Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సెల్వమణితో రోజా ప్రేమకథ ఇక్కడ పుట్టి… పదేళ్లకు వర్కవుట్…

May 24, 2026 by M S R

.

Subramanyam Dogiparthi…. బాబీలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ . R K సెల్వమణి తమిళంలో తీసిన చెంబరుతి సినిమాకు రీమేక్ అని చెప్పవచ్చు మన తెలుగు చామంతి సినిమా . ఒకేసారి రెండు భాషల్లోను నిర్మించారు .‌ అలా అనటానికి కూడా వీలు లేదేమో ! ఒక్క సత్యనారాయణ ఉండే సీన్లు మాత్రమే రీషూట్ చేసారు . మిగిలిందంతా డబ్ చేసారని చెప్పవలసి ఉంటుంది .

అయితే తమిళంలో హిట్టయినట్లు తెలుగులో కాలేదు . బహుశా నటీనటులు అందరూ తమిళులు కావటం వలనేమో ! భానుమతి , నాజర్ , అనిత , రోజా వంటి తెలుగులో కూడా నటించే తారలు ఉన్నారు . ఐనా సరే  తమిళ సినిమా హిట్టయినట్లుగా మన తెలుగు సినిమా కాలేదు .

Ads

రోజాకు తమిళంలో ఇది మొదటి సినిమా . సెల్వమణిని తర్వాత పదేళ్ళకు రోజా పెళ్లి చేసుకుంది . ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , దర్శకత్వం ఆయనవే .‌ టూకీగా కధ ఏంటంటే : సత్యనారాయణ , భానుమతి కోటీశ్వరులు . వారి కుమారుడు పెళ్లి చేసుకుని ఒక కొడుకుతో సహా వస్తాడు . సత్యనారాయణ ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మని చెపుతాడు . లండన్లో సెటిలయిన అతను చనిపోయే ముందు కొడుకుని ఇండియాకు వెళ్లి నాయనమ్మను కలుసుకొమ్మని కోరుతాడు .‌

మనమడు ప్రశాంత్ బామ్మను కలిసినా ఆమె అంగీకరించదు . అక్కడే పీఠం వేసిన మనమడిని ఇంట్లోకి రానిస్తుంది . భానుమతి వద్దే ఉండే రోజాని ప్రశాంత్ ప్రేమిస్తాడు . భానుమతి అల్లుడు నాజర్ ఆస్తి కొరకు వెయిట్ చేస్తూ ఉంటాడు . అతని కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనేది అతని ఆలోచన .‌

ఇక్కడ నుండి కధ మలుపులు తిరగటం ప్రారంభం అవుతుంది . రోజా అన్న రాధా రవి వాళ్ళ పల్లెలో ఉన్న అతనితో లగ్నం పెట్టిస్తాడు . మనమడి కోసం భానుమతి రాజీపడి రోజా ఇంటికొచ్చి తన మనమడికి రోజాకి పెళ్లి చేయమని అడుగుతుంది . రాధా రవి ఒప్పుకున్నా విలన్లందరూ ఏకమై జంటను విడదీస్తారు . ఛేజింగులు , ఫైటింగులు , చివర్లో శుభాంతం అవుతుంది .

క్లైమాక్సులో సముద్రంలో చేజింగులు , ఫైటింగులు బాగుంటాయి . సెల్వమణి బాగానే తీసాడు . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు కూడా శ్రావ్యంగా ఉంటాయి . డాన్సులను సెల్వమణి చాలా బాగా చిత్రీకరించారు . చామంతి పువ్వే చిందులేసి చూడు సంబరాల జాతరలో గ్రూప్ డాన్స్ బాగుంటుంది . భానుమతి కూడా పాడుతుంది .

నీలో నాలో , ఇదే రాజయోగం ఇదే మోహబంధం డ్యూయెట్లు బాగుంటాయి . కడలే నీకు తల్లితండ్రి రావయ్యా , నీ కధ నీదేలే నా కధ నాదేలే , అరె వజ్రం వచ్చింది సామిరంగా పాటలు శ్రావ్యంగా ఉంటాయి . వేటూరి , రాజశ్రీ , వెలిదండ్ల శ్రీరామమూర్తులు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , శ్రీనివాస్ , భానుమతి పాడారు .

ఇతర ప్రధాన పాత్రల్లో అనిత , వాసవి , వైష్ణవి అరవింద్ తదితరులు నటించారు . కొంపెల్ల విశ్వం డైలాగులను వ్రాసారు . సినిమా అంతా సముద్రం తీరాన జరుగుతుంది . లోకేషన్స్ అందంగా ఉంటాయి .
1994 లో హిందీలోకి కూడా ఆవో ప్యార్ కరే అనే టైటిలుతో రీమేక్ అయింది . సైఫ్ ఆలీ ఖాన్ , శిల్పాశెట్టి లీడ్ రోల్సులో నటించారు .

అరవ వాసన కనిపించటం వలన తమిళంలోలాగా తెలుగు వెర్షన్ ఆ లెవెల్లో ఆడలేదేమో ! సినిమా చూడబులే . రోజాను పాటల్లో చాలా అందంగా చూపారు దర్శకుడు . యూట్యూబులో ఉంది . ట్రై చేయవచ్చు .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ బీజేపీ మరో మణిమకుటం… ఇదీ తన ‘క్నాలెడ్జి’…
  • సెల్వమణితో రోజా ప్రేమకథ ఇక్కడ పుట్టి… పదేళ్లకు వర్కవుట్…
  • RDSS … కేసీయార్ మరిచిన విజ్ఞత-! రేవంత్ చూపించిన పరిణతి..!
  • బాధలో భర్తకు తోడుగా నీడగా… ఈ అమెరికన్ తులసిని మెచ్చుకోవాలి…
  • రైల్వే స్టేషన్ మధ్యలోనే కబ్జాలు… చివరకు బుల్‌డోజర్లే సొల్యూషన్…
  • మళ్లీ కాల్పుల కలకలం…! ఇరాన్‌కు ట్రంప్ భౌతిక లక్ష్యమా..?
  • ఏపీ పెట్టుబడుల కథల్లో… లెక్కలకంటే ‘సంపాదన’ ప్రశ్నలే ఎక్కువ..!
  • ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది కూడా… రమణీ కల్యాణం మీద ఒట్టు…
  • ఐపీఎల్ చివరి దశలోనూ బుడ్డోడే మళ్లీ కీలకం… అదెలాగంటే…
  • కుర్చీ మడతపెట్టిన తాతకు ఎందరు ఫాలోయర్లు ఉన్నారో తెలుసా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions