.
What ever may come… కుండ బద్ధలు కొట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా..! తరువాత ఏమైనా గానీ, ముందైతే బహిరంగ రహస్యంలా ఉన్న రాజకీయ మర్మాల్ని జనంలో చర్చకు పెట్టేస్తాడు… బీజేపీ కిషన్‌రెడ్డి మీద తన అటాక్ ఇలాంటిదే… నిన్న ఉప్పల్‌లో తను కిషన్‌రెడ్డి మీద సాగించిన దాడి కాంగ్రెస్ వాళ్లకేమో గానీ, బీజేపీలోని ఓ సెక్షన్‌కు భలే ఆనందాన్ని ఇచ్చింది… బీఆర్ఎస్ తేలుకుట్టిన — లా సైలంట్..!!
బీజేపీ కిషన్‌రెడ్డి బీఆర్ఎస్ కేసీయార్ ‘వెల్‌విషర్’ (నో, నో, కోవర్టు కాదు) అని ఎన్నేళ్లుగానో రాజకీయ సర్కిళ్లలో ఉన్న విషయమే… కారణాలేమిటో తెలియదు గానీ… పక్కా ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆమధ్య జరిగిన జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలవడం కోసం బీజేపీ మన్నుతిన్నపాములా నిష్క్రియాపరంగా ఉండిపోవడమే…
Ads
ఎందుకు..? బీఆర్ఎస్ సహకారం లేనిదే బీజేపీకి తెలంగాణలో పెద్ద ఫాయిదా లేదనే ముద్ర వేసి, హైకమాండ్‌లో ఆ ఫీలింగ్ కలిగించి… బీఆర్ఎస్ పార్టీకి బీజేపీని ఓ తోక పార్టీని చేయడం… ఆ దెబ్బకు తెలంగాణలో బీజేపీ మరో పదేళ్లు వెనక్కి పోవడం ఖాయమని బీజేపీలోనే ఓ సెక్షన్ అభ్యంతరపెడుతోంది…
ఎస్, మోడీయేమో ‘నేనున్నాను, నాతో కలిసిరా, మీ రాష్ట్రానికి ఏం కావాలన్నా ఇస్తాను’ అని మోడీ బహిరంగంగా ఏవేవో భరోసాలు ఇస్తాడు… తీరా చూస్తే ఇక్కడ కిషన్‌రెడ్డి మాత్రం మోడీ చెప్పిన మాటలకు భిన్నంగా, వ్యతిరేకంగా వెళ్తుంటాడు… ఇదీ రేవంత్ రెడ్డి ఆరోపణ…
మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు, తుమ్మడిహెట్టి విషయంలో మహారాష్ట్రతో సంప్రదింపులు… వాట్ నాట్..? ప్రతి విషయంలోనూ కిషన్‌రెడ్డి కాళ్లలో కట్టెలు పెడుతున్నాడనేది రేవంత్ రెడ్డి స్ట్రెయిట్ విమర్శ… అలా ఎందుకు..? అవన్నీ జరిగితే కాంగ్రెస్‌కు క్రెడిట్ కాబట్టి, ఇవన్నీ బీఆర్ఎస్‌కు నచ్చవు కాబట్టి, అంటే కిషన్‌రెడ్డికి నచ్చవు కాబట్టి…
సో, దాపరికం లేదు, మార్మికంగా చెప్పేది లేదు… అటు మోడీకి తెలియాలి, ఇటు జనానికీ తెలియాలి… బీఆర్ఎస్, బీజేపీ నాయకుల లోపాయికారీ యవ్వారాలు, తెలంగాణ వ్యతిరేక రాజకీయాలపై డిబేట్ జరగాలనేది రేవంత్ రెడ్డి ఎత్తుగడ… పర్‌ఫెక్ట్‌గా తగాలాల్సిన చోటే తగులుతుంది… ఎందుకంటే..?
అసలే బీజేపీలో అంతర్గత కుమ్ములాటల సెగలు కమ్ముకుంటున్నాయి… మరోవైపు బీఆర్ఎస్‌కు అనుకూలించేలా బీజేపీ ముఖ్యుల వ్యవహారాలు… ఇక్కడ కొందరు రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య ఏమిటంటే..? ‘‘కేసీయార్, కిషన్‌రెడ్డి సఖ్యతకు వేరే నిదర్శనం దేనికి..? హైకమాండ్‌కు అన్నీ తెలుసు…
కేసీయార్ అడగ్గానే కంట్లో నలుసులా మారిన బండి సంజయ్ అధ్యక్ష పదవిని పీకేసింది అధిష్టానమే కదా..’’ (ఎస్, పళనిస్వామి అడగ్గానే అన్నా మలై పదవి పీకేసిందీ ఇలాగే కదా)… బండి సంజయ్ బదులు అదే కిషన్ రెడ్డికి పగ్గాలు ఇవ్వడం దేనికి సంకేతం..?
సో, రేవంత్ రెడ్డి అందరిలో నలుగుతున్న వ్యవహారాన్నే ముసుగులు తీసి బయటపెట్టాడు… అంటే, కుండ బద్ధలు కొట్టాడు… అందుకే అన్నాడు నిన్న… ఫామ్ హౌజు కేడీని, ఢిల్లీ మోడీని ఎదుర్కుంటాను అని… నువ్వు చెప్పేది వేరు, జరిగేది వేరు, మీ కిషన్‌రెడ్డి తీరే ఉదాహరణ అంటూ నేరుగా మోడీని క(అ)డిగేస్తున్నాడు… ఇంట్రస్టింగు…
Share this Article