Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి !!

August 5, 2026 by M S R

.

వల్గర్ నిధి… ఇప్పుడు కొత్తేమీ కాదు… శశికళ- పళనిస్వామి మీద- తరువాత సనాతన ధర్మం మీద – టీవీకే ఎమ్మెల్యేల మీద… అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్ మరణాల మీద… ఇప్పుడు త్రిష- విజయ్ మీద… మధ్యమధ్యలో చాలా వికారాలున్నాయి… అధికార మదం, ధన మదం వంటి చాలా ‘మదాలు’… ఈ మాట అనడానికి సందేహించనక్కర్లేదు…

బహిరంగసభలో… ఓ ప్రతిపక్షనేత హోదాలో ఉండి… కావేరీ జలాల సున్నిత సమస్య మీద నిరసన సభ నిర్వహిస్తూ… ఎంత హుందాగా ఉండాలి..? డబుల్ మీనింగు మాటలతో తన అసలు రోతతత్వాన్ని ప్రదర్శించుకున్నాడు..? దాదాపు మహిళా సెలబ్రిటీలందరూ, ఇతర పార్టీల నేతలందరూ థూత్కరించారు అతన్ని..!

Ads

విజయ్ ఆ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి… తన వ్యక్తిగత జీవితంపై ఆ సందర్భంలో వెగటు వ్యాఖ్యలేమిటి..? సరే, డీఎంకే సమర్థించింది… తప్పదు… స్టాలిన్ కస్సుమన్నాడు విజయ్ మీద, దద్దమ్మ ప్రభుత్వం, అహంకారంతో నాశనమైపోతావ్ అంటూ… కానీ ఒకప్పుడు డీఎంకేతో అంటకాగిన ఏ పార్టీ కూడా వల్గర్ నిధిని సమర్థించలేదు… ఒకే ఒక్కరు తప్ప!! అదీ ఓ మహిళ కావడం ఆశ్చర్యం!

మరీ అంతగా స్టాలిన్ పాదపూజ అవసరమా..? ఆమె పేరు ప్రేమలత… విజయకాంత్ అనే సినిమా హీరో కమ్ రాజకీయ నాయకుడు, డీఎండీకే పార్టీ అధినేత గుర్తున్నాడు కదా… తన భార్య ఈమె… ఆయన మరణం తరువాత ఈమే పార్టీ బాధ్యతలు చూస్తోంది…

ఆమె వల్గర్ నిధి వ్యాఖ్యలపై ఏమని స్పందించిందో తెలుసా..?

 ప్రతిపక్ష గొంతును అణచివేయడమే: ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రజాస్వామ్యంలో వ్యతిరేక గొంతులను అణచివేయడానికి ప్రభుత్వం పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఆమె తీవ్రంగా ఖండించింది.

అభిప్రాయ స్వేచ్ఛ: ఒక రాజకీయ నాయకుడిగా లేదా పౌరుడిగా ఎవరైనా తమ అభిప్రాయాలను లేదా విమర్శలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, దాన్ని నేరంగా పరిగణించి అరెస్టులు చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడింది.

రాజకీయంగానే ఎదుర్కోవాలి: రాజకీయ విమర్శలను రాజకీయాల ద్వారానే ఎదుర్కోవాలి తప్ప, ఇలా అరెస్టుల బాట పట్టడం వల్ల స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని, ఇది ప్రభుత్వ వ్యతిరేక అసంతృప్తిని మరింత పెంచుతుందని ప్రేమలత హెచ్చరించింది… తమది నీటి పోరాటం అట, విజయ్‌ది నటి పోరాటం అట… అదీ ఈ మహిళా నేత బాష్యం… ఖర్మ !!

…… ఇవి వింటుంటే ఆమె మేధోస్థాయి అర్థమవుతోంది కదా… అమ్మా, తోటి మహిళపై కారుకూతలు కూశాడు, నువ్వు కీర్తిస్తున్న నాయకుడు… ఇందులో ప్రతిపక్షాల గొంతుల్ని అణిచివేయడం ఏముంది..? ప్రతిపక్షనేత అంటే కారుకూతలు, రోతమాటల కర్తవ్యం కాదమ్మా…

అభిప్రాయ స్వేచ్ఛ అంటే ఇది కాదు… పోనీ, నిన్ను ఇలాగే ఎవరైనా నిందిస్తే, జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తే, దాన్నీ అభిప్రాయ స్వేచ్ఛ అని వదిలేస్తావా..? ఇందులో రాజకీయంగా ఎదుర్కునేది ఏముంది..? మీ ఆరాధ్య యువనేత చేసింది తప్పు, నేరం, ప్రభుత్వం స్పందించింది, దమ్ముంది, అరెస్టు చేసింది… ఎటొచ్చీ నువ్వే విజయకాంత్ పేరును భ్రష్టుపట్టిస్తున్నావమ్మా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘నేనేంటి? అన్నమయ్యనేంటి? నన్ను వదిలేసేయండి సార్ ప్లీజ్’’
  • ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి !!
  • మద్యం కంపెనీలపై బ్యాన్ ! అసలు నిజం వేరు – మీడియా రాసేది వేరు !!
  • “కంటేనే అమ్మ అని అంటే ఎలా?.. ఈ నిజజీవిత కథే సమాధానం !”
  • ప్రజలకు చేరువగా పాలన ! రేవంత్ సర్కారు భేషైన నిర్ణయం !!
  • తెలంగాణ రాజకీయాల్లో ‘కాష్మోరా’… క్షుద్రోపాసన- తాంత్రిక పూజలు !!
  • ప్రదీప్ రావత్ ! ఆరోజే చివరిరోజు అయిఉండేది- లక్కీగా బయటపడ్డాడు !!
  • రామాయణ నిర్మాతలకి ఓ విజ్ఞప్తి – ఇది సినిమా కాదు, కోట్ల మంది విశ్వాసం!
  • లోకేష్ బాబు గారూ… ఈమె అడుగుతోంది, మీ మంత్రి యవ్వారం ఏమిటని !!
  • కైకేయి దుస్తుల ప్రతి రంగుకూ ఓ ఉద్వేగం – కాస్ట్యూమర్ల భేషైన స్పందన !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions