Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!

August 9, 2026 by M S R

.

జీనత్ అమన్‌కు తెహెల్కా తేజ్‌పాల్‌తో లింకేంటి?
తేజ్‌పాల్‌కు జహాన్ ఖాన్ మద్దతు వెనుక ఉన్న బంధం ఇదే!

బాలీవుడ్‌లో ఒకప్పుడు గ్లామర్‌కు ప్రతీకగా నిలిచిన నటి జీనత్ అమన్ పేరు ఇప్పుడు అనూహ్యంగా జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్ కేసులో వినిపిస్తోంది. కారణం.. తేజ్‌పాల్‌కు మద్దతుగా గళం విప్పిన వ్యక్తి జీనత్ అమన్ కుమారుడు జహాన్ ఖాన్ కావడమే.

Ads

తేజ్‌పాల్‌కు గోవా బెంచ్ బొంబాయి హైకోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన తర్వాత జహాన్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తేజ్‌పాల్ దోషిగా తేలడాన్ని ఆయన “అన్యాయం”గా అభివర్ణిస్తూ.. తీర్పును కేవలం భావోద్వేగాల ఆధారంగా కాకుండా, అందులోని సూక్ష్మ అంశాలను పరిశీలించాలని కోరారు.

అయితే.. జీనత్ అమన్ కుమారుడికి తేజ్‌పాల్‌తో ఇంత సన్నిహిత సంబంధం ఏమిటి?

ఇదీ అసలు లింక్..

జీనత్ అమన్, దివంగత నటుడు- నిర్మాత మజహర్ ఖాన్ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడే జహాన్ ఖాన్. ఫ్రీలాన్స్ కంపోజర్‌గా పనిచేస్తున్న ఆయనకు మరో ఆసక్తికరమైన కుటుంబ అనుబంధం ఉంది.

  • తరుణ్ తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్‌తో జహాన్ ఖాన్ జీవిత భాగస్వామి… (లివ్ ఇన్ రిలేషన్?)

అంటే.. బాలీవుడ్ నటి జీనత్ అమన్ కుటుంబానికి, ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్ కుటుంబానికి మధ్య బంధం ఇక్కడే ఏర్పడింది. తేజ్‌పాల్ కుమార్తె కారా.. పర్యావరణవేత్త, రచయిత్రి…. జహాన్‌తో ఆమెకు ఉన్న వ్యక్తిగత అనుబంధం కారణంగానే తేజ్‌పాల్ కుటుంబంతో జహాన్‌కు సన్నిహిత సంబంధం ఏర్పడింది.

అందుకే.. తేజ్‌పాల్‌పై తీర్పు వెలువడిన వెంటనే జహాన్ స్పందించడం కేవలం బయట వ్యక్తి చేసిన వ్యాఖ్య కాదు. ఆయనకు అది కుటుంబ సభ్యుడికి ఉద్దేశించిన స్పందన.

జీనత్ అమన్ పేరు ఎందుకు ఆసక్తికరం?

ఇక్కడే ఈ కథకు బాలీవుడ్ టచ్ వస్తోంది.

ఒకవైపు.. హిందీ చిత్రసీమలో ఒక తరం యువతను తన అందం, నటనతో ఆకట్టుకున్న జీనత్ అమన్.

మరోవైపు.. భారత జర్నలిజంలో సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లతో గుర్తింపు తెచ్చుకున్న తెహల్కా వ్యవస్థాపకుడు, మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్.

ఈ రెండు కుటుంబాలకు చెందిన తదుపరి తరం వ్యక్తుల వ్యక్తిగత బంధం కారణంగా ఇప్పుడు ఈ రెండు ప్రపంచాలు ఒకే వార్తలోకి వచ్చాయి.

తేజ్‌పాల్ కేసు.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ మలుపు

2013లో గోవాలో తెహల్కా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా తనపై లైంగిక దాడి జరిగిందని ఒక మహిళా సహోద్యోగి తేజ్‌పాల్‌పై ఆరోపణలు చేసింది. కేసు నమోదైన తర్వాత తేజ్‌పాల్ తెహల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ పదవి నుంచి తప్పుకున్నాడు. గోవా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

2021లో గోవా ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా విడుదల చేసింది. అయితే ఈ తీర్పును గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.

దాదాపు 13 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత.. 2026 ఆగస్టు 6న బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ ట్రయల్ కోర్టు తీర్పును పక్కనపెట్టి తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించింది. 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

“ఇది అన్యాయం” అన్న జీనత్ అమన్ కొడుకు

ఈ తీర్పు తర్వాతే జహాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.

“ఈ కేసు వెనుక, కోర్టు ఇచ్చిన తీర్పు వెనుక చాలా నిగూఢమైన అర్థాలు, విశ్లేషించాల్సిన లోతైన విషయాలు (Nuance) ఉన్నాయి’’ ఆయన వాదించాడు… ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తేజ్‌పాల్ కేసులో బయటకు కనిపించే కథకు మించి మరిన్ని అంశాలు ఉన్నాయనేది తన అభిప్రాయం…

తరుణ్ తేజ్‌పాల్ మరో అల్లుడు, నటుడైన అర్జున్ మాథుర్ (టియా తేజ్‌పాల్ భర్త) కూడా సోషల్ మీడియా వేదికగా తరుణ్ తేజ్‌పాల్‌కు మద్దతుగా నిలిచాడు….

అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టం.

జహాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను జీనత్ అమన్ అభిప్రాయంగా చూడటానికి ఆధారం లేదు. ఇది ఆమె కుమారుడు జహాన్ వ్యక్తిగతంగా చేసిన స్పందన. జీనత్ అమన్ స్వయంగా తేజ్‌పాల్ తీర్పుపై ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…
  • Peak Detailing – దురంధర్ అంత తేలికగా అద్భుతాన్ని సృష్టించలేదు !!
  • సూర్య ! ఇప్పుడిక తనకు పోటీ లేదు – మరో రేంజుకు ‘మార్కెట్ వాల్యూ’..!!
  • ఎఐ సొంతంగా దొంగ దారులూ వెతుకుతోంది.. మరో ముప్పు !
  • Friendship Recession – స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions