Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీతకన్నా బాగుంది! ఇది ఓ ట్రోల్ పోలిక! ఇంతకీ ఈమె ఎవరంటే?!

August 1, 2026 by M S R

.

మనం రామాయణ్ సినిమా గురించి చాలా చెప్పుకుంటున్నాం కదా… నిజంగానే జనంలోనూ ఆసక్తి పెరుగుతోంది, దాంతో మీడియా కూడా సూక్ష్మమైన అంశాల్ని కూడా కథనాలుగా మలుస్తోంది… మొత్తానికి ఆ ట్రెయిలర్ పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకొచ్చి పెడుతోంది సినిమాకు, ఉచితంగా… హైప్ క్రియేట్ అవుతోంది…

అలాంటి ఓ కథనం కనిపించింది ఏదో ఇంగ్లిష్ మీడియాలో… సాయిపల్లవి సీత పాత్ర పోషణ మీద, ఆమె లుక్ మీద ఉద్దేశపూర్వక ప్రచారాల్ని బాలీవుడ్‌లో ఒక సెక్షన్ నడిపిస్తుంటే, తెలుగులో ఇంకేవో కారణాలతో ఆమెను టార్గెట్ చేస్తున్నారు… ట్రోల్ చేస్తున్నారు, బాలీవుడ్ ట్రోల్ ఏమిటంటే..?

Ads

‘సీత పాత్రలో సాయిపల్లవికన్నా ఆమె పక్కన ఉన్న చెలికత్తె ఇంకా అందంగా, సూపర్‌గా ఉంది’… ఇదీ ట్రోల్… దాంతో ఆమె ఎవరనే సెర్చింగు మొదలైంది నెటిజనంలో…

ఒరే బాబూ, ఆమె చెలికత్తె కాదురా, సీత చెల్లెలు, పేరు శృతకీర్తి, ఆ పాత్ర పోషిస్తున్నది ఎవరో కాదు,, ఆమె పేరు సురభి దాస్ అంటూ జాతీయ మీడియా తనే వివరణల్ని ఇస్తోంది… సినిమా టీమ్ మౌనంగా ఉండి, ఈ ట్రోలింగును, ఈ ప్రచారాల్ని, ఈ ఖండనల్ని గమనిస్తోంది…

surbi das

మీడియాలోనే పరస్పర కథనాలు- అన్నీ తాము ఊహించేవే కదా… టైమ్స్ వాడు శృతకీర్తి అని రాస్తే… (శతృఘ్నుడి భార్య)… ఎన్డీటీవీ నో, నో, ఆమె ఊర్మిళ (లక్ష్మణుడి భార్య) పాత్ర అని రాసేశాడు… ఎహె కాదు, నేను శృతకీర్తి పాత్ర పోషిస్తున్నానని ఆ నటి స్వయంగా గతంలోనే వెల్లడించింది మరో మీడియా రీకౌంటర్…

అసలు ఎవరు ఈ సురభి దాస్..? ఆమె ఓ అస్సామీ నటి… 27 ఏళ్లు…  అస్సామీ భాషలోనే చిన్నాచితకా సినిమా, టీవీ పాత్రలు చేసుకునేది… ఆ తర్వాత హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో (‘నిమా డెంజోంగ్‌పా’, ‘పాండ్యా స్టోర్’ వంటి షోలతో) నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, రామాయణ్ సినిమా కేస్టింగ్ డైరెక్టర్ ద్వారా ఈ భారీ సినిమాలో పాత్రకు ఎంపికైంది… ఇదీ ఆమె నేపథ్యం…

surabhi das

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సోలో బతుకే సో బెటర్ ! పెళ్లి కాలేదని ఎంతమాత్రమూ చింతించవలదు !
  • సీతకన్నా బాగుంది! ఇది ఓ ట్రోల్ పోలిక! ఇంతకీ ఈమె ఎవరంటే?!
  • దొరతనం ! అవలక్షణులను తెలంగాణపై రుద్దిన క్షుద్రరాజకీయం !!
  • “వైభవ్ సూర్యవంశీ – ఓవర్ హైప్‌తో అసలు ఒరిజినాలిటీకే గండం?”
  • ఖర్మాఖ్య ! అదిరె అభి సినిమా బెదిరె ! ఫస్టాఫ్ టోటల్ వేస్ట్ !
  • Untold Stories – రామాయణ్‌లో ఈమె ఎవరో, పాత్ర ఏమిటో ఊహించండి ?!
  • రేవంత్ సరైన చర్చ రేపాడు ! ఇవిగో కొన్ని ఇంజినీరింగ్ చేదు వాస్తవాలు !!
  • అజింక్యా అంటేనే అజేయుడు – స్థితప్రజ్ఞుడు… కానీ సరైన వీడ్కోలు లేదు!!
  • ఓ ప్రేమ పెళ్లి ! అత్యంత సంక్లిష్ట- సుదీర్ఘ విడాకుల కేసుకు చివరకు తెర !!
  • మనం తలుచుకోవాల్సిన మరో పేరు జమునారాణి..! వెళ్లిపోయింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions