Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!

July 18, 2026 by M S R

.

కేటీయార్ ఏమన్నాడు..? ‘‘టీఆర్ఎస్ అనేది మా క్రెడిబులిటీ, ఆ పేరుతో 22 ఏళ్ల అనుబంధం ఉంది, దాన్నెందుకు పోగొట్టుకుంటాం’’….. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం చుట్టూ ఓ రాజకీయం… నిజానికి ఇది మామూలుగానైతే పెద్ద ఇష్యూ కాదు… కానీ ఆ పేరుకు తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం తాలూకు విలువ జోడించబడి ఉంది… ఆ పార్టీ రాజకీయ వారసత్వపు ప్రశ్నలకు అది వేదికగా మారింది… అందుకే ఈ చర్చ…

టీఆర్ఎస్ పేరును ఇవ్వవద్దని ఎన్నికల సంఘానికి వందల అభ్యంతరాలు అందాయి… కేటీయార్ మాటల్ని బట్టి అవన్నీ  బీఆర్ఎస్ కేడర్ పంపినవే అని అర్థమవుతూనే ఉంది… ఆ పేరును కవిత నిలుపుకోగలదా అనేది వేరే సంగతి, ఆమె పోరాటం ఫలిస్తుందో లేదో గానీ, ఆ పేరు ఎంపికతో బీఆర్ఎస్ క్యాంపు ఉలిక్కిపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి…

Ads

టీఆర్ఎస్ అనే పేరుతో మాకు ఏళ్ల అనుబంధం ఉంది, క్రెడిబులిటీ ఉంది అంటున్న కేటీయార్… ఆ పేరులో తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపేసి, బీఆర్ఎస్‌గా మారినప్పుడే ఆ క్రెడిబులిటీని కోల్పోయారనే నిజాన్ని మాత్రం అంగీకరించడు… టీఆర్ఎస్ అనే సంక్షిప్తనామం కవిత పరమైతే, తెలంగాణ సమాజంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఆ పార్టీ పేరు ఇప్పుడు తమ వోట్లను చీల్చే ప్రమాదం ఉంది కాబట్టి కేటీయార్ ఉలికిపాటు…

అసలు ఓనర్ ఫామ్ హౌజులో బందీ, బయటికి రాడు ఎలాగూ… ఇక ఇప్పుడు ఆయన బిడ్డ కవిత, అదే పాత పేరుతో జనంలోకి వెళ్తే, అది ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు ఎంతో కొంత నష్టం అనేది నిజం… పైగా రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్న భేదోపాయాలు బీఆర్ఎస్ కేడర్‌ను, పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి…

అసలే వరుస ఓటములు, జనంలో ఏమాత్రం పెరగని ఆదరణ… దీనికితోడు కేసీయార్ రాజకీయ వారసత్వంపై రగడ… కవితను ఎలాగూ వెళ్లగొట్టారు… నేనే ఆ పార్టీకి నైతిక వారసురాల్ని అని చెప్పడానికి, జనంలోకి పోవడానికి ఆమెకు టీఆర్ఎస్ అనే పేరు ఉపయోగపడుతుంది… హరీష్ రావు కేసీయార్ నీడ నుంచి బయటపడటానికి ఎవరెవరిని కలుస్తున్నాడో నాకు తెలుసు అని హరీష్ రావు మీద మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి…

రాజకీయాల్లో సహజమే… బయటికి రాని ఓనర్, కేడర్‌లో ఇంకా బలమైన యాక్సెప్టెన్స్ రాని కొడుకు, బయటికి వెళ్లి పోరాడే బిడ్డ… దీనికి అదనంగా రేవంత్ రెడ్డి ప్రయోగించే మైండ్ గేమ్ పాలిటిక్స్… ఈ స్థితిలో తప్పకుండా టీఆర్ఎస్ అనే పేరు మీద చర్చ జరగడం అత్యంత సహజం…

తెలంగాణ గ్రామీణ సమాజంలో టీఆర్ఎస్ అంటే కేసీయార్, కేసీయార్ అంటే టీఆర్ఎస్… ఏకంగా ప్రధాని పోస్టుపైనే కన్నేసి, అర్జెంటుగా తెలంగాణ ఆత్మను చంపుకుని, బీఆర్ఎస్‌గా మారితే జనం మెచ్చలేదు, ఎవరికీ నచ్చలేదు, కేసీయార్ ఓటమి కారణాల్లో ఇదీ ఒకటి… చివరకు పీఎం పోస్టు నుంచి జనంలోకి రాని ఓ ప్రతిపక్ష నేత స్థాయి చతికిలపడింది కేసీయార్ రాజకీయం…

ఎప్పుడైతే టీఆర్ఎస్ పేరును వదులుకున్నారో, అప్పుడే మోరల్ క్రెడిబులిటీని ఆ పేరుపై కోల్పోయింది ప్రజెంట్ బీఆర్ఎస్… నిజానికి ఆ పేరు మీద వాళ్లకు ప్రేమ ఏమీ లేదు, ఉంటే వదులుకునేవారే కారు… కాకపోతే అది కవిత చేతుల్లో పడితే, అది కలిగించబోయే నష్టం మీద భయముంది కాబట్టే ఆ పేరుపై ఇంత పట్టుదల…

కవిత తన తెలంగాణ రక్షణ సేన జెండాలో పైన పచ్చ రంగు, కింద ఆకుపచ్చ రంగు పెట్టి, తెలంగాణ బొమ్మ పెట్టింది… కానీ పచ్చ రంగు స్థానంలో గులాబీ రంగు పెట్టి ఉంటే కథ మరింత రక్తికట్టేది… దీనికితోడు ఆమెకు కారును పోలిన ఏదైనా ఎన్నికల గుర్తు వస్తే..? సో, అందుకే కేటీయార్‌కు ఆ పేరంటే ఇప్పుడు ప్రేమ కాదు, భయం..!!

కవిత కొత్త పార్టీ పెట్టినప్పుడు కేటీయార్ క్యాంపు పెద్దగా పట్టించుకోలేదు, ఎవరూ ఆమె విమర్శల్ని కౌంటర్ చేయాల్సిన పని కూడా లేదని కేసీయార్ ఆదేశం… తద్వారా ఆమె పార్టీకి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్టు, గుర్తించినట్టు ఉండకూడదని !! కానీ ఈ పార్టీ పేరుతోనే వస్తోంది అసలు సమస్య !!

కేసీయార్ పురుష వారసుడిగా కేటీయార్‌కు ఇప్పటికైతే పార్టీ కమిటీలు, ప్రజాప్రతినిధుల మద్దతు కనిపిస్తోంది… పేరుకు వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, మొత్తం పగ్గాలు తన చేతుల్లోనే ఉన్నాయి… రేప్పొద్దున హరీష్ రావు తోకజాడిస్తే పరిస్థితి ఏమిటో తెలియదు గానీ… (టీఆర్ఎస్ అనే సంక్షిప్తనామం వచ్చే మరో పార్టీ పేరు కూడా హరీష్ రావు చేతుల్లో ఉందట… ముందుచూపులో హరీష్ రావు ప్రసిద్ధుడు కదా…)

ఇలా… టీఆర్ఎస్ అనే షార్ట్ ఫామ్ ఓ రాజకీయ వారసత్వం చుట్టూ తిరుగుతోంది… ఎన్నికల సంఘం చివరకు ఏమంటుంది, కవిత గెలుస్తుందా లేదానే విషయాలు ఎలా ఉన్నా… ఈ పేరు వివాదం ఓ వారసత్వ వివాదానికి భావోద్వేగ ప్రతీకగా మారిపోయింది !! ఈ మొత్తం వ్యవహారంలో కేసీయార్ మాత్రం మౌనంగా ఉండటం అసలైన కొసమెరుపు ! రిటైర్డ్ హర్ట్ !?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!
  • అదే పాత కథ- అదే పాత తారాగణం- అదే పాత కథనం… చీప్ కామెడీ అదనం !!
  • … దాంతోనే మొదలైంది యండమూరి సుదీర్ఘ రచన ప్రస్థానం !
  • అనగనగా ఓ దట్టమైన అడవి… దారితప్పిన ఆరుగురు ఫ్రెండ్స్
  • ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు
  • ‘లయ’ తప్పింది ! ‘వదలా’ అంటూ బోరించే కథాకథనాలు !!
  • అబ్సర్డ్ ! ఓ కరెంటు పోరితో యాదిగాడి సంసారం – రక్తికట్టలేదు బాసూ !!
  • ‘‘రాసి పెట్టుకొండి- రావడం మాత్రం పక్కా… అవసరమూ ఉంది’’
  • ది ఒడిస్సీ ! వెండి తెరపై ఓ దృశ్య కావ్యాన్ని చెక్కిన నోలన్ !!
  • చంపేస్తారా? సోనమ్ వాంగ్‌చుక్‌ను చంపేస్తారా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions