Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రిటైరయ్యాక ఆయుష్షు ఎనిమిదేళ్లేనట ! ఆంధ్రజ్యోతిలో ఓ పిచ్చి సర్వే !!

August 10, 2026 by M S R

.

ఆంధ్రజ్యోతిలో నిన్న ఓ పిచ్చి సర్వే కనిపించింది… వార్తల ఎంపిక, ప్రయారిటీల్లో కాస్త విచక్షణతో ఆలోచించే ఆంధ్రజ్యోతి ఈమధ్య ఎందుకోగానీ దారితప్పుతున్నట్టు అనిపిస్తోంది… రాజకీయ వార్తల్ని పక్కన పెట్టండి, అవెప్పుడూ బయాస్డ్… కానీ రాజకీయేతరమైనా ఓ పద్ధతిలో ఉండొచ్చు కదా… అసలే ఆదివారం, ఉదయం పేపర్ తెరవగానే నాలుగు పాజిటివ్ వార్తలో, ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన ఆఫ్ బీట్ వార్తలో కనిపిస్తే, ఆరోజంతా ఉల్లాసం…

అదీ పాడుచేస్తున్నట్టుగా ఓ సర్వే కథనం… మరీ ఎంత దారుణమైన సూత్రీకరణలు అంటే… మనిషి రిటైరయ్యాక జస్ట్ 12 సంవత్సరాలేనట… విరమణ తరువాత పుష్కరమే ఆయుష్షు అట… అదీ ప్రపంచ సగటు… అంటే ఇండియాలో ఇంకా తక్కువ… రిటైర్ అయ్యాక ఎనిమిదేళ్లలో జీవితం ఢమాల్ అట… ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మనిషి సగటు ఆయుష్షు పెరుగుతోంది, అది వదిలేసి, మనిషి రిటైర్ కాగానే ఎంత ఆయుష్షు మిగిలి ఉంటుంది అనే లెక్కే అబ్సర్డ్…

Ads

ఎందుకంటే..? రిటైర్‌మెంట్ ఎవరికి..? కొలువులు చేసేవాళ్లకు… జీవితమంతా చేతనైనంతగా కష్టం చేసుకునే కార్మికులు, రైతులు, ఇతర శ్రామికుల మాటేమిటి..? చిన్న వ్యాపారుల మాటేమిటి..? అసలు రిటైర్మెంట్ వయస్సు ఎంత అనేదే పెద్ద చిక్కు ప్రశ్న… మొన్నటిదాకా 58 ఏళ్లు, సర్కారు ఖజానా వట్టిపోయాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే సీన్ కరువై, రిటైర్మెంట్ ఏజ్ పెంచేస్తున్నారు… పెంచుతారు ఇంకా…

కొందరికి 58, ఇంకొందరికి 61, కొన్ని వర్శిటీల్లో 65… ఏది రిటైర్మెంట్ వయస్సు… ఐనా మనిషి ఆయుష్షు దేని మీద ఆధారపడి ఉంటుంది… 1) బాడీ కానిస్టిట్యూషన్ 2) అలవాట్లు 3) వైద్యసదుపాయం 4) వైద్యానికి తగిన ఆర్థిక స్థితి 5)  సర్కిల్ 6) ఆరోగ్య బీమా 7) అదృష్టం 8) కుటుంబం 9) లొకాలిటీ 10) కాలుష్యం 11) జీవనశైలి వ్యాధులు 12) పెన్షన్లు… ఇలాంటివే ఎన్నో… కానీ ఆంధ్రజ్యోతి ఏం రాసిందో తెలుసా..? ఓసారి చదవండి…



ఉద్యోగానికి వీడ్కోలు పలికాక పురుషులకు మిగిలే శేష జీవితం ఎన్నాళ్లు? ఇదే అంశంపై ‘మాన్యువల్‌’ అనే సంస్థ 35 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రపంచవ్యాప్తంగా పురుషుల సగటు రిటైర్మెంట్‌ వయసు 64.2 సంవత్సరాలని ఆ సర్వేలో తేలింది.

అతి తక్కువ ఉద్యోగ విరమణ వయసు ఉన్న దేశాల్లో భారత్‌, చైనా, మలేషియా, తుర్కియే, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ దేశాల్లో పురుషుల సగటు ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఇటలీ, గ్రీస్‌, ఐస్‌లాండ్‌లలో ఇది 67 ఏళ్లు. బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, స్పెయిన్‌లలో 66 ఏళ్లుగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఈ సర్వే ప్రకారం ప్రపంచంలో పురుషుల సగటు ఆయుర్థాయం 76.8 సంవత్సరాలు. అత్యధికంగా స్విట్జర్లాండ్‌లో మగవారి సగటు ఆయుర్థాయం 81.9 ఏళ్లుగా ఉందని సర్వేలో తేలింది. ఆ తర్వాతి స్థానంలో 81.4 ఏళ్లతో జపాన్‌ ఉంది. స్వీడన్‌లో 81.3 ఏళ్లు.. నార్వే, ఇటలీ, ఐస్‌లాండ్‌లలో 81 ఏళ్లు.. స్పెయిన్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లో 80 ఏళ్లు ఉంది. మనదేశంలో ఇది 68.5 ఏళ్లుగా ఉంది. దక్షిణాఫ్రికాలో పురుషులు సగటున 60.7 ఏళ్లకే మరణిస్తున్నారు.

రిటైర్మెంట్‌ తర్వాత పుష్కరకాలమే…

రిటైర్మెంట్‌ తర్వాత పురుషుల ప్రపంచ సగటు జీవితకాలం 12.67 సంవత్సరాలు అని సర్వేలో తేలింది. మన దేశంలో ఇది 8.5 ఏళ్లు మాత్రమే. దక్షిణాఫ్రికాలో రిటైర్‌మెంట్‌ నాటికే మరణిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లో మాత్రమే రిటైర్మెంట్‌ తర్వాత అత్యధికంగా 17 ఏళ్లపాటు పురుషులు బతుకుతున్నారు.

ఉద్యోగ జీవితం ముగిశాక జీవన విధానంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పు.. ఒంటరితనం కూడా ఆయుర్థాయంపై ప్రభావం చూపుతోంది….



ప్రపంచంలో ఎవడో ఏదో పిచ్చి సర్వే చేస్తాడు, లేదా చేసినట్టు చెబుతాడు, అది ఎంతమేరకు పాఠకులకు అందించాలో, అసలు అందించాలో వద్దో పత్రిక పాత్రికేయ విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి… మరీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రీల్స్, యూట్యూబ్ చానెళ్లలాగా మారిపోతే… ఇదుగో, పైన చెప్పినట్టే ఉంటుంది…!! అవునూ సగటు జర్నలిస్టు ఆయుష్షు ఉద్యోగ విరమణ తరువాత ఎంత మిగిలి ఉంటంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రిటైరయ్యాక ఆయుష్షు ఎనిమిదేళ్లేనట ! ఆంధ్రజ్యోతిలో ఓ పిచ్చి సర్వే !!
  • ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!
  • కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?
  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!
  • జీనత్ అమన్‌కూ ‘తెహెల్కా’ తేజ్‌పాల్‌కూ ఏమిటి సంబంధం?!
  • బొద్దింకలు సజీవంగా, చురుకుగా ఉండాలట – రాజకీయాల్లోకి రావద్దట..!!
  • … అంటే నగరజనం కాలుష్యంలోనే బతకాలా మిస్టర్ కేటీఆర్ ?!
  • GOBARdhan ! పెట్రోల్‌లో ఇథనాల్‌లాగే- గ్యాస్‌లో బయో CNG మిక్స్ !!
  • తొలి సినిమాతోనే మంచి పేరు ! ప్చ్, రిక్షా తోలుకుంటున్నాడు !!
  • Self Editing … అదే యూట్యూబర్లు అయితే దుమ్మురేపేవారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions