Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ బీజేపీ మరో మణిమకుటం… ఇదీ తన ‘క్నాలెడ్జి’…

May 24, 2026 by M S R

.
Murali Buddha ….. ఇతని ప్రకటన బాగా నచ్చింది ? ఎందుకు ?
సినిమా నాలెడ్జ్ ప్రకారం అత్యాచారం అంటే అమ్మాయి వెంట విలన్ పరుగులు పెడతాడు . నానాభీభత్సం చేసి అత్యాచారం చేస్తాడు .
కానీ వాస్తవ జీవితంలో అలా ఉండదు కదా ?

ఇతను, అనగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తలుచుకుంటే అతని సినిమా నాలెడ్జ్ ను చట్టంగా మార్చగలడు … అత్యాచారానికి సినిమా నిర్వచనం వేరు … చట్టం నిర్వచనం వేరు .
నీకు ఇతని ప్రకటన ఎందుకు నచ్చిందో కానీ నాకు నచ్చలేదు అంటారా..?

పైడి

Ads

నాకు నచ్చడానికి కారణం ఉంది . చట్టాలు చేసే వారికి కూడా చట్టాలు ఎవరు చేస్తారో తెలియదు అని ఇతని ప్రకటనతో నాకు తెలిసి వచ్చింది . ఇతనికి తెలియని విషయం చట్టాలు చేసేది వీళ్ళేనని. రాష్ట్రాల్లో mla లు , కేంద్రంలో ఎంపీలు చట్టాలు చేస్తారు . ఆ విషయం నిజంగా వారికి తెలియదు . mp , mla అంటే కాంట్రాక్ట్ లు , పైరవీలు , బదిలీలు చేయడం ప్రధాన వృత్తి అనుకుంటారు .

వీళ్ళు కూర్చునే వాటిని చట్ట సభలు అని … అక్కడ చట్టాలు చేస్తారు అనేది వీరికి నిజంగా తెలియదు . చట్టాలు చేసేది అధికారులు కానీ మాకేం పని అనుకుంటారు …

ఓసారి ఓ బీజేపీ mla RTI కి ఫోన్ చేసి సమాచారం కోసం ప్రభుత్వ ఆఫీస్ లో దరఖాస్తు చేయడం , అటు నుంచి RTI దాకా పోవడం దేనికి, ఇదంతా బాగాలేదు . నేరుగా RTI కమిషన్ కే దరఖాస్తు చేసేట్టు ఉండాలి అని అంటే మంచి ఐడియా అలానే చట్టం చేయండి అన్నాను …. చట్టం మేమెలా చేస్తాం అధికారులు చేయాలి కానీ అన్నాడు …




…. ఇదీ ఆ పోస్టు… ఇంతకీ ఈ తెలంగాణ బీజేపీ కీర్తకిరీటం ఎవరో, ఈయన గారి నేపథ్యం ఏమిటో తెలుసా..? వికీపీడియా ప్రకారమే సుమా… నిజామాబాద్, ఆర్మూర్ మండలంలోని అంకాపూర్… 1987 ఆగస్టులో యూఏఈలో సిద్దిపేట తాపీ మేస్త్రీ కింద భవన నిర్మాణ కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు…

తరువాత 1994లో భారతదేశానికి తిరిగి వచ్చి… హాంకాంగ్ నుండి యూరప్, గల్ఫ్, ఉత్తర అమెరికాకు ఎర్ర చందనం ఎగుమతి, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్ లాంటి ఇతర వ్యాపార రంగాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు…

2023 జూన్ 1న బీజేపీలో చేరాడు… అదే సంవత్సరం ఆర్మూరు సీటుకు టికెట్ వచ్చింది… గెలిచాడు… అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ ఏమిటి, తన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోం అని బీజేపీ బహిష్కరించింది కదా… తరువాత రెగ్యులర్ స్పీకర్ గడ్డం ప్రసాదరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు… 2024 లోకసభ ఎన్నికల్లో తను మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Ugly story … ఓ సైకో మొగుడి డార్క్, ప్రాక్టికల్ షేడ్స్ కథ…
  • బెంగాల్‌లో బీజేపీ చేస్తే తప్పు..! అదే పని కేరళలో కాంగ్రెస్ చేస్తే..?
  • తెలంగాణ బీజేపీ మరో మణిమకుటం… ఇదీ తన ‘క్నాలెడ్జి’…
  • సెల్వమణితో రోజా ప్రేమకథ ఇక్కడ పుట్టి… పదేళ్లకు వర్కవుట్…
  • RDSS … కేసీయార్ మరిచిన విజ్ఞత-! రేవంత్ చూపించిన పరిణతి..!
  • బాధలో భర్తకు తోడుగా నీడగా… ఈ అమెరికన్ తులసిని మెచ్చుకోవాలి…
  • రైల్వే స్టేషన్ మధ్యలోనే కబ్జాలు… చివరకు బుల్‌డోజర్లే సొల్యూషన్…
  • మళ్లీ కాల్పుల కలకలం…! ఇరాన్‌కు ట్రంప్ భౌతిక లక్ష్యమా..?
  • ఏపీ పెట్టుబడుల కథల్లో… లెక్కలకంటే ‘సంపాదన’ ప్రశ్నలే ఎక్కువ..!
  • ప్రేమ గుడ్డిదే కాదు, కుంటిది కూడా… రమణీ కల్యాణం మీద ఒట్టు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions