Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!

July 10, 2026 by M S R

.

అక్కినేని నాగార్జునకు మళ్లీ నిరాశ… ఈ వాక్యం చూసి ఆశ్చర్యపోకండి… తన నట జీవితంలో, జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో అపజయాలున్నాయి, జయాలున్నాయి… ఎన్నో సాధించాడు, కొన్ని కోల్పోయాడు, ఇంకొన్ని సాధించలేకపోయాడు… సాధించలేకపోయిన వాటిల్లో ముఖ్యమైంది తన కొడుకు అఖిల్‌ను ఒక సక్సెస్ ఫుల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం..!

అప్పుడెప్పుడో 2015లో అనుకుంటా… తన పేరుతోనే ఓ డెబ్యూ సినిమా… పైగా వివి వినాయక్ దర్శకుడు… తరువాత నాలుగు సినిమాలు, అంతే… ఒక్క హిట్ లేదు, ఒకటీరెండు వచ్చిపోయినట్టు కూడా గుర్తులేదు జనానికి… ఇక తనను హీరోగా జనం యాక్సెప్ట్ చేయనట్టే అనుకునే దశలో నాగార్జున ఈసారి మరింత పట్టుదలగా ఓ ప్రయత్నం చేశాడు…

Ads

సినిమా పేరు లెనిన్… నాగార్జునే నిర్మించాడు… తమన్ మ్యూజిక్, ఖర్చు బాగానే పెట్టారు, ప్రజెంట్ ట్రెండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను పట్టుకొచ్చారు… అబ్బూరు మురళీ కిషోర్ దర్శకత్వం… ‘నాన్న కోసం మనం తీశాను, అఖిల్ కోసం ఈ లెనిన్ తీశాను, ఈసారి నిరాశపర్చడు’ అన్నాడు నాగార్జున… నిజమే, అఖిల్ కెరీర్‌ను తాడోపేడో తేల్చేసేది ఇదే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు… జూనియర్ ఎన్టీయార్ వాయిస్‌తో కథను స్టార్ట్ చేశారు…

కానీ మొదటి నుంచీ ఓ బజ్ క్రియేట్ కాలేదు… ట్రయిలర్లు పెద్దగా ఇంప్రెసివ్ కావు… మరి సినిమా..? పర్లేదు! బాగా లేదని కాదు, మరీ ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించగల సీన్ మాత్రం లేదు… 1) అఖిల్  నటుడిగా కాస్త కష్టపడ్డాడు… గతంతో పోలిస్తే బెటరే… కానీ స్టిల్, తనది ఎమోషన్స్ పలికించగల ఫ్లెక్సిబుల్ ఫేస్ కాదు… కొన్ని సీన్లలో మాత్రం తన నటనలో మెరుగుదల బాగానే కనిపించింది…

ప్రిరిలీజులో అనుకుంటా, ఎవరో కమెడియన్ కామెడీగా ఏదో అన్నాడు… అఖిల్‌కు పౌడర్ పూస్తే అదే నల్లగా అనిపిస్తుంది అని… అంటే పౌడర్‌కన్నా అఖిల్ తెలుపు అని చెప్పడానికి ఏదో పిచ్చి వ్యాఖ్య… నిజమే, అఖిల్ అందగాడు… ఫిజిక్‌పరంగా చూస్తే హీరో లుక్కే… ఎటొచ్చీ ఈజ్ విషయంలో వెనుకబాటే… పర్లేదు, నాగార్జునను మొదట్లో జనం యాక్సెప్ట్ చేశారా? లేదు కదా, పికప్ అయ్యాడు, హీరోగా ఇంకా కొనసాగుతున్నాడు అంటారా..? అంతేలెండి, మనిషి ఆశాజీవి!!

లెనిన్ చిత్రం… భారతం మిట్ట అనే ఊరి కథ… గ్రామంలోని ‘భారతం మిట్ట’ సంప్రదాయ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న లెనిన్ (అఖిల్ అక్కినేని), తన చుట్టూ ఉన్న వారి వల్లనే తీవ్రమైన ద్రోహానికి గురవుతాడు. చివరకు ఏం జరిగింది అనేదే ఈ ‘లెనిన్’ సినిమా కథాంశం…

భాగ్యశ్రీ బోర్సేకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది… అఖిల్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది… అందమైన జంట… కాకపోతే లవ్ ట్రాక్ ఆశించినంత బలంగా లేదు, అందుకని భాగ్యశ్రీ ఉనికి పెద్దగా సినిమాకు ప్లస్ కాలేకపోయింది…

ఆసక్తికరమైన జైలు సన్నివేశంతో మొదలై ఉత్సుకతను పెంచుతుంది కథ మొదట్లో. అఖిల్ పాత్ర చుట్టూ ఉన్న మిస్టరీని ఈ సన్నివేశం పరిచయం చేస్తుంది, సునీల్ పాత్ర అఖిల్ గతాన్ని అన్వేషించడం మొదలుపెడుతుంది. ప్రారంభం బాగానే ఉన్నా… ఫ్లాష్‌బ్యాక్ మొదలైనప్పటి నుండి సినిమా పూర్తిగా ఊపు కోల్పోతుంది. దాదాపు గంట పాటు సాగే ఈ భాగం చాలా సాధారణంగా, రొటీన్‌గా అనిపిస్తుంది.

దర్శకుడు పూర్తిగా ఓ రొటీన్ ఫార్ములా పద్ధతినే అనుసరించాడు. గ్రామ నేపథ్యంలో సాగే కథలో ఎన్నో పాత్రలు ఉన్నా, హీరో-హీరోయిన్ ట్రాక్, పాటలు, ఇతర పాత్రల ప్రవర్తన… అన్నీ చాలా పాత పద్ధతిలో ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు కొంచెం ఆసక్తిని కలిగిస్తాయి. సినిమాకు కావాల్సిన వేగాన్ని అందిస్తాయి. కానీ, మొదటి భాగం మొత్తం బలహీనమైన డ్రామాతో ఇబ్బంది పెడుతుంది. పాత్రల మధ్య సంఘర్షణ సరిగ్గా లేకపోవడంతో, భావోద్వేగాల కొరత కనిపిస్తుంది…

రెండవ భాగం మొదటి భాగంతో పోలిస్తే కాస్త మెరుగ్గా, ఆసక్తికరం… కానీ ప్రధానలోపం పాత్రల మధ్య బలమైన బంధాలు, ఎమోషనల్ డ్రామా లేకపోవడమే… క్లైమాక్స్‌లో వచ్చే కీలకమైన రివీల్ కూడా చాలా సాధారణంగా ఉండటం వల్ల ఎమోషనల్ పెయిడ్-ఆఫ్ దక్కలేదు.

మొత్తంగా చూస్తే, ‘లెనిన్’ ఒక బలమైన కథగా కంటే, కొన్ని మంచి సన్నివేశాల సమాహారంగా అనిపిస్తుంది. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద లోపం. ఈ సినిమాలో ఈశ్వరీ రావు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, రామ్కి వంటి అనేక మంది ఉన్నారు. కానీ, ఈశ్వరీ రావు, రెండవ భాగంలో శివాజీ మినహా మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు… వీక్ రైటింగే కారణం…

థమన్ పాటల్లో ఒక వారెవా బెటర్, అంతే… బీజీఎం వోకెే… నిర్మాణ విలువలు వోకే… మీరు కింగ్ నాగార్జున ఫ్యాన్సా? ఐతే మీరు ఓసారి చూడొచ్చు… న్యూట్రల్ ప్రేక్షకులా..? పెద్దగా కనెక్ట్ కాలేరేమో!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions