Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?

July 22, 2026 by M S R

.

సంకోచం ఏమీ అక్కర్లేదు… తోటి ట్రైనీ ఐపీఎస్‌పై లైంగికవేధింపులకు పాల్పడ్డాడని కేసు ఎదుర్కొంటున్న, సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి మనస్తత్వమే ఏదో భారీ తేడా కొడుతోంది… ఆమె కేసు పెట్టింది, తెలంగాణ పోలీసులు నమోదు చేశారు, వెంటనే అతన్ని యూపీఎస్సీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు… ఇది అందరికీ తెలుసు కదా…

తరువాత ఆత్మహత్యప్రయత్నం నాటకం ఆడాడు… ఫుల్లుగా మందు కొట్టి, పక్కన శానిటైజర్ సీసా పెట్టి, అపస్మారకంలోకి వెళ్లిపోయాడు… ఆమె కేరక్టర్‌ బ్యాడ్ చేయడానికి ప్రయత్నించి, తననే ఓ బాధితుడిగా, ఆమెను ఓ కామోన్మదిలా చిత్రీకరించడానికి ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు… అదెంత దారుణంగా ఉందో ‘ముచ్చట’ నిన్న వివరించింది…

Ads

ఆమె పెళ్లయ్యాక కూడా తనతో లైంగిక సంబంధం కోసం వెంపర్లాడిందట, తనే వద్దన్నాడట, ఆమె వినలేదట, రూమ్‌కు వచ్చేదట తరచూ… సో, వీడియో, ఆడియో, ఫోటో ఆధారాలను ఆమె మొగుడికి పంపించాడట… (ఇలాంటి కేరక్టర్లు రేపు సర్వీసులో చేరి జనాన్ని, దేశాన్ని ఉద్దరిస్తారు, ఖర్మ)…

తీరా ఏమైంది..? తన కడుపు క్లీన్ చేయించిన పోలీసులు, రక్తపరీక్ష చేయిస్తే తనేమీ విషపదార్థాలను తీసుకోలేదనీ, ఫుల్లుగా మందు కొట్టాడని తేలింది… సో సూసైడ్ అటెంప్ట్ అనేది ఓ డ్రామా… ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా..? ‘తాగిన మత్తులో రాసినట్టున్నాను, ఏమో, ఏం రాశానో గుర్తులేదు’ అంటున్నాడు… ఎంత దిగజారుడు తత్వం? తనపై పెట్టిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశాడు… తన ఫోన్ దొరికితే అసలు బండారం బయట పడుతుంది కదా అందుకే దాచేసి, పోయిందని చెబుతున్నాడు…

Uday krishna reddy

ఇలాంటి కేరక్టర్‌కు సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు మద్దతుగా నిలవడం అసలైన విషాదం… సదరు ఉదయకృష్ణుడికి తల్లి చిన్నప్పుడే చనిపోయింది, టీన్స్‌లో తండ్రి చనిపోయాడు, రోజుకూలీ కమ్ కూరగాయలమ్ముకునే నానమ్మ పెంచింది, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ దాకా కష్టపడి చదివాడు, ఆ ట్రైనీ లేడీ ఐపీఎస్‌తో తనకున్నది ప్రేమబంధం, తనొక్కడి మీదే యాక్షన్ ఏమిటి..? ఆమె కూడా నిందితురాలే కదా, వెంటనే తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, లోకెేష్ అందరూ అర్జెంటుగా అమిత్ షాతో మాట్లాడి న్యాయం చేయాలని ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు…

ఈయన ఏ లోకంలో ఉన్నాడో, ఐపీఎస్ సర్వీసు ఎలా చేశాడో తెలియదు గానీ… లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి పేరును ఎక్స్‌పోజ్ చేయకూడదనే విజ్ఞత, బాధ్యత కూడా మరిచిపోయినట్టుంది… తన పోస్టులో ఆమె పేరు  కూడా రాసేశాడు…

అయ్యా సారూ, ఉదయకృష్ణుడిది స్పూర్తిదాయక జీవితం అనేది గతం… వర్తమానంలో తన నేరస్వభావం తేటతెల్లం… ఐనా పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం అనేది ప్రస్తుత నేరస్వభావానికి ఎక్స్‌క్యూజ్ ఏమీ కాదు, బారా ఖూన్ మాఫ్ అసలే కాదు… మరీ ఓ నవల రాసినంత పెద్ద పోస్టుతో తెలంగాణ పోలీసులు ఏమీ ప్రభావితం కారులే గానీ… సో, బీ కూల్, డియర్ రిటైర్డ్ ఐపీఎస్ సార్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఢిల్లీ అల్లర్ల వైఫల్యానికి, కల్లోలానికి ఎవరు అసలు బాధ్యులు..?
  • అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?
  • నిజంగానే తెలుగు వర్ణమాలలోని అన్ని అక్షరాలూ మీకు తెలుసా..?
  • క్లియర్ ఎగ్జాంపుల్..! ఇలాంటి కేరక్టర్ల ఎంపిక లోపం యూపీఎస్సీదే..!
  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions