Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియా- పాక్ యుద్ధం జరిగితే… టర్కీ, సౌదీ పాల్గొంటాయా !?

August 10, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta … అన్నా, టర్కీ – సౌదీ – పాకిస్థాన్ మధ్య అదేదో ఒప్పందం జరిగింది అట. భారత్ కు ముప్పు లేదా? ముగ్గురు కలిసి భారత్ మీద దాడి చేస్తే ఎలా? : ఒక అమాయక ప్రశ్న.

భారతదేశం – పాకిస్తాన్ యుద్ధంలో సౌదీ గాని టర్కీ పాల్గొనవు. టర్కీ ఆయుధ సహాయం, సౌదీ అరేబియా ధన సహాయం చేస్తాయి. అది కూడా పాకిస్తాన్ మీద భారతదేశం మొదట యుద్ధం ప్రకటిస్తేనే… పాకిస్తాన్ వాడు భారతదేశంలో టెర్రరిస్ట్ దాడులు చేసిన తర్వాత భారతదేశం తిరిగి దాడి చేస్తే సహాయాలు ఏమీ ఉండవు .

Ads

అందుకే ఒప్పందాలు పూర్తిగా చదవాలి. మీడియా రాసే పొట్టి, వేగవంతమై చిన్న చిన్న వార్తలు చూసి ఏదేదో అయిపోతోంది అనుకోకూడదు.

ఇంకొకటి … పాకిస్థాన్‌కు సౌదీ అరేబియాతో ఇప్పటికే, అంటే 2025 నుంచే Strategic Mutual Defence Agreement ఉంది. ఆ ఒప్పందం తర్వాత 2026లో ఇరాన్‌తో ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ సౌదీకి సైనిక సహాయం కూడా అందించింది.

Reuters వార్తల ప్రకారం…, సౌదీ భద్రత కోసం పాకిస్థాన్ వేలాది సైనికులు, ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా మోహరించింది.  అంటే ఇక్కడ టర్కీ గానీ, సౌదీ గానీ పాకిస్థాన్ ని ఈ ఒప్పందంలో చేర్చుకున్నది పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ ని వాళ్ళు వాడుకోడానికి తప్పితే సౌదీ, టర్కీ వచ్చి పాకిస్థాన్ కి మద్దతు ఇవ్వడానికి కాదు…

ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీని నెల జీతానికి ఇరాన్ దాడి నుండి సౌదీ ఎయిర్ బేస్ లను కాపాడుకోవటానికి, ఎమెన్ సరిహద్దులో సౌదీ తరుపున పోరాడటానికి వాడుతున్నారు. ఐటీ అవుట్సోర్సింగ్, సర్వీస్ అవుట్సోర్సింగ్ లాగా ఇది ఆర్మీ జవాన్ ల కిరాయికి సర్వీస్ అవుట్సోర్సింగ్ అన్న మాట.

అందుకే దేశ రక్షణ వంటి విషయాల్లో వాట్సాప్ హెడ్‌లైన్లు కాదు… అసలు ఒప్పందంలోని నిబంధనలు చదవాలి.
వార్త చిన్నదైనా… విషయం చాలా పెద్దది.
హెడ్‌లైన్ చూసి భయపడకండి. పూర్తి విషయం తెలుసుకుని మాట్లాడండి.

#PardhaTalks #India #Pakistan #SaudiArabia #Turkey #Defence #Geopolitics #NationalSecurity #IndiaPakistan #StrategicAffairs #MeccaDefenceAgreement

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా- పాక్ యుద్ధం జరిగితే… టర్కీ, సౌదీ పాల్గొంటాయా !?
  • వరుణయాగం ! క్షుద్ర పూజలకు విరుగుడు !! రేవంత్ వారుణాస్త్రం !!!
  • …. ఇంతకీ విజయ్‌తో విడాకులపై సంగీత ఎందుకు రాజీపడింది ?!
  • రాజేంద్రప్రసాద్- జారుడుబండ ! మరోసారి నవ్వులపాలు !!
  • ‘‘ముందు అతడిని పంపించేయండి – లేదంటే నేను షూటింగ్‌కే రాను’’
  • … అద్సరే గానీ వెస్టీండీస్ లేని క్రికెట్ ప్రపంచ కప్… నిజమేనా !!
  • రిటైరయ్యాక ఆయుష్షు ఎనిమిదేళ్లేనట ! ఆంధ్రజ్యోతిలో ఓ పిచ్చి సర్వే !!
  • ప్రభాత ఉదయం ! ఎవరిది ఈ కొత్త పత్రిక ? అంతుచిక్కని గోప్యత !!
  • కనిపించే దృశ్యం రికార్డవుతుంది – మరి పరిమళం, రుచి మాటేమిటి ?
  • ఆర్థిక సంస్కరణలకు అసలు సూత్రధారి… వెంకిట రమణన్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions