్పాడు… గుడ్ గెశ్చర్… అయిపోలేదు, అన్నాడీఎంకేను చీలుస్తాడు స్టాలిన్, చూస్తూ ఉండండి…
30 odd ADMK MLAs have chosen SP Velumani as ADMK Legislative Party leader. 17 MLAs have chosen EPS as ADMK Legislative Party leader…. తాజా వార్త…
నిజానికి కొన్ని అసాధారణం ఏమీ కావు… ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లాడు… అదీ సంస్కారమే… (అఫ్‌కోర్స్, కొన్ని రక్షణ సంబంధ వ్యవహారాల గుట్టమట్ల మార్పిడి ఉంటుంది కూడా…) అంతేకాదు, ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రధానులు, ప్రతిపక్షాలు హాజరై ‘పొలిటికల్ ప్రొటోకాల్’ పాటిస్తున్నారు కూడా…
రాజస్థాన్‌లో వసుంధర రాజే సింధియా, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా సేమ్… ఇలాంటివి సమాజంలో తమ స్థాయిని పెంచేవే తప్ప తగ్గించేవి కావు… రాజకీయాల్లో ప్రజాతీర్పును హుందాగా స్వీకరించడం, అంగీకరించడం, విజేతను అభినందించడం… దీనికి మంచి మనోధైర్యం కూడా కావాలి… ఎటొచ్చీ తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం ఆశించలేని ‘మర్యాద’ ఇది…
కెేసీయార్ సంగతి చూస్తూనే ఉన్నాం కదా… తను ప్రజలకే మొహం చాటేశాడు… జగన్ కూడా నిజంగా ప్రజాజీవితంలో చురుకుగా ఉన్నాడా..? తనే ఆలోచించుకోవాలి… రాజకీయాలు అంటేనే వ్యక్తుల నడుమ బూతులు, కత్తి యుద్ధాలు అన్నట్టుగా మారిపోయాయి…
ప్రజాస్వామ్యంలో విమర్శ , విబేధించటం చాలా అవసరం … డూడూ బసవన్నలలాగా , తమ (వి)నాయకులు పందిని నంది అన్నా జై కొట్టే బానిస మనస్తత్వం నుండి విముక్తులు కావాలి … హుందాతనం నేర్చుకోవాలి … కానీ మరీ ప్రత్యేకించి చోటా నాయకులు, సోషల్ మీడియా శునకబలగాల నుంచి ఇది ఆశించడం మరీ అత్యాశే కదా ఇప్పుడు..?!
Share this Article