Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణ నిజంగా సాహసి – మొండి … అందుకే ఎన్టీయార్‌తో ఢీకొట్టాడు…

July 8, 2026 by M S R

.

కురుక్షేత్రం వర్సెస్ దానవీరశూరకర్ణ… ఎన్టీయార్ వర్సెస్ కృష్ణ… ఈ చర్చ చాన్నాళ్లుగా సాగుతున్నదే… మళ్లీ ఈమధ్య సోషల్ మీడియా, మీడియా సైట్లలో బాగా కనిపిస్తోంది… ఎప్పుడో 1977 నాటి సినిమా… ఒక దానికి ఎన్టీయారే నిర్మాత, అంతా తానై వ్యవహరించాడు… మరో దానికి కృష్ణ నిర్మాత, ఎన్టీయార్‌కు పోటీ… రెండూ సంక్రాంతి బరిలో తలపడ్డాయి…

కురుక్షేత్రంలో నటించిన ప్రధాన తారాగణం కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లేరిప్పుడు… ఎన్టీయార్ కూడా లేడు… యాభై ఏళ్లయినా ఇంకా ఈ చిత్రాల పోలికల మీద చర్చ జరుగుతూనే ఉంది… ఎస్, అప్పట్లో ఎన్టీయార్‌ను ఎదిరించి నిలిచిన సాహసి కేవలం కృష్ణ… ఇంకెవరికీ ఎన్టీయార్ జోలికి పోయే ధైర్యం లేదు… అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి ఈ కురుక్షేత్రం నుంచి… ఎన్టీయార్ మీద సెటైర్లు, విమర్శలు చేసిన రాజకీయ చిత్రాల దాకా… కృష్ణ మొండి…

Ads

ఆ మొండితనంతోనే ఎన్టీయార్ దానవీరశూరకర్ణ తీస్తున్నాడని తెలిసీ, ఎన్టీయార్ వద్దని వారించినా వినకుండా భారీ తారాగణం, ఖర్చుతో కురుక్షేత్రం నిర్మించాడు… కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతోపాటు చంద్రమోహన్, మోహన్ బాబు, నాగభూషణం, బాలయ్య, జమున, అంజలీ దేవి, విజయ నిర్మల… రెండింట్లోనూ కైకాల సత్యానారాయణ…

కానీ ఎన్టీయార్ సినిమా ప్యూర్ తన కుటుంబ సినిమా… తనే మూడు పాత్రలు… విలన్లూ తానే, హీరోలు తానే… కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు… తోడుగా హరికృష్ణ, బాలకృష్ణ… మనం తీస్తాం, జనం చూస్తారు అన్నట్టుగా… చలపతిరావు మూడు పాత్రలు… విలనుడికీ డ్యూయెట్లు ఎన్టీయార్‌కే చెల్లు… అంతేనా ప్రతినాయక పౌరాణిక పాత్రలకూ హీరోయిజం అద్దే ఓ వింత ధోరణి ఎన్టీయార్‌ది… ఐనా జనాన్ని మెప్పిస్తాడు, ఒప్పిస్తాడు…

జస్ట్, 10 లక్షలతో తీస్తే తొలిసారి కోటిన్నర, మళ్లీ తరువాత రీరిలీజ్ చేస్తే కోటి వచ్చాయట… కానీ కృష్ణ సినిమా ఆడలేదు… ప్రధాన కారణం… కృష్ణకు పౌరాణిక పాత్రలు పెద్దగా నప్పవు… అప్పటికి తన ఇమేజ్ వేరు… కానీ ఎన్టీయార్‌ను పౌరాణిక పాత్ర ధారణలో కొట్టినవారు లేరు… ప్రత్యేకించి దానవీరశూరకర్ణ హిట్ కావడానికి పాటలు, మాటలు ప్రధాన కారణం… మరీ ప్రత్యేకించి”జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా.. ఎంత మాట ఎంత మాట!” సుదీర్ఘ డైలాగ్ ఈరోజుకూ ఎవర్ గ్రీన్…

ఏ తల్లి నిను కన్నదో, చిత్రం భళారే విచిత్రం, తెలిసెనులే ప్రియరసికా పాటలు శ్రావ్యం, మధురం… 10 పాటలు, 35 పద్యాలు… నిజానికి సాంకేతికంగా నాసిరకం చిత్రీకరణే కురుక్షేత్రంతో పోలిస్తే, జస్ట్ ఎన్టీయార్ ఉంటే చాలు అన్నట్టుగా నడిచింది ఆ సినిమా…

కురుక్షేత్రం తక్కువేమీ కాదు, ఒకరకంగా నిర్మాణ విలువల్లో కృష్ణ ఖర్చుకు రాజీపడలేదు… పడే తత్వమూ కాదు… రాజస్థాన్‌కు ఆర్టిస్టులను, టీమ్‌ను తీసుకుపోయి యుద్ధసన్నివేశాలు తీశాడు… ఇందులోనూ 25 దాకా పద్యాలుంటాయి… కానీ మోగింది కల్యాణవీణ తప్ప వేరే హిట్ పాటలేదు, డైలాగ్స్‌లో పంచ్ తక్కువ… అక్కడ దెబ్బకొట్టింది… విచిత్రం ఏమిటంటే, దీన్ని హిందీలో డబ్ చేస్తే అక్కడ బాగా ఆడింది… అంతా మాయ!

దానవీరశూరకర్ణ నడివి 226 నిమిషాలు… అంత నిడివి ఉన్నా జనం వచ్చారు… కొన్నిచోట్ల రెండేసి ఇంటర్వల్స్ ఉండేవట…

సినిమా తీస్తే తీశాడు, రెండూ ఒకేసారి పోటీ ఎందుకు..? వాయిదా వేసుకోవచ్చు కదా అని ఎన్టీయార్ రాయబారం పంపినా కృష్ణ వినలేదు… పోటీ అంటే పోటీయే… మునిగినా తేలినా తగ్గేదేలా… ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో కృష్ణకు బాగానే అప్పులు మిగిలాయంటారు… పడటం లేవడం కృష్ణకు అలవాటే కదా, లైట్ తీసుకున్నాడు…

#SuperstarKrishna #nandamuritarakaramarao #Kurukshetram #actor #UntoldStories #actorlife #tollywood #tollywoodactor #entertainmentnews #TollywoodUpdates #entertaiment

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కృష్ణ నిజంగా సాహసి – మొండి … అందుకే ఎన్టీయార్‌తో ఢీకొట్టాడు…
  • ఈ మీసం ఫోటో గుర్తుంది కదా! – కేటీయార్ జుట్టు దొరికినట్టేనా..?!
  • ఇంతమందికి ఉరి ఇదే తొలిసారి! సరైన తీర్పు- ఇప్పటికే లేటైంది!!
  • సబాంగ్ పోర్ట్! చైనా సముద్ర వ్యూహాలకు ఇండియా తెలివైన చెక్!
  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions