.
‘ఏయ్, మా దగ్గర అణుబాంబులున్నయ్’… ఇదే కదా మాటిమాటికీ పాకిస్థాన్ మన మీద, మిగతా ప్రపంచం మీద చూపించే అహం… కానీ గతం వేరు… ఇప్పుడున్న ఇండియన్ టీమ్ వేరు… పాకిస్థాన్ కుప్పిగంతులకు, ఏతులకు, హెచ్చులకు జంకే రకం కాదు… అందుకని చాలా తెలివిగా, పిన్‌పాయింట్‌గా పాకిస్థాన్ అణు వెన్నెముకను విరిచింది ఇండియా…
ఇది ఎవరో చెబుతున్నది కాదు… స్వీడన్‌కు చెందిన ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ ‘స్టాక్రోమ్ ఇంట ర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (సిప్రి) తన తాజా నివేదికలో ఈ ఆపరేషన్‌కెు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది…
Ads
ఎస్, ‘ఆపరేషన్ సిందూర్’ దాడులతో పాకిస్తాన్ అణు అహంకారం పూర్తిగా బద్దలైంది… నిజం చెప్పాలంటే… ఏ అణుబాంబుల పేరుతో ప్రపంచాన్ని బెదిరిస్తున్నదో ఆ అణుబాంబుల్ని ప్రయోగించే వీల్లేకుండా ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ఆయువుపట్టు మీద కొట్టింది…
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అణు భద్రతా కవచాన్ని ముక్కలు చేసిందని సిప్రి స్పష్టం చేసింది… పాక్ అణ్వాయుధ వ్య వస్థతో ముడిపడి ఉన్న నిర్దేశిత వైమానిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలను భారత బలగాలు విజయవంతంగా ధ్వంసం చేశాయని పేర్కొంది… ఇందులో భాగంగా పాక్ ప్రధాన అణు కమాండ్, నియంత్రణ కేంద్రంగా పనిచేసే వ్యూహాత్మక ‘నూర్ ఖాన్’ ఎయిర్ బేస్ భారత దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదిక వెల్లడించింది…
భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ప్రతిసారీ అణ్వాయుధాలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగే పాకిస్థాన్‌కు భారత్ ఈ ఆపరేషన్ ద్వారా గట్టి బుద్ధి చెప్పింది. ఈ దాడుల్లో పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలతో పాటు… ఆ దేశ వ్యూహా త్మక అణు మౌలిక సదుపాయాలపై భారత్ నేరుగా విరుచుకుపడింది…
ముఖ్యంగా పాకిస్థాన్ తన అణ్వాయుధాలను రహస్యంగా దాచి ఉంచే కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసినట్లు అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి… గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ పొరుగుదేశపు అణు భయాలను పటాపంచలు చేసిందని ప్రకటించగా, ఇప్పుడు సిప్రి అంతర్జాతీయ నివేదిక కూడా అదే విషయాన్ని అధికారికంగా నిర్ధారించడం గమనార్హం. ఈ దాడులతో పశ్చిమ సరిహద్దుల్లో వ్యూహాత్మక సమతుల్యత పూర్తిగా మారిపోయింది…
ఒకదశలో అణు స్థావరాలు దెబ్బ తిని రేడియేషన్ లీకయినట్టు… అమెరికా సాంకేతిక విమానాలు అక్కడ చక్కర్లు కొట్టి దాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా వార్తలొచ్చాయి… ఈరోజుకూ దెబ్బతిన్న స్థావరాలను రిపేర్ చేసుకోలేకపోయింది పాకిస్థాన్… అదీ దాని దుర్గతి…
ఏతావాతా చెప్పొచ్చేదేమిటీ అంటే… మరోసారి పహెల్‌గామ్ వంటి ధూర్త చర్యకు గనుక పాకిస్థాన్ పాల్పడితే… బహుశా పాకిస్థాన్ మళ్లీ కోలుకోకుండా దెబ్బతినడం ఖాయం… ఇండియా మాత్రమే కాదు, అఫ్ఘనిస్థాన్ కూడా తనదైన ఏదో వ్యూహరచనలో ఉందంటున్నారు..!! అఫ్‌కోర్స్, పాకిస్థాన్ వంటి అత్యంత ధూర్తదేశానికి ఏ శిక్షా సరిపోదు..!!!
Share this Article