.
కేటీఆర్ పాపం తప్పులో కాలేశాడు!! ఎప్పుడూ తన కోటరీని, తనకు ఇన్‌పుట్స్ అందించే ఓ అసమర్థ యంత్రాంగాన్ని నమ్ముకుంటే ఏమవుతుంది..? ఏమీ కాదు… నవ్వులపాలవుతాడు… ఇదీ అంతే… విషయం ఏమిటంటే..?
అంకగణితం..! మ్యాథ్స్ బేసిక్స్..! రాజకీయాల్లో ఇది అస్సలే పనికిరాదు… పాలిటిక్సులో 2*2 ఎప్పుడూ నాలుగు కాదు… కాకూడదు, లేదు నాలుగే అంటే రాజకీయ గణితంలో వీక్ అని లెక్క… మ్యాథ్స్‌లో ఫెయిల్ అని లెక్క…
Ads
కేటీయార్ ఏమన్నాడు..? ‘‘రేవంత్ సొంతంగా సర్వే చేయించుకున్నాడు… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేు 119 సీట్లకు గాను మేం 78 సీట్లు గెలుస్తాం (65 శాతం) అని తేలింది, దాంతో ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు పాపం’’ అని ఎక్కడో చెప్పాడు… అందరికీ తెలుసు, ఇదేదో కాలంచెల్లిన మైండ్ గేమ్ పాచికలు అని… కేటీయార్ ఇంకా ఆ ఎక్స్‌పైర్డ్ ఎత్తుగడల్లోనే మునిగీ తేలుతున్నాడు…
దానికి రేవంత్ ఏం కౌంటర్ ఇస్తాడా అని ఎదురుచూశాం… ‘‘ఏమోయ్, కేటీయార్, కాస్త అప్‌డేట్ కావాలి నువ్వు, ఇంకా ఏకాలంలో ఉన్నావు..? నువ్వు అనుకున్నట్టు 2028 డిసెంబరులో ఎన్నికలు జరగవు… (తెలంగాణ ఎన్నికల గడువు)… 2029 మే- జూన్ మధ్యలో జరుగుతాయి… పక్కా, రాసిపెట్టుకో… 119 కాదు, 182 అసెంబ్లీ సీట్లు, 17 ఎంపీ సీట్లు కాదు, 26 ఎంపీ సీట్లకు ఎన్నికలు…
నువ్వేదో పిచ్చి లెక్కలు చెబితే ఎలా..? 182లో 117 సీట్లు (65 శాతం) మేం గెలుస్తాం, భద్రాచలం రాముడి మీద ఆన, గెలిచి చూపిస్తాం… 26 ఎంపీ సీట్లలో 20 మావే…’’ ఇదీ తన సమాధానం… హహహ… ఇక్కడ రెండు అంశాలు…
కేటీయార్ చెప్పిన అదే 65 శాతం సీట్లు మేం గెలుస్తాం అనే గణితానికి… సరిగ్గా అంతే శాతం లెక్క చూసి, అదే 65 శాతం మేం గెలవబోతున్నాం… కాకపోతే నీకు 182 సంగతి తెలియదు, నాకు తెలుసు అంటూ పర్‌ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు, అదీ ట్వీట్ కాదు, ఖమ్మం జిల్లాలో బహిరంగంగా!
ఇదే మరి… రాజకీయాల్లో అంక గణితం వేరు అనేది… బాగా చదివి అమెరికాలో కొలువు చేసిన కేటీయార్ ఈ గణితంలో ఫెయిల్… ఎక్కడో మారుమూల పల్లెలో చదువుకున్న ముఠా మేస్త్రీ మ్యాథ్స్‌లో పాస్… (అదే 65 శాతం మార్కులు)…
సరే, ఇక విషయానికి వద్దాం… తెలంగాణ ఎన్నికలు తన గడువులోపు 2028 డిసెంబరులో జరగబోవడం లేదు… (2023 డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అంటే 2028 డిసెంబరులో కొత్త అసెంబ్లీ కొలువు దీరాలి… లెక్క ప్రకారం) కానీ అసలు లెక్క వేరు… (రేవంత్‌కు ఏకంగా మోడీ సోర్స్)… (ఎంత రహస్య సంసారం చేసినా సరే మోడీ బీఆర్ఎస్ వాళ్లకు ఏదీ చెప్పడు, నమ్మడు)…
డీలిమిటేషన్ బిల్లు మొన్న ఎన్డీయే వాపస్ తీసుకోవచ్చుగాక… మహిళ రిజర్వేషన్లతో లంకె పెట్టి ఏదో ఎత్తుగడ వేసింది కానీ ఫ్లాప్… కానీ ఇప్పుడు మళ్లీ ఆ బిల్లు రాబోతోంది… డీలిమిటేషన్ ఖాయం, తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పెంపు ఖాయం… దానికి డిసెంబరు బదులు మరో అయిదారు నెలలు తెలంగాణ అసెంబ్లీ పదవీకాలాన్ని పొడిగిస్తారో లేదో చెప్పలేం గానీ… 2029 మే- జూన్‌లోనే ఎన్నికలు… ఇదీ అసలు విషయం!!
ప్చ్… ఇంకా ఇంకా మీడియాకు, సోషల్ మీడియాకు, బినామీ తటస్థ మీడియాకు నెలనెలా కోట్లకుకోట్ల ఖర్చు పెంచుతూ పోవడం కాదు కేటీయార్, కాస్త నమ్మబుల్, ఎఫిసియెంట్ టీమ్‌ను నిర్మించుకో… వర్తమాన నీ కోటరీ నిన్ను నెగ్గనివ్వదు- ఏమో, రేవంత్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారేమో ఓసారి క్రాస్ చెక్ చేసుకో…!!
Share this Article