.
మన సివిల్ సర్వీస్‌కు ఎంపికలు ఎంత అశాస్త్రీయంగా, ఎంత దరిద్రంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ట్రైనీ ఐపీఎస్ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఉదయ్ కృష్ణారెడ్డి, మొదట్లో పోలీస్ కానిస్టేబుల్… తరువాత ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు… ఒక కోణంలో చూస్తే మంచి సక్సెస్ స్టోరీ, స్పూర్తిదాయకం… కానీ తనేం చేశాడు..?
కర్నాటకకు చెందిన మరో ట్రైనీ ఐపీఎస్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు… ఆమె ఎంత విసిగిపోయి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసిందో అర్థం చేసుకోవాలి..? తను బదనాం అవుతానని తెలిసీ, గత్యంతరం లేకే కదా బుక్ చేసింది తనను… !
Ads
నమ్మదగిన ఆధారాలు చూశాకే కదా పోలీసులు కూడా కేసు పెట్టారు, అవి కన్విన్సింగుగా ఉన్నాయి కాబట్టే కదా అధికారులు ఈ మొగోడిని అర్జెంటుగా సస్పెండ్ చేశారు..? ప్రతిగా ఈ మగ పురుష్ ఏం చేశాడు..? ఆమె శీలం మీద ముద్రలు వేసి, తనను బాధితుడిగా చిత్రీకరించుకునేందుకు రకరకాల వేషాలు వేస్తున్నాడు…
ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడాడు… మీడియా తను అనుకున్నట్టే ట్రాపులో పడింది… ఆమెనే కేరక్టర్ లేని మనిషిగా చూపించడానికి అధ్వానమైన లైన్ తీసుకుంది… ఈ పురుషుడి సూసైడ్ నోట్ ఓ పేద్ద దారుణం… తన పక్కన శానిటైజర్ కావాలని పెట్టుకున్నాడు, ఓ ఫేక్ సూసైడ్ అటెంప్ట్ సీన్ క్రియేట్ చేయడానికి..! నిజానికి ఫుల్లుగా మందు తాగేశాడు… పోలీసులు తన రక్తపరీక్ష చేయించి మరీ తేల్చారు ఈ విషయాన్ని..!
అన్నింటికన్నా ఈ మగపురుష్ ధోరణిలో ఎలాంటి ప్రమాదకర అంశం ఉందంటే…? ‘‘ఆమెకు పెళ్లయినా నా రూమ్‌కు వచ్చేది, ఏడాదిగా సంబంధం ఉంది, నా దగ్గర ఆధారాలున్నాయి, తన మొగుడికీ పంపించాను..’’ అని సోకాల్డ్ ఆ ఫేక్ సూసైడ్ లెటర్‌లో రాశాడు… ఎంత దారుణం..?
మంచోడి మంచితనం, మంచం దగ్గర బయట పడిందని…, ఇద్దరూ రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు, ఆ వీడియోలు రికార్డు చేసి పెట్టాడట… పైగా అవి ఆమె మెగుడికి పంపించాడట… దీంతోనే అర్థమవుతోంది తన క్రూకెడ్ మెంటాలిటీ ఏమిటో…
సివిల్ సర్వీస్ ట్రెయినింగులో పరిచయాలు పెరిగి, ప్రణయాలు పెరిగి, పరిణాయాలు చేసుకున్న జంటలు కోకొల్లలు… కానీ ఇలాంటి కథ తొలిసారి బయటికి వచ్చింది… ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం…
మన యూపీఎస్సీ ఎంపికల తీరు… భట్టీ పట్టి ఏదో సబ్జెక్టులో మంచి మార్కులు రాగానే, ఇంటర్వ్యూలో గట్టెక్కగానే ఆయుధశిక్షణ, సర్వీస్ రూల్స్ గట్రా చెప్పేసి జనం మీదకు వదులుతున్నారు… రేప్పొద్దున సమాజం పట్ల తన ధోరణి ఎలా ఉండబోతోందో, సొసైటీకి ఎలా నష్టకారకుడు అవుతాడో అర్థమవుతోంది కదా…
మరి ఈ కీలక పోస్టులకు సంబంధించి ఎంపికల సమయంలో… శిక్షణ సమయంలో… వాళ్ల ట్రాక్ రికార్డు ఏమిటో, మానసిక స్థితి ఏమిటో ఎందుకు పరీక్షించకూడదు..? అభ్యర్థుల ఐక్యూ, ఈక్యూల మాటేమిటో ఎందుకు ఎంక్వయిరీ చేయించకూడదు..?
(ఆమధ్య సీఎం రేవంత్ రెడ్డి ఓ మాటన్నాడు గుర్తుందా..? కొందరు ప్రొబేషన్ స్టేజ్‌లోనే ‘అవినీతి దుకాణాలు’ పెట్టేశారని… ట్రూ… కొన్ని ప్రిస్టేజియస్ సంస్థలు నియామకపత్రం ఇవ్వడానికి ముందే, ట్రెయినింగుకు ముందే ఇండిపెండెంట్ ఏజెన్సీలతో సదరు ఉద్యోగార్థుల గురించి ఎంక్వయిరీలు చేస్తుంటాయి, గతంలో ఈనాడు కూడా… ఇప్పుడు చేయిస్తున్నారో లేదో తెలియదు)…
దేశాన్ని పాలించే కీలక పోస్టులకు వ్యక్తుల్ని ఎంపిక చేసేటప్పుడు యూపీఎస్సీ గానీ, సర్వీసులో ఉన్నప్పుడు డీఓపీటీ గానీ ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? ఇదే అసలు ప్రశ్న..!!
Share this Article