.
అబ్బే, వాళ్లంతా విద్యార్థులు, పిల్లలు, వాళ్ల మీద దమనకాండ ఏమిటి..? కేవలం నీట్‌పై మాత్రమే వాళ్ల ఆందోళన… ఇవే కదా, సోకాల్డ్ సీజేపీ సమర్థకుల వాదనలు… వాళ్ల వెనుక ఏదో ప్లాన్ ఉంది, అసాంఘిక శక్తులు చేరాయి, ఏదో కుట్ర సాగుతోంది అనే భయ సందేహాలను చాలామంది కొట్టిపారేశారు…
కేవలం నీట్ మాత్రమే ఆందోళనాంశం అయితే… అక్కడ యాంటీ హిందూ, యాంటీ నేషన్ స్లోగన్స్ ఏమిటి..? ఎవడి ఎజెండాతో వాడు అక్కడ చేరాడు, అందరి కామన్ సంకల్పం ఒక్కటే… అన్ రెస్ట్ క్రియేట్ చేయడం..! అక్షరాలా 3 వేల మంది నేరచరితులు ఆ అల్లర్లలో ఉన్నారు, అందరినీ ఐడెంటిఫై చేశారు, బుక్ చేస్తారు, ఇప్పుడు ఇక కఠినంగా వెళ్తుంది కేంద్రం…
Ads
అవసరం కూడా! ఎందుకంటే..? అందోళనకారుల దాడుల్లో 120 మంది పోలీసులు గాయపడ్డారు… రేప్పొద్దున దేశ రాజధానిలో ఏ అంశం మీద ఎవరు జంతర్ మంతర్‌కు వచ్చినా ఈ క్రిమినల్స్ ప్లస్ తుక్‌డే గ్యాంగులు జతకలుస్తారు, పెట్రోల్ పోసి మంటపెడతారు… సో, ఎవడినీ వదలొద్దు… ఎటొచ్చీ, మోదీ ఎంతవరకు స్థిరంగా నిలబడగలుగుతాడు అనేదే అసలు ప్రశ్న…
ఇదే సీజేపీ నాయకుడు అభిజిత్ ఇప్పుడు ఏమంటున్నాడు..? అమిత్ షా రిజైన్ చేయాలి, మా ఆందోళనను ఇంకా విస్తృతం చేస్తాం అంటున్నాడు… దొరికిందే చాన్స్ అనుకుని, యాంటీ మోదీ సోషల్ మీడియా, మీడియా రెచ్చిపోతోంది కూడా… బొద్దింకల్ని నవసమాజ నిర్మాతలుగా కీర్తిస్తోంది..!!
ఫో ఫో పోయి ఇన్‌స్టా రీల్స్ చేసుకోపో అని మోదీని వెక్కిరిస్తున్నాడు… నన్ను బీజేపీలో చేరాలని బెదిరిస్తున్నారు అని మరో ఫేక్ క్లెయిమ్… నువ్వు బీజేపీలోకి వస్తే బీజేపీకి ఏం ఫాయిదా, వాళ్లెందుకు రమ్మంటారు, చాన్స్ దొరికితే తొక్కేస్తారు గానీ…
అంతేకాదు, బొద్దింకలు రాకేష్ తికాయత్‌తో కలిసి రైతు ఉద్యమం మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాయి… ఇది మరో ఆందోళనాంశం… ఖలిస్థానీ సానుభూతిపరులతో ఈ రాకేష్‌లు ఢిల్లీలో ఎంతటి విధ్వంసాన్ని క్రియేట్ చేశారో చూశాం కదా… వాళ్లకు తోడుగా కేజ్రీవాల్, ఆప్ ఉండగా, ఇప్పుడు నేనెక్కడ వెనుకబడిపోతానో అన్నట్టుగా అర్జెంటుగా రాహుల్ గాంధీ జతకలిశాడు…
అంతేనా..? సీజేపీ పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుతుందట… సో, ఇవేమీ యాదృచ్చికాలు కావు, ఓ స్కెచ్ ప్రకారమే రూపుదిద్దుకుంటున్నాయి… ఈ స్థితిలో కేజ్రీవాల్ ఢిల్లీ కుర్చీ మీద ఉండి ఉంటే ఇంకా అల్లర్లు అదుపు తప్పేవి…
మొత్తానికి రాబోయే కొద్దిరోజులు జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలు, అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయేమో!! అన్నట్టు మోదీ టీమ్ పాలన సామర్థ్యం మీద బీజేపీ కేడర్‌లోనే అసంతృప్తి నెలకొన్న సంగతి వాళ్లు గుర్తించారో లేదో..!!
Share this Article