.
మమతా బెనర్జీ ఢిల్లీలో చక్రాలు తిప్పుదామని ఇండి కూటమి భేటీకి వచ్చింది… ఒక దశలో నేనే ఇండి కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిని అన్నట్టు బిల్డప్ ఇచ్చింది కదా… కానీ చక్రాలు తిప్పడం సంగతి అటుంచి, వాహనం యాక్సిల్ విరిగిపోయేట్టుంది… అంటే, బండి నొగలు… సరిగ్గా ఇదే సమయంలో అదే ఢిల్లీలో తన పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఇంట్లో భేటీ అయ్యారు… దానికి బెంగాల్ కొత్త సీఎం సువేందు కూడా హాజరయ్యాడు…
అభిషేక్ బెనర్జీని పార్లమెంటరీ పక్షనేతగా అక్కర్లేదని, తమను వేరే గ్రూపుగా పరిగణించేలా స్పీకర్‌కు లేఖ రాయాలని ప్రాథమిక నిర్ణయం… కానీ..? అది చీలిక వైపే పయనిస్తోంది… బెంగాల్ సీట్లు 42… ప్రస్తుతం టీఎంసీ చేతిలో ఉన్నవి 28… అంటే ఈ 20 మంది తలుచుకుంటే, అంటే మూడింట రెండొంతులు కోరితే… దీన్నే అసలైన టీఎంసీగా గుర్తించే అవకాశాలున్నాయి…
Ads
మరోవైపు 60 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసి, సొంత కుంపటి పెట్టుకునే కార్యాచరణలో ఉన్న సంగతి తెలిసిందే… రెండు పూలూ (ఆమె పార్టీ గుర్తు) రాలిపోయి, ఉత్త కాడ మిగిలేట్టుంది… అభిషేక్ బెనర్జీ మీద జనం దాడి చేసి కొట్టారు కదా, తన వీరవిధేయ ‘పుష్ప’ అలియాస్ ఫాల్తా సీటు లీడర్, నొటోరియస్ జహంగీర్ ఖాన్‌ను బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ నేపాల్ సరిహద్దులోని ఓ హోటల్లో దాక్కుని ఉంటే, పట్టుకొచ్చేశారు…
మమత మరో నొటోరియస్ ఫాలోయర్, సందేశ్‌ఖాలీ విలన్, మహిళల మీద లైంగిక వేధింపుల్లో అరాచకుడు, ఈడీ సిబ్బందిపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ ఆల్రెడీ జైలులోనే…! జనం తంతారని ఒక్కో టీఎంసీ లీడర్ వీథుల్లోకి రావడం లేదు, ఎక్కడో తలదాచుకుంటున్నారు… అభిషేక్ మీద దాడి జరిగిన తెల్లవారే మరో ఎంపీని కూడా తన్నారు జనం… ఇన్నాళ్లు తమ దగ్గర వసూలు చేసిన కట్ మనీని తన్ని మరీ వసూలు చేసుకుంటున్నారు ప్రజలు…
అక్రమ వసూళ్ల టోల్ గేట్లను బద్దలు కొడుతున్నారు… గుళ్లు, బళ్లు తెరుచుకుంటున్నాయి… బీజేపీ, సీపీఎం ఆఫీసులు టీఎంసీ కబ్జాల నుంచి విముక్తి పొందుతున్నాయి… టీఎంసీ ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి… ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జనంలోకి వచ్చే సీన్ ప్రస్తుతానికి లేదు… ఒకరిద్దరు మేయర్లు కూడా రాజీనామాలు చేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు…
బెంగాల్ CID ఇప్పటికే 2021 నాటి హింసకు సంబంధించిన 59 పాత కేసులను రీ-ఓపెన్ చేసింది… సుమారు 181 కొత్త ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదయ్యాయి… మొత్తమ్మీద ఏదో బంధనాల నుంచి బంగ్లా జాతి స్వేచ్ఛను పొందిన వాతావరణం కనిపిస్తోంది… గూండారాజ్ బద్దలైంది… టీఎంసీలో ఎవడెవడు డేంజరసో ఆ పార్టీ పాత కాపు సువేందు అధికారికి మొత్తం తెలుసు, సో, ఇంకా చాలా పరిణామాల్ని చూడాల్సి ఉంది..!!
Share this Article