.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా ఉపయుక్త పథకాలను ప్రవేశపెట్టింది… ఖజానా సహకరించకపోయినా… బీఆర్ఎస్ చేసిన లక్షల కోట్ల అప్పులు భారంగా మారినా… కొన్ని పథకాలను ప్రవేశపెడుతోంది, అమలు చేస్తోంది… ఐతే అలాంటి అనేక పథకాల్లో ఒక విశిష్టమైన, మానవీయ, ఉపయుక్త పథకం స్కూల్, జూనియర్ కాలేజీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్…
ఎస్, ఇదేమీ జనాకర్షక పథకం కాదు, వోట్ల కోసం ఎత్తుగడ అసలే కాదు… చదువుకునే పిల్లల కడుపులు నింపే అన్నపూర్ణ పథకం… కొందరు మరొక ఫ్రీ పథకం అని రాస్తున్నారు, ఆల్రెడీ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కదా అని రాస్తున్నారు… కానీ భిన్నంగా చూడాలి దీన్ని… రేవంత్ రెడ్డిని అభినందించాలి…
Ads
ఆల్రెడీ సన్న బియ్యం, 500 సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి అనేక ఇతర పథకాలతో మహిళల్లో ఆదరణ పొందిన తీరుకు ఈ పిల్లల బ్రేక్‌ఫాస్ట్ ఇది అదనం… ఇక్కడ పథకం వ్యయం, లబ్ధిదారులు అనే స్టీరియోఫోనిక్ క్షుద్ర లెక్కల్లో అస్సలు చూడొద్దు దీన్ని… ఈ పథకం ఏమిటంటే..? సంక్షిప్తంగా…
- ప్రభుత్వ బడులు, కాలేజీల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనుంది… తొలి విడతలో 8 జిల్లాల్లోని 1,269 పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీల్లో దీన్ని ప్రవేశ పెట్టనుంది… ఈ విడతలో 1,44,610 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది… మొత్తం 22 లక్షల మందికి విడతల వారీగా విస్తరించనున్నారు… బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా తదితరాలు వడ్డించనున్నారు…
ఉప్మా, పోహా వంటివి ఈజీ… కానీ మిల్లెట్ ఇడ్లీ, పూరి, దోశ, బోండా అనేసరికి… అమలును ప్రయోగాత్మకంగా తొలివిడతలో పరీక్షించబోతున్నారు… అసలు దీని ఉపయోగం ఏమిటీ అంటారా..?
- – పొద్దున్నే పనుల్లోకి వెళ్లే తల్లిదండ్రుల కారణంగా చాలామంది పిల్లలు ఆకలితో బడికి వస్తున్నారు, వారి కడుపు నింపడం
- – ప్రభుత్వ బడి వైపు పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఆకర్షించడం
- – డ్రాపవుట్స్ తగ్గించడం,
- – చిన్నప్పుడే పనుల్లోకి పిల్లల్ని పంపించకుండా అడ్డుకోవడం
- – పిల్లల్లో పౌష్టికాహార లోపాల్ని సరిచేయడం, తద్వారా బలమైన, ఆరోగ్య భావి తరాలన్ని తయారు చేయడం
- – బడికి వెళ్లు, బ్రేక్ ఫాస్ట్ చేయి, లంచ్ చేయి, చదువుకో, సాయంత్రం వేళ ట్యూషన్లూ ఉంటాయి, చదువుకో ఇదీ సూత్రం…
ఎస్, ఏటా కొన్ని వేల కోట్ల ఆహారధాన్యాల్ని పారబోస్తున్నాం… గోదాముల్లో వేల టన్నుల ఆహారధాన్యాలు ముక్కిపోతున్నాయి, ఎలుకలు- పందికొక్కుల పాలవుతున్నాయి… మరి పిల్లల కడుపులు నింపడంకన్నా సార్థకత ఏముంది…
అవును, తింటే తింటారు, పిల్లలే కాదు, ఇంకొందరూ వస్తారు, బ్రేక్ ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు… సో వాట్..? ఆకలితో ఉన్నవాడే కదా, దరిద్రంలో అలమాటించేవాడే కదా ఇలా వచ్చేది ఫ్రీ ఆహారానికి..! వాడి కడుపు నింపడంకన్నా మన పాలనకు సార్థకత, విలువ ఏముంటుంది..? సో, ఎలా చూసినా… ఈ పథకం ఓ విశిష్టం…
- పదేళ్ల బీఆర్ఎస్- కేసీయార్ పాలనకు చేతకానిది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతనైంది… ఇదే, ఇలా ఆకలి కడుపుల్ని అన్నపూర్ణలా నింపడం..!! అందుకే పాలకుడికి మానవీయ దృక్పథం ఉండాలనేది..!!
Share this Article