.
సంఘ విద్రోహ శక్తులు, తుక్‌డే తుక్‌డే గ్యాంగులు అత్యున్నత లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థం కాని టెక్నాలజీ వాడి, వేలాది మందిని వీథుల్లోకి రప్పించారు అనే వివరణలు, కథనాలు బాగా కనిపిస్తున్నాయి… అదేనండీ ఢిల్లీ అల్లర్లలో… విద్యార్థుల పేరుతో… హఠాత్తుగా అక్కడికి యాంటీ నేషన్ ఫోర్సెస్ రావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడిందట… ఎందుకు..?
అల్లర్లు జరిగే అవకాశం ఉందని సందేహించినప్పుడు వెంటనే ఆ ఏరియాలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పనిచేయకుండా ఇంటర్‌నెట్ ఆపేస్తుంటారు పోలీసులు… సహజం, అవసరం కూడా! అయితే ఇంటర్‌నెట్ లేకపోయినా సరే… వైఫై లేకపోయినా సరే… సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పనిచేయకపోయినా సరే, సాధారణ టెలికాం సర్వీసులు నిలిపివేసినా సరే… మరి పరస్పరం ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు ఆందోళనకారులు?
Ads
ఇది నిజమో కాదో, ఎంతవరకు పనిచేస్తుందో, టెక్నికల్‌గా ఆచరణసాధ్యత ఎంతో నిపుణులే తేల్చాలి… శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో కూడా ఇలాంటి విధానమే యూజ్ చేశారట… గూగుల్ మాజీ సీఈవో ఎవరో ప్రత్యేకంగా ఓ టూల్‌కిట్ రూపొందించాడట… అదే ఢిల్లీలోనూ వాడారని ఆ కథనాలు చెబుతున్నాయి… ఏమనీ అంటే..?
‘‘సిమ్ కార్డు లేకపోయినా సరే, నెట్- వైఫై లేకపోయినా సరే ఈ టూల్ కిట్ ద్వారా కమ్యూనికేట్ చేసుకున్నారు… తమ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేశారు… నిరసనకు ముందేం చేయాలి, నిరసన వేళల్లో ఏం చేయాలి, నిరసన తరువాత ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి వివరంగా స్కెచ్ వేసి కమ్యూనికేట్ చేసుకున్నారు… ప్రభుత్వాన్ని దింపే కాన్‌స్పిరసీ, దీనివెనుక ఏయే శక్తులున్నాయో కేంద్రం కనిపెట్టాలి…
ముందుగా సిటీ ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటారు… తరువాత బిట్‌చాట్ (bitchat), బ్రియార్ (briar) యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు… అవి బ్లూటూత్ ద్వారా అయిదారు మీటర్ల వరకూ ఏ నెట్ సర్వీసు లేకపోయినా పనిచేస్తాయి… వాటి నుంచి ఒకరికొకరు సందేశాలు పంపుకోవాలి… పోలీసుల కదలికలను షూట్ చేసి, పంపించుకోవాలి… అంటే సమాచారవ్యాప్తి…’’
….. ఇలా సాగిపోయాయి కథనాలు… బ్లూటూత్ యాప్స్ అంత పర్‌ఫెక్ట్‌గా చాలాదూరం పనిచేయగలవా అనేది ఓ డౌట్… అలాగే బ్లూటూత్ మెష్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లౌడ్ వంటి టెక్నికల్ చిట్కాలు నిజంగానే వేలాది మందిని ఓ వార్ మోడ్‌లో నడిపించగలవా అనేదీ డౌట్… ఇలా చాలాా సందేహాలున్నాయి ఈ కథనాల మీద… అందుకే ముందుగానే చెప్పింది, నిజానిజాలు ఏమిటో కేంద్ర సంస్థలు తేల్చాలి… దీనిపై విరుగుడు ఏమిటో అర్జెంటుగా కనిపెట్టాలి..!!
మరి ప్రభుత్వం ఏమీ చేయలేదా..? చేసింది! విధ్వంసం, పోలీస్ బలగాలపై దాడులు, అసాంఘిక నినాదాలు, ప్లకార్డులు, అల్లర్లకు పాల్పడేవాళ్లను ఆధునాతన, ఎఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలతో షూట్ చేసింది… 360 డిగ్రీస్… మొహానికి మాస్క్ వేసుకున్నా పక్కాగా వాళ్ల పిక్చర్స్, ప్రొఫైల్స్ ప్రిపేరవుతున్నాయి… వందల మందిని ఐడెంటిఫై చేస్తున్నారు… రేప్పొద్దున వీసాలకు, పాస్‌పోర్టులకు, కొలువులకు ఇవి వాళ్లకు నెగెటివ్ కాబోతున్నాయి!!
Share this Article