Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనం తలుచుకోవాల్సిన మరో పేరు జమునారాణి..! వెళ్లిపోయింది !!

July 31, 2026 by M S R

.

మన మరో గాయని ఈ లోకం నుంచి నిష్క్రమించింది… తలుచుకోవాల్సిన పేరు… కానీ మీడియా అస్సలు పట్టించుకోలేదు… ఆమె పేరు జమునారాణి… మిత్రులు Rochish Mon నివాళి ఓసారి చదవండి…

జమునా రాణి పాట… 1961లో వచ్చిన తమిళ్ష్ ‘పాసమలర్’ సినిమాలోని పాట “పాట్టొన్ఱు కేట్టేన్ పరవసమానేన్…” పాడింది జమునా రాణి… ఒక గాయనిగా తమిళ్ష్, కన్నడం, తెలుగు భాషల్లో చెప్పుకోతగ్గ పాటలు పాడారు జమునా రాణి. సింహళం భాషలోనూ పాడారు జమునా రాణి. ‘6000 పాటలు పాడారు’ అనడం ఎ.ఐ. అబద్ధం; లేదా పరిశీలికమ్మన్యుల పిచ్చితనం. జమునా రాణి అటూ ఇటూగా 500 పాటలు పాడారేమో?

Ads

(మన పరిశీలక మేధావులు ఘంటసాల 10,000 పాటలు పాడారు అని అన్న అబద్ధాన్ని నిజంగా మన మీద రుద్దారు; రుద్దుతూంటారు… ఘంటసాల కన్నడంలో కొన్ని, తమిళ్ష్ 130 పై చిలుకు తెలుగు పాటలు మెత్తం కలుపుకుని 3000ల కన్నా తక్కువే పాడారు)

జమునా రాణి గొప్ప గాయని కాదు అనడం ఎంత నిజమో తీసివేయతగ్గ గాయని కాదు అనడం కూడా నిజమే. ‘ఎంత పాత కళాకారులైతే అంత గొప్ప కళాకారులు’ లేదా అప్పటి, ఒకప్పటి కళాకారులైతే చాలు వాళ్లు గొప్ప కళాకారులే’ అన్నది మన మధ్యతరగతి మాంద్యం. ఆ మాంద్యం ఇంకా ఎన్నాళ్లు? జమునా రాణి చక్కని గాయని.

పాడిన ప్రతి పాటను తన శక్తి మేరకు, తన స్థాయి మేరకు చక్కగా పాడారు జమునా రాణి. జమునా రాణిని హిందీ గీతా రాయ్ వంటి గాయని అనకపోయినా సుమన్ కళ్యాణ్ పూర్ వంటి గాయని అందామా?

సంగీతంపరంగా కొన్ని గొప్ప పాటలను పాడారు జమునా రాణి. ఉదాహరణకు కె.వీ. మహాదేవన్ చేసిన “మామ మామ మామ…” పాట. (ఈ పాట ఏదో కమర్షిఅల్ పాట మాత్రమే, పెద్ద విజయవంతమైన పాట మాత్రమే కాదు; ఎ.ఆర్ రహ్మాన్ వంటి సంగీత దర్శకుడు ఈ “మామ మామ మామ…” పాట ప్రభావంతో హిట్ పాటలు చేశారు).

జమునా రాణి పాడిన పాటల్లో కడు ప్రత్యేకమైన compositional values and quality పరంగా ఒక విశేషమైన పాట “పాట్టొన్ఱు కేట్టేన్ పరవసమానేన్…” పాట. ఈ పాట సినిమా ‘పాసమలర్’ లోని పాటలు అన్నీ గొప్ప పాటలే.
ఈ పాసమలర్ తెలుగులో రక్త సంబంధం సినిమా. “చందురుని మించు అందమొలికించు…” ఎంత గొప్ప పాటో మనకు తెలిసిందే. పాసమలర్ సినిమాలోని పీ.బీ.శ్రీనివాస్, సుశీల పాడిన “యార్ యార్ అవళ్ యార్…” పాట లతా మంగేష్కర్ కుటుంబం పాట. ఆషా భోస్లే ఈ విషయాన్ని స్వయంగా 2004లో విశాఖపట్నంలో చెప్పారు.

“పాట్టొన్ఱు కేట్టేన్ పరవసమానేన్…” పాట ఆ పాసమలర్ సినిమాలో ఒక ప్రత్యేకమైన flavour and flairతో చేశారు ఎమ్. ఎస్. విశ్వనాదన్. ఈ పాసమలర్ దర్శకుడు భీమ్ సింగ్. భీమ్ సింగ్ కొడుకు లెనిన్. లెనిన్ ఒక అంతర్జాతీయ స్థాయి సినిమా కళాకారుడు. నా చిన్నప్పుడు ఆ లెనిన్ తో మాట్లాడుతూ ఈ “పాట్టొన్ఱు కేట్టేన్ పరవసమానేన్ పాట అత్యంత ప్రశంసాత్మకమైనది” అని నేను అంటే లెనిన్ “ఔను” అన్నారు. ఈ పాట భీమ్ సింగుకు కూడా ఇష్టమని నాకు లెనిన్ చెప్పారు.

జమునా రాణి చాల చక్కగా పాడారు ఈ “పాట్టొన్ఱు కేట్టేన్ పరవసమానేన్…” పాటను. ఈ పాట అప్పటి మన తెలుగు సంగీత దర్శకుల స్థాయికి అతీతమైన పాట. విశ్వనాదన్ మాత్రమే ఇలాంటి పాటను రూపొందించగలరు. ఈ పాట తెలుగు తెలుగు ‘రక్త సంబంధం’లోనూ ఉంది.

జమునా రాణి స్మరణలో ఆమె చక్కగా పాడిన ఒక గొప్ప పాట
“పాట్టొన్ఱు కేట్టేన్ పరవసమానేన్…” విందాం …
https://youtu.be/qxGn9eBhySo?si=U4JI9cNErW6xTLnN

.
రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మనం తలుచుకోవాల్సిన మరో పేరు జమునారాణి..! వెళ్లిపోయింది !!
  • అబ్సర్డ్ ! ఈ సీత చుట్టూ అకారణంగా నెగెటివిటీని రుద్దేది కాషాయమే !!
  • సుమంత్‌ను ఫ్లాప్ కెరీర్ వెంటాడుతూనే ఉంది – ఖర్మ థియరీ !!
  • ఉన్నమాటే అన్నాడు – నాణ్యమైన సరుకు ఉత్పత్తే లేదు కదా…
  • చిన్న చిన్న ఆశ ! కొందరికి అస్సలు నచ్చదు – వాళ్లు చూడొద్దు !!
  • వాడు మొనగాడు – చేతిలో పార, గడ్డపార… కళ్లెదుట ఓ ‘దారి’…!
  • కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?
  • ప్రతి పనికీ పార్టీ ఆమోదమా? ఇవి సీఎం ముందరికాళ్లకు బంధాలు?
  • అనుకున్నదే ! బొద్దింకలకు జతగా క్రిమినల్స్ ! ఏదో ప్రిప్లాన్‌డ్ స్కెచ్ !!
  • రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ నాకెక్కడ నిజంగా నచ్చాడంటే..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions