.
దేశ రాజధాని ఢిల్లీలో 113 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక Delhi Gymkhana Club ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జాతీయ చర్చగా మారింది. ప్రధానమంత్రి నివాసం అయిన 7 Lok Kalyan Marg, కీలక రక్షణ స్థావరాలు, సెంట్రల్ విస్టా ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న ఈ క్లబ్‌కు కేంద్ర ప్రభుత్వం జూన్ 5లోపు ప్రాంగణం ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చింది.
దాదాపు 27 ఎకరాల ప్రైమ్ ప్రభుత్వ భూమిపై ఉన్న ఈ క్లబ్‌ను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. కేంద్రం అధికారికంగా “జాతీయ భద్రత”, “రక్షణ అవసరాలు”, “సున్నిత ప్రాంత భద్రత” అనే కారణాలను ప్రస్తావిస్తోంది.
Ads
ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం? ఢిల్లీ పవర్ సర్క్యూట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక అడ్రస్‌లలో ఒకటైన జింఖానా క్లబ్, దేశంలో అత్యంత హై-సెక్యూరిటీ జోన్ మధ్యలో ఉంది. ప్రధానమంత్రి నివాసానికి చాలా దగ్గరగా ఉండటంతో అక్కడ జరిగే ప్రైవేట్ ఈవెంట్లు, పెద్దఎత్తున అతిథుల రాకపోకలు, ఎలైట్ నెట్‌వర్కింగ్ సమావేశాలు భద్రతా పరంగా సున్నిత అంశంగా మారాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ప్రధాని Narendra Modi భద్రతపై వరుస హెచ్చరికలు రావడం కూడా ఈ నిర్ణయాన్ని మరింత ప్రాధాన్యంగా మార్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బెంగళూరులో సభకు ముందు పేలుడు పదార్థాలు లభ్యమవడం, ఖలిస్తానీ అనుబంధ గ్రూపుల హెచ్చరికలు వంటి పరిణామాల నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో ప్రైవేట్ యాక్సెస్‌పై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జింఖానా క్లబ్ అంటే అసలు ఏమిటి?
1913లో బ్రిటిష్ కాలంలో స్థాపించబడిన ఈ క్లబ్, చాలా కాలంగా “ఢిల్లీ ఎలైట్ కల్చర్”కు ప్రతీకగా భావించబడుతోంది. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ క్లబ్‌లో సభ్యత్వం పొందడం సాధారణ విషయం కాదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం… సభ్యత్వ ఫీజు లక్షల్లో ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్ దశాబ్దాల పాటు సాగుతుందనే ప్రచారం ఉంది. ప్రభుత్వ భూమిని తక్కువ అద్దెతో వినియోగిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. నామమాత్రపు అద్దె.
“ఎలైట్ ప్రివిలేజ్ సిస్టమ్”పై దెబ్బ?
జింఖానా క్లబ్‌పై చర్యను కొందరు కేవలం భద్రతా నిర్ణయంగా కాకుండా, ఢిల్లీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న “ప్రత్యేక సంస్కృతి”పై కేంద్రం తీసుకున్న ప్రతీకాత్మక చర్యగా చూస్తున్నారు. ప్రభుత్వ భూములు కొద్ది మంది ప్రభావశీల వర్గాల ప్రైవేట్ వేదికలుగా మారిపోయాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ చర్యతో ఆ వ్యవస్థపై పెద్ద చర్చ మొదలైంది…
CAG ఢిల్లీలోని లీజు ఆస్తులను పలుమార్లు (2000, 2009, 2021) ఆడిట్ చేసి, లోపాలను ఎత్తి చూపింది… ఢిల్లీ జింఖానా క్లబ్ (సఫ్దర్‌జంగ్ రోడ్, లూటియన్స్ ఢిల్లీ)… అత్యంత కీలకప్రాంతం… 27.3 ఎకరాలు, వార్షిక అద్దె కేవలం ₹1,000 మాత్రమే! బ్రిటిష్ కాలం (1928) నాటి ఈ 113 ఏళ్ల శాశ్వత లీజు… ఇన్నేళ్లలో అదే అద్దె…
ఢిల్లీ విమానాశ్రయం (జీఎంఆర్/డీఐఏఎల్)… భూమి విలువ ₹24,000 కోట్లు … వార్షిక అద్దె ₹100
ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ … భూమి విలువ ₹47,000 కోట్లు… వార్షిక అద్దె ₹5.82 లక్షలు… ఢిల్లీ రేస్ కోర్స్ (ప్రధాని నివాసం సమీపంలో 150 ఎకరాలు) లీజు గడువు ఎప్పుడో ముగిసినా, ఇంకా ఆక్రమణలోనే ఉంది…
Share this Article