Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ శవం చివరి కోరిక గెలిచింది – ఎట్టకేలకు మార్చురీని వీడింది

June 25, 2026 by M S R

.

Ashok Kumar Vemulapalli … ఏడాదిగా మార్చురీలో దేశ మాజీ అధ్యక్షుడి మృతదేహం.
ఇదొక రాజకీయ పగ .. చనిపోయాక కూడా పగ సాధించిన మాజీ అధ్యక్షుడు.
జాంబియా మాజీ అధ్యక్షుడు Edgar Lungu మృతదేహం ఏడాదిగా మార్చురీలోనే ఉంది.

ఆయన కుటుంబం, జాంబియా ప్రభుత్వం మధ్య జరిగిన తీవ్ర న్యాయపోరాటం కారణంగా అంత్యక్రియలకు నోచుకోక ఏడాదిగా అలా మార్చురీలో ఉంది .. జాంబియా ప్రస్తుత అధ్యక్షుడు హిలేమాతో ఆయనకు ఉన్న విభేదాలు కూడా ఇందుకు కారణం ..

Ads

తన డెడ్ బాడీ దరిదాపుల్లోకి హిలిమా రావడానికి వీల్లేదని, తన అంత్యక్రియలు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని పరిపాలనలో ఉన్న జాంబియా చేయొద్దని బతికుండగా లుంగు చివరి కోరిక కోరారు.

లుంగు 2025 జూన్ 5న దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతూ మరణించారు. జాంబియా ప్రభుత్వం ఆయనను దేశానికి తీసుకెళ్లి రాష్ట్ర లాంఛనాలతో రాజధాని లుసాకాలోని అధ్యక్షుల సమాధి స్థలంలో ఖననం చేయాలని కోరుకుంది.
అయితే లుంగు కుటుంబం ఆయన కోరిక ప్రకారం దక్షిణాఫ్రికాలోనే ప్రైవేట్‌గా అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టింది. కారణం ప్రస్తుత అధ్యక్షుడు Hakainde Hichilemaతో లుంగుకు తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉండటమే.

ప్రభుత్వం స్థానికంగా అంత్యక్రియలు చేయడం , కుటుంబ సభ్యులు ఆఫ్రికాలో చేయాలని పట్టుబట్టడంతో వివాదం కోర్టుకి వెళ్లడంతో అంత్యక్రియలు పలుమార్లు వాయిదా పడ్డాయి. దాదాపు ఏడాది పాటు మృతదేహం మార్చురీలోనే ఉంచబడింది.
తాజాగా 2026 జూన్ 23న దక్షిణాఫ్రికా అప్పీల్ కోర్టు లుంగు కుటుంబానికే అంత్యక్రియల స్థలం నిర్ణయించే హక్కు ఉందని తీర్పు ఇచ్చింది. దీంతో కుటుంబం ఆయనను దక్షిణాఫ్రికాలోనే ఖననం చేసే అవకాశం ఏర్పడింది.

తాజాగా కోర్టు తీర్పుతో ఆయన మృతదేహాన్ని ఆఫ్రికా తరలిస్తున్నారు .. ఒక విధంగా తన రాజకీయ ప్రత్యర్థి హిలీమా మీద ఆయన చనిపోయాక కూడా విజయం సాధించారు.

2015 -2021 మధ్య లుంగు జాంబియా అధ్యక్షుడిగా పని చేశారు .. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడైన హిలిమాను దేశద్రోహం కేసులో జైల్లో పెట్టారు .. 2021 లో లుంగుపై హిలిమా విజయం సాధించాక దాదాపు నాలుగేళ్లపాటు లుంగుని గృహ నిర్బంధంలో ఉంచారు . అలా గృహ నిర్బంధంలో ఉండగానే ఆయన అనారోగ్యంతో చనిపోయారు .. అదన్నమాట అసలు సంగతి .. అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ ప్రయోజనాల్ని ‘తుంగ’లో తొక్కిందెవరు హరీష్ సాబ్..?!
  • ఆ శవం చివరి కోరిక గెలిచింది – ఎట్టకేలకు మార్చురీని వీడింది
  • నిజంగానే NDA నుంచి CBN మళ్లీ బయటికి రావాలనుకున్నాడా?
  • అక్కడ వేటూరి రాసింది తప్పే! అన్వయం కుదరని ఓ శబ్దగారడీ!
  • సాయిబాబా శివస్వరూపుడా? ఇది సనాతన సమర్థనీయమేనా?
  • సాయిబాబాకు ఆనం పొర్లుదండాలు దేనికి? వణికిపోవడం దేనికి?
  • సాయిబాబా గుడి సర్వమత వేదికా? చాదర్‌ఘాట్ కేసు ఏమంటోంది?
  • అక్కడ నేను ఇంకా బతికే ఉంటాను – మనిషిగా కాదు, ఒక విత్తనంగా!
  • Emoji Mathematics – చాటుమాటు చాట్ మూటల మాటలు
  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions