.
Subramanyam Dogiparthi … ఫక్తు బాలకృష్ణ మార్క్ రొమాంటిక్ ఏక్షన్ సినిమా 1992 లో వచ్చిన ఈ ధర్మక్షేత్రం . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ , దివ్యభారతిల మీద డ్యూయెట్లన్నీ కాటా కుస్తీలు లాగానే ఉంటాయి . రాఘవేంద్రరావుని దాటేసారు .
టూకీగా చెప్పాలంటే దుష్టశిక్షణ సినిమా . పరుచూరి బ్రదర్స్ నేసిన ఈ కధ : ఓ నగరంలో రెండు రౌడీ/ గూండా ముఠాల ఆధిపత్య పోరు , కాలేజీ కుర్రాళ్ళను పావుల్లాగా వాడుకోవటం , ఆ పోరులో నగర ప్రజలు సతమతం కావటం , ఆ ప్రజల్ని రక్షించే లాయర్ బెనర్జీ (బాలకృష్ణ) , కాలక్రమంలో ఇద్దరు గూండాలు ఏకం కావటం , విలన్లను శత్రువు సినిమాలో లాగా రూల్స్ ప్రకారం తుదముట్టించటం , క్లైమాక్స్ కోర్ట్ హాల్లో హీరో బాలకృష్ణ గారి సుదీర్ఘ ప్రసంగంతో సినిమా ముగుస్తుంది .
Ads
బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా నటించారు . సరసన దివ్యభారతి, ముఖ్యంగా పాటల్లో అదరగొట్టేసింది . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , నాజర్ , జ్యోతి , రామిరెడ్డి , దేవన్ , శ్రీహరి , బ్రహ్మాజీ , జయలలిత , సాక్షి రంగారావు , సుధారాణి , పోసాని తదితరులు నటించారు .
సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోతానికి కారణం ఇళయరాజా సంగీతం , వేటూరి , సిరివెన్నెల పాటలు , బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర , మనో గాత్రం . వీటిని మించి డాన్సుల్ని కంపోజ్ చేసిన తార , సుందరం , ప్రభుదేవాలు ; కోదండరామిరెడ్డి అందమైన చిత్రీకరణ .
అన్ని పాటలు హీరోహీరోయిన్ల మీదనే . వాటిల్లో రెండు గ్రూప్ డాన్సులు . బాగుంటాయి . కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య ఒకటి . ఈ జలపుష్పాల గురించి సిరివెన్నెల వారు ఎలా ఔపాసన పట్టారో ! మరొకటి అరె ఇంకా జంక జింక పెంకితనంగా పాట . ఇదీ బృంద నృత్యమే .
పెళ్ళికి ముందే ఒక్కసారి చూపించవా ప్యారీ తేరీ , ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ , చెలి నడుమే అందం నడకే నాట్యం , ముద్దుతో శృంగార బీటు కొట్టగానే అంటూ సాగే డ్యూయెట్లు బాలకృష్ణ అభిమానులను ఊపేస్తాయి .
కె సి రెడ్డి నిర్మాత . చాలా భాగం విశాఖపట్నంలో షూట్ చేసారు . సినిమా యూట్యూబులో ఉంది . దివ్యభారతి అభిమానులు కూడా ట్రై చేయవచ్చు …
(తొడిమ తెరిచే తొనల రుచికే అంటాడు ఓచోట వేటూరి… ఇది కాస్త బాలేదు గానీ… మరోచోట అదే పాటలో పెదవి కొరికే పెదవి కొరకే అనే ప్రయోగం రొమాంటిక్‌గా బాగుంది… ఈ సినిమాలో పాటలన్నీ శృంగార- కాదు, కాదు, సంభోగ ఆలాపనలు, మూలుగులే…)
Share this Article