Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఖర్మాఖ్య ! అదిరె అభి సినిమా బెదిరె ! ఫస్టాఫ్ టోటల్ వేస్ట్ !

August 1, 2026 by M S R

.

“దేవాలయాల పవిత్రతను, వాటిపై ఉండే కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడాలి; వాటిని సినిమాటిక్ ప్రయోగాలకు, ముఖ్యంగా తంత్ర విద్యలు లేదా క్రైమ్ నేపధ్యాలకు వాడుకోవడం ద్వారా ఆ ఆధ్యాత్మికతకు భంగం కలుగుతుంది…”

జబర్దస్త్ టీవీ షో నుంచి హీరోలు వచ్చారు, కమెడియన్లు వచ్చారు, దర్శకులు వచ్చారు… అది వెగటు, రోత షో… కానీ ఆ ఆర్టిస్టులను తప్పుపట్టలేం… కానీ హీరోలు రాణించలేదు, దర్శకుల్లో ఒక్క బలగం వేణు మాత్రమే హిట్… ధనరాజ్ ఫెయిల్, ఇప్పుడు అదిరె అభి ఫెయిల్… త్వరలో రాకెట్ రాఘవ తీస్తాడట… సరే, ఎవరి లక్ ఏమిటో వదిలేస్తే…

ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కట్ థ్రోట్ కంపిటీషన్, క్రియేటివ్ పరుగుపోటీలో… ఎవరు ఎంత కొత్తగా కథను ప్రజెంట్ చేస్తారనేది ముఖ్యం, పెద్ద పెద్ద తారలు అవసరం లేదు, నువ్వు కథ ఎలా చెప్పావనేదే ముఖ్యం… బలగం వేణు అది చేయగలిగాడు కాబట్టే ఊరూరా ప్రత్యేక బహిరంగ షోలు పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు…

Ads

అదిరె అభి ఏం చేశాడు..? కామాఖ్య టెంపుల్‌కు లింకయ్యే ఓ కథ రాసుకున్నాడు… గుడికి ఓ క్రైమ్, సస్పెన్స్ యాంగిల్ జోడించాడు… కామాఖ్య అంటే కేవలం బలులు, తంత్ర శక్తులు, క్షుద్ర పూజలు కాదురా బ్రదర్… అది శక్తిపీఠం… వామాచార పూజలకు కామాఖ్యతోపాటు అక్కడున్న దశమహా విద్యలు కూడా కారణం… ఆధారం… కొన్నాళ్లుగా వేణుస్వామి చేస్తున్న ప్రచారం పుణ్యమాని వేలాదిగా తెలుగు భక్తులు వెళ్లివస్తున్నారు, గుడి మీద, దేవత మీద భక్తి పెరుగుతోంది…

ఈ స్థితిలో కామాఖ్య వంటి శక్తివంతమైన, ప్రాచీన పుణ్యక్షేత్రాల నేపథ్యాన్ని తీసుకుని, దానికి సరిపడని క్రైమ్ థ్రిల్లర్ ప్లాట్‌ను అంటగట్టడం వల్ల ఆ టెంపుల్ అసలు సిసలైన పవిత్రత, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక లోతు దెబ్బతింటాయి… థాంక్ సెన్సార్, దీనికి కామాఖ్య అనే పేరు వాడుకోవడాన్ని అభ్యంతరపెట్టారు, దాంతో కర్మాఖ్య అని మార్చారు, చివరకు ఖర్మాఖ్య అయిపోయింది…

ఈ మాటలు కటువుగా ఉన్నా సరే, చెప్పకతప్పదు… ఎస్, కామాఖ్య సమీపంలో తంత్ర విద్యలు తెలిసిన ఓ ఊరు ఈరోజుకూ ఉంది, సో వాట్..? దాన్నీ ఓ పిచ్చి క్రైమ్ కథకు వాడుకుని, ఏవేవో కూర్చి, పేర్చి జనం మీదకు వదలడం ఏమిటి అసలు..?

సినిమా మొదట్లోనే కామాఖ్య మీద 10 నిమిషాలపాటు AV ఉంటుంది, పరమ నాసిరకం.., ఫస్టాఫ్ అంతా హీరోయిన్, ఆమె దోస్త్ పరిచయాలు, ధనరాజ్ పసలేని కామెడీతో గడిచిపోతుంది… అసలు ఫస్టాఫ్ శుద్ధ దండుగ…

కర్మాఖ్య

నమ్మశక్యం కాని సన్నివేశాలు…: ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వెళ్లాల్సిన పనికి, ఆమె స్థానంలో మరో స్నేహితురాలు (హీరోయిన్) వెళ్లడం అనేది బలవంతంగా ఇరికించినట్లు అనిపించింది… ఈ లాజిక్ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు…

నెమ్మదైన ఆరంభం (Slow Narration)…: అస్సాం కామాఖ్య ఆలయం, తంత్ర విద్యలు వంటి సీరియస్ అండ్ పవర్ పుల్ పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, సినిమా ప్రారంభంలో కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు (ధన్‌రాజ్ ట్రాక్ వంటివి) కథ వేగాన్ని నెమ్మదించాయి… దీనివల్ల అసలు కథలోకి వెళ్లడానికి చాలా సమయం పట్టింది…

బలహీనమైన భావోద్వేగాలు…: థ్రిల్లర్ జోనర్‌లో బలమైన ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే చాలా ముఖ్యం. అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు పండకపోవడం, కథనం ఊహకందేలా సాగడం సినిమా మైనస్‌గా మారింది….

అసంపూర్తి భావన (Part-2 లీడ్)…: కథను ఒక పూర్తి స్థాయి అనుభూతిని ఇవ్వకుండా, తదుపరి భాగం (Part-2) కోసం లీడ్ ఇస్తూ ముగించడం వల్ల మొదటి భాగం చూసిన సంతృప్తి ప్రేక్షకులకు పూర్తిగా దక్కలేదు…

మొత్తానికి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో తనకైనా అర్థమైందా అని సందేహం… సెకండాఫ్‌లో కామాఖ్యను బంధించడం, ఆమె బలి ఇవ్వాలనుకోవడం, తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నాలు గట్రా ఇంకా గ్రిప్పింగ్‌గా తీస్తే సినిమా బతికేది… ప్చ్, చివరకు దర్శకుడు తన నాసిరకం ప్రజెంటేషన్‌తో సినిమాను బలిచ్చాడు, ప్రేక్షకుల పర్సుల్ని, టైమ్‌ను బలిచ్చాడు… కామాఖ్య శాపం..!!

ఏమాటకామాట కామాఖ్య పాత్రలో సమైరా బాగా నటించింది… శరణ్య, అభినయ కూడా బాగానే చేశారు… మిగతా అంశాల గురించి చెప్పుకోవడం అవసరం లేదు, ఆ కామాఖ్య మనల్నీ శపించే ప్రమాదం ఉంది… శుభం, జై కామాఖ్య..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఖర్మాఖ్య ! అదిరె అభి సినిమా బెదిరె ! ఫస్టాఫ్ టోటల్ వేస్ట్ !
  • Untold Stories – రామాయణ్‌లో ఈమె ఎవరో, పాత్ర ఏమిటో ఊహించండి ?!
  • రేవంత్ సరైన చర్చ రేపాడు ! ఇవిగో కొన్ని ఇంజినీరింగ్ చేదు వాస్తవాలు !!
  • అజింక్యా అంటేనే అజేయుడు – స్థితప్రజ్ఞుడు… కానీ సరైన వీడ్కోలు లేదు!!
  • ఓ ప్రేమ పెళ్లి ! అత్యంత సంక్లిష్ట- సుదీర్ఘ విడాకుల కేసుకు చివరకు తెర !!
  • మనం తలుచుకోవాల్సిన మరో పేరు జమునారాణి..! వెళ్లిపోయింది !!
  • అబ్సర్డ్ ! ఈ సీత చుట్టూ అకారణంగా నెగెటివిటీని రుద్దేది కాషాయమే !!
  • సుమంత్‌ను ఫ్లాప్ కెరీర్ వెంటాడుతూనే ఉంది – ఖర్మ థియరీ !!
  • ఉన్నమాటే అన్నాడు – నాణ్యమైన సరుకు ఉత్పత్తే లేదు కదా…
  • చిన్న చిన్న ఆశ ! కొందరికి అస్సలు నచ్చదు – వాళ్లు చూడొద్దు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions