.
నాకెప్పటి నుంచో పే-ద్ద డౌటనుమానం… ఈ సీఎం రమేష్ అనబడు పక్కా వ్యాపారవేత్తను బీజేపీ ఎందుకు ఎంటర్టెయిన్ చేసింది అని..! ఏమో, బ్యాంకు రుణాలో, పన్ను ఎగవేతలో, ఇంకేమైనా ఆర్థిక యవ్వారాలో ఉండటం వల్ల, పవిత్ర తీర్థం తీసుకుని నిష్కళంకుడు అయిపోవాలని తను అనుకున్నాడా..? అలవాటైన రీతిలో తను అడగ్గానే బీజేపీ వోకే అనేసిందా అని..!
తను రెగ్యులర్ పొలిటిషియన్ కాదు… బహుశా తనకు అంత టైమ్ కూడా ఉండదు… బిజీ వ్యాపారి… మరి బీజేపీకి తనతో ఏం ఉపయోగం అనే అనుమానసందేహం కూడా కలిగిన మాట వాస్తవం… కానీ తను పార్టీకి ఉపయోగపడుతూనే ఉన్నాడుట… కాకపోతే తెర వెనుక పార్టీ పని… పరులకు ఎరుక లేని పని… బీజేపీలోకి ఎవరినైనా లాగేయాలని షా అనుకుంటే చాలు, సీఎం రమేష్ ప్రత్యక్షమవుతాడట…
Ads
20 ప్లస్ టీఎంసీ ఎంపీలను మమతకు వ్యతిరేకంగా మార్చి, అదేదో త్రిపుర అనామక NCPI పార్టీలో విలీనం చేయించడంలో సీఎం రమేష్ బాగా వర్క్ చేశాడట… వాళ్లను ఎన్డీయే మద్దతుదారులుగా మార్చాడట… ఎవరో అడిగితే… ఓసోస్, అదెంత పని… ఎవరినైనా అలా చూపించండి, రెండు గంటలు టైమివ్వండి, ఇలా బీజేపీలో చేరేలా ఒప్పిస్తాను అని అంత ధీమాగా చెబుతున్నాడు…

గతంలో ఓ అస్సాం ఎంపీని ఇలాగే పట్టుకొచ్చాడట, అదేదో హైప్రొఫైల్ క్లబ్ ఎన్నికల్లో చక్రం తిప్పాడట… అందరూ ఏవేవో రాస్తున్నారు సరేగానీ… అతి పెద్ద క్వశ్చన్ ప్రశ్నేమిటంటే..? టీఎంసీ ఎంపీలు ఓ కలగూరగంప… వాళ్ల వృత్తులు వేరు, తత్వాలు వేరు, అవసరాలు వేరు, రాజకీయాల తీరు వేరు, అందులో చాలామంది ఫీల్డ్ పొలిటిషియన్స్ కారు, సీఎం రమేష్‌లాగే…
మరి వాళ్లందరినీ ఎలా ఒప్పించాడు, ఎలా డీల్ చేశాడు..? అందరితోనూ కామన్ స్నేహబంధం ఎలా ఏర్పడింది..? మా కొడుకు పెళ్లికి కూడా వచ్చారు అంటున్నాడు, ఏ ఎంపీనైనా చిటికెలో మార్చేస్తాన్ అంటున్నాడు… అంత వశీకరణ శక్తి ఎలా వచ్చింది..? పైగా డబ్బుల్లేవు, ప్రలోభాల్లేవు, నాతోడు, నన్ను నమ్మండి అని కూడా అంటున్నాడు అమాయకంగా…
సరే గానీ… ఇలా పనిచేసే నేతల్లో ఇంకా ఎవరెవరున్నారో… సర్లెండి, ఎవరుంటేనేం గానీ… వాళ్లకు, ప్రత్యేకించి సీఎం రమేష్‌కు రెండు తక్షణ ఛాలెంజులు… ఆ ఠాక్రే పార్టీ ఎంపీలను ఫస్ట్ పట్టుకురండి, మీకు ఆ పార్టీ శల్యుడు సంజయ్ రౌత్ సహకరిస్తాడు… నెక్స్ట్ డీఎంకే పార్టీ ఎంపీలను పట్టుకురండి… పర్లేదు, స్టాలిన్ మెత్తబడ్డాడు… దారికొస్తాడు… కమాన్, జాతికి ఇప్పుడు ఆ అవసరం ఉంది… రెయిజ్ టు అకేషన్..!!
Share this Article