Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డెస్టినీ..! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం… స్వీయ అస్తమయం వైపు!!

June 30, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. 10 డౌనింగ్ స్ట్రీట్ మళ్ళీ హాట్ టాపిక్ అయింది !
బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్ రాజీనామా చేశాడు!
గత పదేళ్లలో ఆరుగురు ప్రధాన మంత్రులు మారారు బ్రిటన్ కి.
భారతీయులకి స్వాతంత్య్రం ఇస్తే వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు… విన్‌స్టన్ చర్చిల్!

మరో దారుణమైన వ్యాఖ్య చేశాడు చర్చిల్: 1931 లో చర్చిల్ భారత్ గురుంచి మాట్లాడుతూ ఇండియాకి స్వాతంత్రం ఇస్తే అది వాళ్ళ నాశనానికే దారి తీస్తుంది..‘ Leaving india would mean abandoning it to a ‘cruel and wicked ’ brahmin oligarchy.

Ads

The “Rascals and Rogues ” ఈ వ్యాఖ్య చేసింది కూడా చర్చిలే భారతీయుల గురుంచి. ఇండియాకి స్వాతంత్ర్యం ఇస్తే ఇండియాలోని రాస్కల్స్, రోగ్స్, ఫ్రీ బూటర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది అని అన్నాడు. అఫ్కోర్స్! ఈ వ్యాఖ్య మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, నెహ్రూలని దృష్టిలో పెట్టుకొని అన్నాడంటారు. అసలు రాజకీయాలు అంటే ఆసక్తి లేని జిన్నాని పాకిస్థాన్ కోసం ఉసిగొల్పింది చర్చిలే.

బెంగాల్ కరువు : 1943 బెంగాల్ కరువుకి ( The great bengal famine )కి కారకుడు చర్చిల్. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ బ్రిటీష్ సైన్యానికి ఆహార కొరత ఏర్పడితే భారత్ నుండి బియ్యం, గోధుమల్ని లండన్ కి తరలించాడు చర్చిల్! బెంగాల్ లో ఆకలి చావులకి కారణం చర్చిల్!

చర్చిల్

అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి లియో అమెరి ( Leo Amery ) స్వయంగా ప్రకటించాడు చర్చిల్ కి హిందూ మతం అన్నా, భారతీయులు అన్నా ఎంతో ద్వేషం అని. చర్చిల్ ఇండియన్స్ కుందేళ్లు పిల్లలని కన్నట్లు జనాభాని కంటారు అని చర్చిల్ తనతో అన్నట్లు లియో అమెరి చెప్పాడు. ఇండియన్స్ కి ఆహారం లేకుండా చేసినందుకు చర్చిల్ ఏ మాత్రం పాశ్చాతాపం ప్రకటించలేదు సరి కదా ‘breed like rabbits ’ అనే పదం ఉపయోగించాడు.

చర్చిల్ దృష్టిలో హిందూ మతం అనేది ‘ beastly religion ’…
చర్చిల్ వలన మొత్తం 30 లక్షల మంది మరణించారు. ఆకలితో మరణించిన వారు 20 లక్షల మంది అయితే చనిపోయిన శవాలని దహన సంస్కారం చేసే వ్యవస్థ కుప్పకూలడంతో మలేరియా, కలరా వ్యాపించి మరో 10 లక్షల మంది మరణించారు!

బెంగాల్ బ్రాహ్మణులు చేపలు తింటారు!
దీనికి బలమైన కారణం ఉంది!
గౌడ ( గౌర )సారస్వత బ్రాహ్మణులు!
14 వ శతాబ్దంలో ( 1389- 1413 CE ) సుల్తాన్ సికిందర్ షా మిరి బుత్షికన్ ( Sultan Sikandar Shah Miri -Butshikan ) బుట్షికన్ అంటే విగ్రహాల విధ్వంసకుడు ( the Idol breaker ) అని అర్ధం. సికిందర్ బుత్షకర్ కాశ్మీర్ లో సాగించిన హింసాకాండ ఎలాంటిది అంటే ఒక 20 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో పెద్ద కుండని పెట్టి, దానికి నిచ్చెన వేసి, కాశ్మీరి గౌడ సారస్వత బ్రాహ్మణులని ఆ నిచ్చెన ఎక్కి, తమ జంధ్యాలని కుండలో వేసి వచ్చి, ఇస్లాం మతం స్వీకరిస్తే బ్రతికి ఉంటారు లేదంటే అక్కడికక్కడే తల నరికివేసి చంపేస్తారు అని బెదిరించడంతో… కొద్దిమంది జంధ్యం కుండలో వేసి ఇస్లాం స్వీకరించగా సింహాభాగం కాశ్మీర్ వదిలిపెట్టి వెళ్లిపోయారు.

17, 18 వ శతాబ్ద కాలంలో మొఘలులు బలవంతపు మతమార్పిడులు, జిజియా పన్నులతో వేధించడంతో కాశ్మీర్ లో ఉన్న ఆ కొద్దిపాటి సారస్వత బ్రాహ్మణులు కూడా పంజాబ్, బెంగాల్, గోవా ప్రాంతాలకి వలస వచ్చారు! ప్రముఖ కవి గుంటూరు శేషంద్ర శర్మ గౌడ సారస్వత బ్రాహ్మణులు. శేషంద్ర శర్మ పూర్వికులు కాశ్మీర్ ని వదిలి వచ్చి తెలుగు నేల మీద స్థిరపడ్డవారే!

బెంగాల్ కరువు

1934 బెంగాల్ కరువు సమయంలో తీవ్రమైన ఆహార కొరత వలన శవాల దిబ్బగా మారిన బెంగాల్ లో గౌడ సారస్వత బ్రాహ్మణులు తోటి బెంగాలీ బ్రాహ్మణులతో సమావేశమయ్యి, మనం బ్రతికి ఉంటేనే మన ధర్మ్మాన్ని కాపాడుకోగలం కాబట్టి, దొరికింది తిని ప్రాణాలని నిలబెట్టుకుందాం అని తీర్మానం చేసుకొని, చేపలని ఆహారంగా స్వీకరించడం మొదలుపెట్టారు! అలా 1934 బెంగాల్ కరువు సమయంలో మొదలైన చేపలని తినే అలవాటు తరువాతి కాలంలో కొద్దిమంది కొనసాగిస్తూ వస్తున్నారు!

ఎప్పుడో 500 వందల ఏళ్ల క్రితం కాశ్మీర్ నుండి కాలి నడకన బెంగాల్, గోవాలకి చేరుకున్న సారస్వత గౌడ బ్రాహ్మణులు దారిలో ఎన్ని కష్టాలు పడి ఉంటారో ఆలోచించండి!
1934 బెంగాల్ కరువు, ఆకలి మరణాలకి కారణం భూస్వాములే అని సరిగ్గా 32 ఏళ్ళ తరువాత 1967 లో వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీ అనే గ్రామంలో మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమం ప్రారంభం అయి తరువాతి కాలంలో దేశమంతా విస్తరించింది!
చర్చిల్ ఒక విధంగా కాదు, బహువిధాలుగా భారత్ లో చిచ్చు పెట్టాడు.

****************
ఇండియన్స్ కి వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోలేరు అని ఎద్దేవా చేశాడు కదా ఆ చర్చిల్… కాలం గిర్రున తిరిగి వాళ్ళని వాళ్ళే సరిగా పాలించుకోలేక పోతున్నారు!
2010 నుండి ఇప్పటివరకు బ్రిటన్ కి ప్రధానులుగా పనిచేసినవారు…
1.డేవిడ్ కామరాన్ 2010 – 2016
2.థెరిసా మే 2016-2019
3.బోరిస్ జాన్సన్ 2019-2022
4.ఎలిజబెత్ ట్రస్ 2022-2022
5.రిషి శునక్ 2022-2024
6.కీర్ స్టార్మర్ 2024-2026
7.?????

బ్రిటన్

Well… గత పదేళ్ల కాలంలో పనిచేసిన ఆరుగురు ప్రధానమంత్రులు చేయలేనిది కొత్తగా రాబోయే ప్రధాన మంత్రి చేయగలడా ( దా )?
రెండు పేర్లు వినిపిస్తున్నాయి 1.ఆండీ బున్ హామ్ ( Andy Burnham ) 2.మాజీ ఆరోగ్యశాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ ( Wes Streeting ).

పదేళ్ల నుండి ఇదిగో ఈ ప్రధాన మంత్రి అద్భుతాలు చేసి బ్రిటన్ ని ఆర్ధిక, పారిశ్రామిక రంగాలని అభివృద్ధి పధంలో నడిపిస్తాడు అని ఆశిస్తూ పదవి అప్పచెప్పడం, రెండేళ్లు తిరిగేసరికి సదరు ప్రధానమంత్రులకి తామెవరమూ చక్కదిద్దలేని పరిస్థితులు ఉన్నాయని గ్రహించడం, తరువాత రాజీనామా చేసి తప్పుకోవడం…

పొరపాటు అంటే సరిదిద్దుకోగలది!
తప్పు అంటే సరిదిద్దుకోలేనిది కానీ ఆ తప్పు ఫలితం అనుభవించాల్సిందే!
బ్రిటన్ ఇప్పుడు గ్రేట్ కాదు! రవి అస్తమించని సామ్రాజ్యం అనేది చరిత్ర!
ఆ మాటకొస్తే ‘ అంగట్ల రతనాలు అమ్మినారట ఇచట ’ అని రాయలు వారు ఏలిన కాలం గురుంచి చెప్పుకోవట్లా… అలాగే గ్రేట్ బ్రిటన్ కాస్త ఉత్తి బ్రిటన్ అయి కూర్చున్నది!

1.ఎవరు ముస్లిం శరణార్థులని బ్రిటన్ కి రమ్మని ఆహ్వానించారు అని ప్రశ్న వేసుకుంటే ఖచ్చితమైన సమాధానం దొరకదు. బోట్లలో వచ్చేసారు, మానవతా దృక్పధంతో ఆశ్రయం ఇచ్చారు అని అంటున్నారు, కానీ అసలు 30 మంది పట్టే బోట్లలో 100 మందిని ఎక్కించుకొని లండన్ తీరానికి చేర్చింది ఎవరు? అసలు లండన్ తీరానికి వెళితే జాలిపడి ఆశ్రయం ఇస్తారు అని సదరు శరణార్థులకి ఐడియా ఇచ్చింది ఎవరు?

2.మొదటి బోటులో 100 మంది శరణార్థులు లండన్ తీరానికి చేరుకున్నప్పుడు వాళ్లకి ఆశ్రయం ఇవ్వమని అప్పటి ప్రధాని డేవిడ్ కామెరూన్ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? సమాధానం దొరకదు!

3.ఫ్రాన్స్ తీరానికి చేరుకున్న శరణార్థుల బోట్లని ఫ్రాన్స్ పోలీసులు పట్టుకొని వెనక్కి పంపిస్తే ఇంగ్లీష్ ఛానెల్ దాటి లండన్ తీరానికి తీసుకెళ్ళమని సదరు బోటు ఆపరేటర్ కి సలహా ఇచ్చింది ఎవరు?

4. 2018 నుండి ఇప్పటివరకు 12 లక్షల మంది శరణార్థులు అక్రమంగా బ్రిటన్ లో ఉన్నారు.
5. 12 లక్షల మంది కాక విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు వీసా గడువు తీరినా తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.

6. విచిత్రం ఏమిటంటే తమ దేశంలో ఎంతమంది అక్రమంగా ఉంటున్నారు, వాళ్ళు ఏ దేశానికి చెందినవారు అనే డాటా హోమ్ ఆఫీస్ దగ్గర లేవు. బయటికి వచ్చిన డాటా కేవలం రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే.
7. బ్రిటన్ లో విద్యని అభ్యసించడానికి స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్లలో సగానికి పైగా అక్రమంగా ఉంటున్నారు.

london

********************
ఇవేవి ఒక్క సంవత్సరంలో జరిగిపోలేదు! 2010 లో డేవిడ్ కామరూన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జరుగుతూ వచ్చాయి. 2016 లో డేవిడ్ కెమరూన్ దిగిపోయేనాటికి అక్రమ వలసదారుల సమస్య ఎంత తీవ్రమైనదో తెలిసివచ్చింది. కానీ తరువాత వచ్చిన ప్రధానులు ఎవరూ అక్రమ వలసదారుల సమస్యని పట్టించుకోలేదు. ఎందుకంటే బ్రిటన్ ఆర్ధిక సమస్యలకంటే వలసదారుల వల్ల జరుగుతున్న నష్టం తక్కువగా అనిపించడమే!

2024 లో భారీ మెజారిటీతో గెలిచిన లేబర్ పార్టీ ఏదో అద్భుతం చేస్తుంది అని ఆశించిన బ్రిటన్ పౌరులకి లెఫ్ట్ భావజాలం ఉన్న ప్రధాని కీర్ స్టార్మర్ బ్రిటన్ ని మరింత కష్టాలలోకి నెట్టేశాడు!
2024 లో ప్రజలు లేబర్ పార్టీ కి బ్రహ్మరధం పట్టింది పబ్లిక్ సర్వీసెస్ ని మెరుగుపరిచి కాస్ట్ అఫ్ లివింగ్ ని సరళతరం చేస్తాడని కానీ జరిగింది వేరొకటి.
అక్రమ వలసదారులలో పాకిస్థాన్ పౌరులే ఎక్కువగా ఉన్నారు.

బ్రిటన్

8. బ్రిటన్ పౌరులకి ఫుట్‌‌పాత్‌లే గతి! అక్రమ వలసదారులకేమో హోటళ్ళలో రూములు ఇప్పించి ఆ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
9.హోటళ్ళలో వసతులు, తినడానికి డబ్బులు ఇస్తే వాళ్ళు ఊరకనే ఉంటారా? ఫుట్ పాత్ మీద నిలుచుని ఫోన్ మాట్లాడుతున్న మహిళల చేతిలో నుండి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోతున్నారు. లండన్ పోలీసులు చేతులు ఎత్తేసి చాలా కాలం అయ్యింది.

ప్రస్తుతం బ్రిటన్ లోని నగరాలు పాత బస్తీలని తలపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
Reform UK, Restore Britain, Britain First -UK Independence Party ఇవి అన్నీ బ్రిటన్ లో అక్రమ వలసల మీద లేబర్ పార్టీ తో యుద్ధం చేయడానికి పోరాడుతున్న పార్టీలు , గ్రూపులు.
బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికలలో చిన్న చిన్న పార్టీలు, గ్రూపులు లేబర్ పార్టీ ని ఓడించాయి!

ముఖ్యంగా Reform UK పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుకొని లేబర్ పార్టీకి, ప్రధాని కీర్ స్టార్మర్ కి సవాలు విసిరింది!
నిగెల్ ఫరాగే ( Nigel Farage ) Reform UK పార్టీని నడిపిస్తూ లేబర్ పార్టీకి కంచుకోటలలాంటి కౌన్సిల్స్‌లో ఆధిక్యం సాధించాడు.
ఇక బ్రిటన్ లోని లెఫ్ట్ లీబరల్స్ లేబర్ పార్టీని వదిలేసి గ్రీన్ పార్టీకి ఓట్లు వేశారు. బ్రిటన్ లోని స్థానిక సంస్థల ఎన్నికలలో కీర్ స్టార్మర్ ఇమ్మిగ్రేషన్ పాలసీని విమర్శిస్తూ Reform UK చేసిన ప్రచారం ప్రజలు బలంగా నమ్మారు.

10. పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్ ఇప్పటివరకు 2,50,000 మంది బ్రిటన్ బాలికల ఖరాబ్ చేశారు. ఇది అధికారిక లెక్కలు కావు ఎందుకంటే ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి నుండి పోలీసులు కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం లేదు కాబట్టి. పోలీసులకి పై నుండి అనధికారిక ఆదేశాలు ఉన్నాయి.

immigrants

11.  రెండు లక్షల యాభై వేల అత్యాచారాలు జరిగాయి అంటూ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రచారం చేయడం, దానిని బ్రిటన్ ప్రజలు ఆమోదించి లేబర్ పార్టీని ఓడించడం అంటే నిజంగాగానే అన్ని అత్యాచారాలు జరిగాయనే కదా అర్ధం? చిత్రం ఏమిటంటే పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్ చేసిన లైంగిక దాడుల్లో అధిక శాతం మైనర్ బాలికలే బాధితులు

విక్టిమ్ కార్డ్ – ఇస్లామోఫోబియా!
లండన్ మేయర్ పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ స్థానిక సంస్థల ఎన్నికలలో లేబర్ పార్టీ చిత్తుగా ఓడిపోయేసరికి గుడ్ ఓల్డ్ స్లోగన్ ని రిపీట్ చేశాడు షరా మామూలుగా.
సాదిక్ ఖాన్ : ‘‘బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బ్రిటన్ మొత్తం ఇస్లామోఫోబియోతో బాధపడుతున్నట్లుగా ఉంది, నాకు లండన్ లో ఉండాలంటే భయంగా ఉంది…’’

2016 లో లేబర్ పార్టీ తరుపున లండన్ మేయర్ పదవి కోసం పోటీపడిన సాదిక్ ఖాన్ గెలిచి, ఇప్పటివరకూ మూడు పర్యాయాలు పోటీ చేసి గెలిచాడు. అంటే లేబర్ పార్టీ గెలిస్తే ఇస్లామోఫోబియా లేనట్లు ఓడితే ఇస్లామోఫోబియా ఉన్నట్లు అన్నమాట. కాంగ్రెస్ కూడా ఇదే విధానాన్ని అనుసరించి అధికారం కోల్పోయింది!

లండన్ మేయర్ సాదిక్ ఖాన్- పాకిస్థాన్ ఫెయిల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ బంధం ఎలాంటిది అంటే వారం క్రితం PoK విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ ఆసిమ్ మునీర్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ని హెచ్చరించాడు!
ఇది లేబర్ పార్టీలో చర్చనీయాంశం అయింది!

నిన్న MET పోలీసులు 4,000 మంది పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్‌కి సాదిక్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తేల్చింది!
కీర్ స్టార్మర్ మాత్రం సాదిక్ ఖాన్‌ని వెనకేసుకు రావడం లేబర్ పార్టీలోని కొంతమంది సభ్యులకి నచ్చలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో బ్రిటన్ లోని బాలికల మీద జరిగిన అత్యాచారాలని కీర్ స్టార్మర్ అలాంటివి ఏమి జరగలేదు అని కొట్టిపారేయడం వల్లనే తమ పార్టీ ఓడిపోయిందని భావిస్తున్నారు. End of Part -1

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డెస్టినీ..! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం… స్వీయ అస్తమయం వైపు!!
  • ఇండియాను కాలుష్యం కాస్త రక్షిస్తోంది! నమ్మడం లేదా? ఇది చదవండి!
  • ‘బాడీ కౌంట్’ నిజంగా పెరుగుతోందా..? ఉన్నదే బహిరంగం అవుతోందా..?
  • Aeromart 2026 – గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో మరో గ్లోబల్ ఈవెంట్!
  • నితిన్ నబీన్‌జీ … కేసీయార్‌పై ఈగ వాలనివ్వనిది మీరే మహాశయా…
  • బాస్ పేరిట వాట్సప్ మెసేజలు- కోట్లు గల్లంతు – బహుపరాక్
  • చివరి సినిమాలో… ఒక్క పాటలోనే తన నాలుగు అభిమాన పాత్రల్లో…
  • Campa … మార్కెటింగ్‌లో అంబానీ తెలివే తెలివి! వేగంగా నంబర్.3 ప్లేస్!!
  • ఇడుపు కాయితం! రచ్చ లేపుతున్న టైటిల్ కొత్తదేమీ కాదు – పాతదే!
  • భయంతో ఆడుకున్న ఈ నియంతను ఆ ‘భయమే’ బలిగొంది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions