.
హీరో, తమిళనాడు సీఎం విజయ్ నుంచి విడాకులు ఇప్పించాలని ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటిషన్‌ను తానే విత్ డ్రా చేసుకుంది… దాంతో కేసు మూసేసింది కోర్టు… కానీ విడిపోవాలని అనుకున్న సంగీత ఎందుకు వెనక్కి తగ్గింది… తమిళ మీడియాలో రకరకాల కథనాలు…
చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఎందుకు..? దంపతులు చివరిసారి కలిసి జీవించిన ప్రాంతం ఏ న్యాయాధికారి పరిధిలో వస్తుందో అక్కడే విడాకుల పిటిషన్ దాఖలు చేయాలి… విజయ్, సంగీత నివాసం చెన్నై శివారులోని నీలంకరై (Neelankarai) పరిధిలోకి, తద్వారా చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వస్తుంది…
Ads
ఓ సినిమానటి మా జీవితంలోకి (త్రిష) రావడం వల్ల తమ దాంపత్యం డిస్టర్బ్ అయిపోయిందనీ, నేను మానసికంగా తీవ్ర వేదనకు గురవుతున్నాననీ, సంసారం కోణంలో అన్యాయానికి గురయ్యాననీ వాపోయిన సంగీత ఎందుకు రాజీపడింది..? ఇదీ అసలు ప్రశ్న…

ఎందుకంటే, ఒక దశలో ఆమె 250 కోట్ల సెటిల్మెంట్ భరణం అడిగిందనీ, పిల్లల బాగోగులు కూడా విజయే చూసుకోవాలని షరతు పెట్టిందనీ… పిల్లల బాధ్యత తనదేననీ, 35 కోట్ల భరణం ఇస్తాననీ విజయ్ అంగీకరించినట్టు తమిళ మీడియా వార్తలు చెప్పాయి… ఈలోపు విజయ్ సీఎం అయ్యాడు…
అధికారికంగా విడాకులు, కుటుంబ వ్యవహారం ముఖ్యమంత్రిగా విజయ్ ప్రతిష్టకు మంచిది కాదని భావించి, ఇద్దరికీ సన్నిహితులు, శ్రేయోభిలాషులైన వాళ్లు రాజీ కుదిర్చారని ఒక కథనం… ముఖ్యమంత్రిగా విజయ్ సంపాదన, ప్రతిష్ట మరో రేంజుకు వెళ్తుందనీ, సో, పిల్లల భవిష్యత్తు, ఆ డబ్బు, ఆ అధికారం కోసం సంగీత రాజీపడిందని మరో కథనం…

కానీ డబ్బు ఆమెకు కొత్త కాదు, విజయ్‌ను పెళ్లిచేసుకునేనాటికే సంగీతది పెద్ద ధనిక, పారిశ్రామిక కుటుంబం… అప్పటికి విజయ్ ఆమెతో పోలిస్తే ఆర్థికంగా జీరో… విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది… విడాకుల కేసు దాఖలు చేసేనాటికే విజయ్ బోలెడంత సంపాదించాడు, సో, డబ్బు కోసం రాజీపడిందనేది ఉత్త మాట…
ఇద్దరూ ఒక్కటయ్యారు, ఇక త్రిష చాప్టర్ క్లోజ్..? ఈ కథనాలూ కొన్ని కనిపించాయి… కానీ విడాకుల కేసు విత్ డ్రా చేసుకున్నంత మాత్రాన విజయ్, సంగీత గతంలోలాగా కలిసి సఖ్యతతో జీవించే అవకాశాలు లేవు… (నేను కూడా విజయ్ ఇంట్లో ఉండటానికి ఉత్తర్వులివ్వాలి అని కూడా చెంగల్పట్టు కోర్టును అడిగింది సంగీత)…
సో, త్రిష చాప్టర్ క్లోజ్ ఏమీ కాలేదు… ఎప్పటిలాగే గుట్టుగా బంధం కొనసాగవచ్చు, త్రిషను ఏదో అంటే ఏకంగా స్టాలిన్ కొడుకు ఉదయనిధి మీదే కేసు పెట్టి అరెస్టు చేశాడు, ఇద్దరూ కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు… సో, త్రిష- విజయ్ బంధం అలాగే కొనసాగుతున్న ఓ బహిరంగ రహస్యం…

మరో విచిత్ర కథనం కనిపించింది… విడాకులు వస్తే విజయ్- త్రిష అధికారికంగా ఒక్కటవుతారు, తన కాపురంలో నిప్పులు పోసిన త్రిషను సాధించాలంటే… విడాకులు తీసుకోవద్దు, ముఖ్యమంత్రిగా తను అధికారికంగా త్రిషను పెళ్లి చేసుకోవద్దు… గుట్టుగానే, చాటుమాటుగానే విజయ్- త్రిష బంధం ఉంటే ఉండనీ, సమాజం ఆమోదం దొరకొద్దు, ఆ బంధం చట్టబద్దం కావద్దనే భావనతోనే సంగీత ఇలా విడాకుల కేసును విత్‌డ్రా చేసుకుందట… విజయ్- త్రిష… ఒక ఎంజీఆర్- జయలలిత…
నిజానికి అలా ఆలోచించేదే అయితే అసలు విడాకులకే అప్లయ్ చేసి ఉండేది కాదు కదా… సో, మిస్టరీ కంటిన్యూస్..!!
Share this Article