Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?

June 8, 2026 by M S R

.

ఒక వార్త నిన్నటి నుంచీ చక్కర్లు కొడుతున్నది బలంగానే… అదేమిటంటే..? ‘‘బిగ్ బ్రేకింగ్ న్యూస్… ఈటెల రాజేందర్ మీద ఫ్లెక్సీల వివాదంలో ట్విస్ట్.. ఆ ఫ్లెక్సీలు పెట్టింది బండి సంజయ్ అనుచరుడే అని తెల్చేసి కేసు నమోదు చేసిన పోలీసులు… బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లపై పగ తీర్చుకోవడానికి, వారి ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు ఫ్లెక్సీ పెట్టిన బండి సంజయ్ అనుచరుడు, బీజేపీ నాయకుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ…

కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారించి, నిందితులు ఎవరో తేల్చిన పోలీసులు… A1 జన్యావుల రామకృష్ణ, A2 గాజుల రాకేష్ (రామకృష్ణ పీఏ), A3 సయ్యద్ కుద్రుత్ అహ్మద్, A4 సయ్యద్ మెహ్రాజ్, A5 షేక్ కలీం, A6 నజీర్ ఉద్దీన్…

Ads

తన కొడుకు POCSO వివాదంలో డ్యామేజ్ చేసింది ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, వీరిద్దరే అని బలంగా నమ్ముతూ, బండి సంజయ్ వారి మీద ఫ్లెక్సీలు వేయించాడని చర్చించుకుంటున్న బీజేపీ వర్గాలు… తోటి బీజేపీ నాయకుల మీదనే ఫ్లెక్సీలు వేసేలా బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు మరీ ఇంతలా ఉంటాయా అని షాక్ అవుతున్న బీజేపీ కార్యకర్తలు…’’

ఇదీ ఆ వార్త… ఐతే, ఇంత వేగంగా ఫ్లెక్సీలు అతికించిందెవరో పట్టుకుని, కేసు తేల్చేసిన పోలీసులు… మరి అంతకు ముందు బండి సంజయ్ కొడుకు భగీరథ విషయంలో నానా రచ్చ చేయడానికి, గాయిగత్తర చేయడానికి నగర వీథుల్లో, ప్రహారీ గోడలపై ప్రత్యేకంగా పోస్టర్లు ఎవరు అతికించారో ఎందుకు తేల్చలేదు..? దాని వెనుక ఎవరున్నారు..? ఆ ప్రచార కుట్ర మర్మమేమిటి..?

పైగా కేటీయార్ ఆరోపించాడు, భగీరథ కేసులో బండి సంజయ్‌కు రేవంత్ రెడ్డి సపోర్ట్ అని… అదేదో రేవంత్ సన్నిహితులకు చెందిన మెడికవర్ హాస్పిటల్‌లో 9 రోజులపాటు దాచిపెట్టారన్నాడు… నిజానికి భగీరథ విషయంలో పోక్సో బలమైన సెక్షన్లు పెట్టారు, ఇప్పుడు కూడా ఫ్లెక్సీ నిందితుల్ని పట్టుకున్నారు తప్ప, భగీరథ పోస్టర్ల కుట్రదారులెవరో మాత్రం కనిపెట్టలేదు పోలీసులు… ఇక, రేవంత్ – బండి దోస్తీ ఏమున్నట్టు..?

ఎస్… తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు బహిరంగ రహస్యం… కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు సంబంధించి బండి సంజయ్‌కూ ఈటల రాజేందర్‌కు పొసగడం లేదు… కారణాలు అనేకం… రాజేందర్ బీజేపీకి కొత్త, బీఆర్ఎస్ నుంచి ఓ రక్షణ కోసం బీజేపీలోకి  వచ్చాడు… బండి పాతకాపు… ధర్మపురి అరవింద్‌ది కాంగ్రెస్ కుటుంబం… మొన్నటికిమొన్న కరీంనగర్ కార్పొరేషన్ గెలిపించుకున్నాడు బండి, అరవింద్ నిజామాబాద్ గెలిపించుకోలేక పోయాడు…

ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ కలిసి బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారనీ, భగీరథ కేసులో వాళ్లిద్దరే తెర వెనుక ఉండి కథ నడిపించారని బోలెడు ఆరోపణలు వచ్చాయి… ఇక బీజేపీలోనే మిగతా ముఖ్య నాయకుల నడుమ కూడా విభేదాలున్నాయి… ఇక్కడ గమనించాల్సింది… తనకు పడని సొంత పార్టీ నేతలకు బీఆర్ఎస్ నాయకులు కూడా తోడై భగీరథ కేసులో పెట్రోలో పోశారని…

చివరకు నెగెటివ్ క్యాంపెయిన్ తట్టుకోలేక బండి సంజయ్ కోర్టును ఆశ్రయించాడు… మీడియా సంస్థలకు నోటీసులు వెళ్లాయి… ఇక్కడ బండి సంజయ్ తన అనుచరుడు రామకృష్ణతో ఫ్లెక్సీలు పెట్టించాడనే అనుకుందాం… కానీ ఈ ప్రతిచర్యకు మూలమైన చర్య ఏది..? అది కదా తేలాల్సింది… బండి చేసేది కూడా రాజకీయమే కదా… ఎవరి ‘యాక్షనో’ తప్పు కానప్పుడు బండి ‘రియాక్షన్’ తప్పెలా అవుతుంది..?

ఇలాంటి ఫ్లెక్సీ కేసులు నిలిచేవి కావు, రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజమే… కాకపోతే మిగతా పార్టీలతో పోలిస్తే కాస్త భిన్నమనిపించే బీజేపీలో ఇవన్నీ చోటుచేసుకోవడం, పార్టీని చక్కదిద్దడం హైకమాండ్ వల్ల గాకపోతున్న తీరు విశేషం..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బండి ‘ఫ్లెక్సీలు’ సరే… తనను పదే పదే గోకి, గిల్లి, గిచ్చి, రక్కి రెచ్చగొట్టింది ఎవరు..?
  • మానెక్ షా … మనసున్న ఓ చిత్రమైన కేరక్టర్ … చదవాల్సిన ఓ కథ …
  • ప్రధాని మోదీ వెనుక కనిపిస్తున్నది ఏమిటి..? గేమ్ ఛేంజర్..!
  • … కుండ బద్ధలు కొట్టేయడంలో రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..!!
  • అబ్ ఆయేగా మజా ..! జార్ఖండ్ బరిలో సాయిరెడ్డి, పరిమళ్ అంబానీ..!!
  • సుకన్య..! పరువుకై 30 ఏళ్ల సఫల పోరాటం… మీడియాకు ఓ పాఠం..!!
  • …. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల అంచనాలకు అందడు..!!
  • గ్రేట్ నికోబార్… దేశరక్షణ అవసరమే… కానీ ఏ మూల్యానికి..? (రెండో పార్ట్)…
  • గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు… రుతుపవనాల తీరునూ దెబ్బ తీయబోతోందా…
  • నో, నో… అన్నా మలై బుద్దిలేని బొద్దింక కాదు… తన రూటే సపరేట్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions