Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…

May 14, 2026 by M S R

.

శని అమావాస్య – పితృ శాంతి ప్రత్యేకం || నారాయణ బలి పూజ, త్రిపిండి శ్రాద్ధం, పితృ దోష శాంతి పూజ మరియు తిల హోమం … పితృల శాపాల నుండి విముక్తి, అలాగే మరణించిన ఆత్మలకు శాంతి కోసం… వెంటనే బుక్ చేసుకొండి, ప్రత్యేక పూజలు… జస్ట్ 851 కడితే చాలు……. ఇలా సోషల్ మీడియా యాడ్స్ కనిపిస్తున్నాయా..? రకరకాల శని దశలతో అవస్థల పాలవుతూ, ఈ పూజలకు- పితృకర్మలకు బుక్ చేయాలని యోచిస్తున్నారా..?

ఉత్తదే… అంతా దందా… కొన్ని ముఠాల ఆధ్యాత్మిక వ్యాపారం… శని అమావాస్య… ఆన్‌లైన్ ‘క్లిక్’ పూజల మాయలో పడకండి…. స్వయంగా వెళ్తేనే సిసలైన దోష పరిహారం! ఈ శని అమావాస్యే కాదు, రకరకాల గుళ్లల్లో పూజలు, నదీప్రవాహాల వద్ద పితృకర్మల పేరిట కూడా యాడ్స్ కనిపిస్తున్నాయి…

Ads

ఆధ్యాత్మికతకు, నమ్మకానికి పరీక్షా కాలం లాంటిది ఈ శని అమావాస్య… ఈ ఏడాది మే 16న వస్తున్న ఈ పర్వదినం అత్యంత విశిష్టమైనది… అయితే, ఈ భక్తిని వ్యాపారంగా మార్చుకుంటున్న ఆన్‌లైన్ సంస్థల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది…

ఏమీ చేయరు.. కేవలం డబ్బు వసూలు చేస్తారు! … సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకటే హోరు… “ప్రముఖ క్షేత్రాల్లో మీ పేరున పూజలు చేస్తాం, దోషాలు పోగొడతాం” అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు… కానీ క్షేత్ర స్థాయిలో జరిగేది వేరే… వేల రూపాయలు వసూలు చేసే ఈ సంస్థలు, పవిత్రమైన పూజా కార్యక్రమాలను కేవలం ఒక మెకానికల్ ప్రక్రియగా మార్చేస్తున్నాయి… అసలు మీ పేరున సంకల్పం జరిగిందో లేదో కూడా తెలియని పరిస్థితి… భక్తి అనేది ఒక అనుభూతి, అది ఆన్‌లైన్ ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చే వస్తువు కాదు…

శని

ఈ శని అమావాస్య ఎందుకు ప్రత్యేకం? … జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు వచ్చే అమావాస్యను ‘శనిశ్చరి అమావాస్య’ అంటారు… ఈసారి విశేషం ఏమిటంటే…

  • శని జయంతి…: పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజే శని దేవుడు జన్మించాడు… అది శనివారం కావడం వల్ల శక్తి రెట్టింపు అవుతుంది…

  • దోష నివారణకు అమోఘం…: ఏల్నాటి శని, అర్ధాష్టమ శని లేదా జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి ఈ రోజు చేసే పూజలు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి…

  • పితృ దేవతల ఆశీస్సులు…: అమావాస్య పితృ తర్పణాలకు ప్రశస్తమైనది… ఈ రోజు తర్పణాలు వదిలితే పితృ దోషాలు తొలగిపోతాయని నమ్మకం…

ఆడంబరాలు వద్దు.. ఆచరణ ముద్దు! …. వందల మైళ్ల దూరంలో ఉన్న గుళ్లలో ఆన్‌లైన్ పూజల కోసం వేలు తగలేయడం కంటే, మీ ఇంటి సమీపంలో ఉన్న నవగ్రహాల గుడికి లేదా శని విగ్రహం ఉన్న ఆలయానికి వెళ్లడం ఉత్తమం… భగవంతుడు మీ శ్రమను, చిత్తశుద్ధిని చూస్తాడు కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను కాదు…

స్వయంగా చేయాల్సిన చిన్నపాటి పూజ….: పెద్దగా హడావుడి అక్కర్లేదు… మీ చేతులతో ఇవి సమర్పిస్తే చాలు… నల్ల నువ్వులు, శని దేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి… నువ్వుల నూనె, ఓ చిన్న ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి… ఆ వెలుగు మీ జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది… విగ్రహం మీద అభిషేకించండి… నల్ల రిబ్బన్ లేదా వస్త్రం, ఒక చిన్న నల్లటి వస్త్రం ముక్కను సమర్పించడం వల్ల దోష పరిహారం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది… ప్రముఖ గుళ్ల వద్ద కొబ్బరికాయలు, పూలు అమ్మేవాళ్లే నూనె, రిబ్బన్ ముక్క, నువ్వులను అమ్ముతారు…

స్వయంగా వెళ్తేనే పుణ్యం.. ఎందుకు? …. మన పాప – దోష పరిహారాల కోసం మనం కొంత శ్రమ పడాలి… ఆలయానికి వెళ్లడం, అక్కడ పదిమంది భక్తుల మధ్య దైవ దర్శనం చేసుకోవడం వల్ల కలిగే ‘పాజిటివ్ వైబ్రేషన్స్’ ఆన్‌లైన్ వీడియోల్లో దొరకవు…. మీ చేతులతో మీరు చేసే నూనె అభిషేకం లేదా దీపారాధన మీ మనసులో కలిగించే తృప్తి, ప్రశాంతతే అసలైన పరిహారం…

భక్తిని డిజిటల్ మయం చేసి మోసపోకండి… ఈ శని అమావాస్య నాడు సోమరితనాన్ని వదిలి, సమీపంలోని ఆలయానికి నల్ల నువ్వులు, నూనెతో వెళ్లండి… వీలైతే ఈ రోజున పేదవారికి అన్నదానం లేదా వస్త్ర దానం చేయండి… శని దేవుడు కర్మ ప్రదాత… మీ నిజాయితీతో కూడిన ప్రయత్నానికి ఆయన తప్పక అనుగ్రహిస్తాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?
  • భారీ మలుపు తిరిగిన ‘అదృశ్య సరస్వతి’… త్రివేణీ సంగమం…!!
  • What is Real Success..? నిజమైన సక్సెస్ స్టోరీ అంటే ఏమిటి..?
  • పాకిస్థాన్‌కు సింధుగండం… ఇండియా జలాల మళ్లింపు షురూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions