.
చెత్త సమర్థనలు… అది గౌతమ్ గంభీర్ కావచ్చు, బీసీసీఐ ప్రముఖులు ఎవరైనా కావచ్చు… ఇంగ్లండ్ టీ20 జట్టు చేతిలో ఇండియా టీ20 జట్టు ఘోరమైన పరాజయ, పరాభవ సీరీస్ మీద ఎవరేం చెప్పుకున్నా లాజిక్ లేదు, న్యాయం లేదు… డొల్ల సమర్థనలు మాత్రమే…
వైట్ వాష్‌తో ఇండియా టీ20 జట్టు ఐసీసీ ర్యాంకింగుల్లో రెండో స్థానానికి పడిపోయింది, ఇంగ్లండ్ జట్టు టాప్ వన్‌లోకి చేరిపోయింది, అక్షరాలా ఇంగ్లండ్ జట్టు అర్హురాలు… బ్రూక్స్, రషీద్, సాల్ట్, అర్చర్, బట్లర్ ఎట్సెట్రా అక్షరాలా మనవాళ్లను ఉతికి ఉతికి, పిండి పిండి సర్ఫ్ ఎక్సెల్ అవసరం లేకుండానే ఆరేశారు తన తోపుల్ని…
Ads
అసలే ఐర్లండ్ వంటి అనామక జట్టు చేతిలో ఓటములతో ఇజ్జత్ ఖరాబ్ అయిపోయిన ఇండియాకు ఈ ఇంగ్లండ్‌తో సీరీస్ ఓడిపోవడం మరింత అవమానాన్ని మిగిలించింది… ఐపీఎల్ తోపు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అలియాస్ సర్పంచ్ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా డిజాస్టర్… వెరీ పూర్ కెప్టెన్సీ… ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లు, బౌలర్ల వాడకం దగ్గర నుంచి అన్నీ కెప్టెన్సీ తప్పుడు నిర్ణయాలే…
అసలు ఫలానా ప్లేయర్ బాగా ఆడాడు అని చెప్పడానికి లేదు… అందరూ ఫ్లాపులే… ప్రత్యేకించి మన బలహీనత బౌలర్లు… వరుణ్ చక్రవర్తి, అర్షదీప్, అక్సర్ పటేల్, దూబే, ప్రసిద్ద… ఒక్కరని కాదు, అందరూ అందరే…
బ్యాటర్ల విషయానికొద్దాం… పేరుకు కాగితాలపై తోపులు, అభిషేక్, వైభవ్, సంజూ, ఇషాన్, తిలక్ వర్మ, అందరూ అంతే.., సంజూను ఎందుకు తొలగించారు అని ఆందోళనలు, దెబ్బకు మళ్లీ ఫిఫ్త్ మ్యాచులో తీసుకున్నారు, ఏమైంది, మరోసారి అట్టర్ ఫ్లాప్…
చివరగా, ఓ చేదు నిజం చెప్పుకుందాం… అదే ఇంగ్లండ్… మన అండర్-19 జట్టు బాగానే ఆడింది… మన వుమెన్ జట్టు కూడా అదే ఇంగ్లండ్ మీద టెస్టు మ్యాచ్ బాగానే ఆడుతోంది… మరి మన టీ20 జట్టుకు ఇంగ్లండ్ వాతావరణం కొత్త, పిచ్చులు కొత్త, అలవాటు పడలేదు వంటి చెత్తా సాకులు దేనికి..? ఆడలేక మద్దెల ఓడు!!
గౌతమ్ గంభీర్‌కు ఏమాత్రం — ఉన్నా నైతిక బాధ్యతగా రాజీనామా చేయడం బెటర్… బట్ తన తత్వాన్ని బట్టి అది ఎక్స్‌పెక్ట్ చేయలేం!! ఏమాత్రం ఇగోలకు పోకుండా టీ20, టెస్టు పోటీలకు కూడా కోహ్లీ, బుమ్రా, రోహిత్‌లను ఇంకొన్నాళ్లు ఆడించడం బెటర్… వాళ్లకు ఆడగల సత్తా ఇంకా ఉంది!! యువ మెరికలు దొరికేవరకు!! వర్తమాన ప్రయోగాలన్నీ ఫెయిల్ కాబట్టి!! లేదా కొత్త మెరికల అన్వేషణ అర్జెంటుగా మొదలుపెట్టాలి!!
Share this Article