Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Balochistan – ఓ కొత్త దేశం పురుడు పోసుకుంది – కానీ..?

August 11, 2026 by M S R

.

Pardha Saradhi Potluri  …. బలూచిస్తాన్ తో చైనాకి చెక్ పెట్టినట్లేనా?
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తనకి తాను స్వతంత్రం ప్రకటించుకున్నది ఈ రోజు!

బలూచీలు తమ రాజ్యాంగాన్ని హిందీ భాషలో వ్రాసుకున్నారు! త్వరలో వెల్లడిస్తారు!
బలూచిస్తాన్ రాజ్యాంగంలో తమ దేశం హిందూ, ముస్లిం దేశంగా పేర్కొన్నారు!
బలూచిస్తాన్ లో ఉన్న శక్తి పీఠం ‘ హింగ్లజ్ మాత ’ ని దృష్టిలో పెట్టుకొని హిందూ పదం చేర్చారు బలూచీలు!

Ads

85% శాతం బలూచిస్తాన్ భూభాగం BLA అధీనంలోకి వచ్చేసింది అని BLA ప్రకటించింది! అంతర్జాతీయ సమాజాన్ని BLA అభ్యర్థిస్తూ బాలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా గుర్తించమని కోరుతున్నది.
BLA ప్రకటనలో ఆత్మవిశ్వాసం కనపడుతున్నా ఐక్యరాజ్యసమితి ఆమోదం పొందడం అంత సులువుగా జరిగేపని కాదు! బలూచిస్తాన్ ని ఒక దేశంగా ఏదన్నా దేశం గుర్తించవచ్చు. అంత మాత్రాన ఐక్యరాజ్యసమితిలో ఆమోదం పొందాలి అంటే మెజారిటీ దేశాలు ఆమోదం తెలపాలి!

బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాకు సహాయం చేయమని పదే పదే భారత్ ని ముఖ్యంగా మోడీని అభ్యర్థించడం వలన ఉపయోగం ఉండదు! మోడీ చెప్తే బలోచిస్తాన్ ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపబడదు!
బాలూచిస్తాన్ ని ఒక దేశంగా గుర్తించాలి అంటే ఏమేమి చేయాలో ఒకసారి పరిశీలిద్దాం!

1933, డిసెంబర్ 26 న ఉరుగ్వె లోని మోంటేవీడియో లో ఏడవ అంతర్జాతీయ అమెరికా స్టేట్స్ సమావేశాలు ( Seventh International Conference of American States ) జరిగినపుడు దేశానికి గుర్తింపు ఇవ్వడానికి కొన్ని ప్రిన్సిపుల్స్ ని ఆమోదించి సంతకాలు చేశాయి 19 దేశాలు ( ఎక్కువగా అమెరికా నుండి ). అప్పటినుండి ఇవి అంతర్జాతీయ ప్రిన్సిపుల్స్ గా అమలవుతున్నాయు.

1.మొంటేవీడియో ( Montevideo ) తీర్మానం 1933 అనేది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఈ తీర్మానంలో ఏదన్నా దేశాన్ని గుర్తించాలి అంటే పాటించాల్సిన విధి విధానాలని పొందుపరిచారు. అప్పటి నుండి ఆ తీర్మానంలో పొందుపరిచిన అంశాలని విధిగా పాటిస్తున్నారు.

మోంటేవీడియో ( Montevideo Convention ) ఆర్టికల్ 1 ప్రకారం దేశంగా గుర్తింపబడాలి అంటే కావాల్సిన అర్హతలు ఇలా ఉండాలి.

2.ప్రజలు నిర్దేశించిన దేశ సరిహద్దుల లోపలే నివసించాలి. దేశ దిమ్మరులు, సంచార జాతి ప్రజలకి హక్కు ఉండదు. ఈ నిబంధన బలూచిస్తాన్ వర్తిస్తుంది ఎందుకంటే ప్రజలు బలోచిస్థాన్ లోనే ఉంటున్నారు కనుక.

3.దేశానికి సరిహద్దులు నిర్దేశించి ఉండాలి! ఒక వేళ సరిహద్దుల విషయంలో వివాదాలు ఉన్నా అది ఆ దేశ గుర్తింపుకి ఆటంకం ఉండదు. బలూచిస్తాన్ కి అర్హత ఉంది ఈ విషయంలో.

4. పని చేస్తున్న రాజకీయ ప్రభుత్వం ఉండాలి, శాంతి భద్రతలని నియంత్రిస్తూ ఉండాలి. అలాగే ఆ ప్రభుత్వం సరిహద్దులని రక్షించుకోగలిగిన స్థితిలో ఉండాలి. ఈ నిబంధన కోసం బలూచీలు ప్రయత్నించ్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం లేదు అక్కడ!

5. ఏవైనా సార్వభౌమ సత్తాక దేశాలతో దౌత్యపరమైన సంబంధాలని కలిగి ఉండాలి అలాగే దౌత్యపరమైన ఒప్పందాలని చేసుకొని ఉండాలి. ఈ విషయంలో భారత్ సహాయం చేయగలదు, ఎలా అంటే బలూచిస్తాన్ లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏర్పడగానే భారత ప్రభుత్వం బలూచ్ ప్రభుత్వాన్ని గుర్తించి ఫార్మాలిటీగా ఏవో రెండు మూడు దౌత్యపరమైన ఒప్పందాలు చేసుకొని బలోచిస్తాన్ కి ఆ అర్హత ఇవ్వవచ్చు! బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి, న్యూఢిల్లీ లో బలూచిస్తాన్ రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించవచ్చు.

ఎన్ని దేశాలు అధికారికంగా బలూచిస్తాన్ ని ఒక దేశంగా గుర్తించాయి అన్నదానిమీద పరిమితులు అంటూ ఏవీ లేవు. సరిహద్దు వివాదాలు అనేవి గుర్తింపుకి అడ్డం రావు.

So! బలూచీలు బలూచిస్తాన్ వరకూ ఎన్నికలు నిర్వహించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందు. ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మిగతా కార్యక్రమాలు ఒకదాని తరువాత ఇంకొకటి మెల్లగా పూర్తి చేసుకోవచ్చు! ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడ్డాక భారత్ తోడ్పాటు ఇవ్వగలుగుతుంది.

ఐక్యరాజ్యసమితి గుర్తింపు కావాలి అంటే ఏమి చేయాలి?
మోంటేవీడియో కన్వెన్షన్ లో పేర్కొన్న అంశాలని పూర్తి చేసినంత మాత్రాన ఒక దేశంగా మాత్రం గుర్తింపు వస్తుంది కానీ ఐక్యరాజ్యసమితిలో ఆటోమాటిక్ గా సభ్యత్యం రాదు.
రెండు అంశాలని పూర్తి చేయాల్సి ఉంటుంది!

7. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ( UN Security Council ) లోని 15 సభ్య దేశాలలో కనీసం 9 సభ్య దేశాలు బలోచిస్థాన్ ని బలపరుస్తూ తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

8. భద్రతా మండలిలో 15 సభ్య దేశాలలో 5 శాశ్వత సభ్యదేశాలు అయిన అమెరికా, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్ డం, ఫ్రాన్స్ దేశాలలో ఏదన్నా ఒక్క దేశం వీటో చేస్తే ఆ తీర్మానం వీగిపోతుంది!

9. భద్రతా మండలిలో ఆమోదం పొందాక ఐక్యరాజ్యసమితి జెనరల్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి వోటింగ్ పెడతారు, మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు వస్తే అప్పుడు ఐక్యరాజ్యాసమితి సభ్య దేశం అవుతుంది బలూచిస్తాన్!

ఇన్ని అడ్డంకులని అధిగమించాల్సి ఉంటుంది బలూచీలు! ఊరికే భారత దేశ జెండా పట్టుకొని క్వేట్టాలో భారత జాతీయగీతం పాడినంత మాత్రాన భారత్ ఇతరత్రా సహాయం చేయవచ్చునేమో కానీ ముందు వాళ్లకి వాళ్ళు నేరవేర్చాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి పైన పేర్కొన్న విధంగా!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Balochistan – భారత్ Vs చైనా Vs అమెరికా! జియోపాలిటిక్స్ !!
  • Balochistan – ఓ కొత్త దేశం పురుడు పోసుకుంది – కానీ..?
  • వావ్… బాబు గారు ఆల్రెడీ ఎల్‌నినో సంక్షోభాన్ని దాటేశారట..!
  • మధ్యవర్తిత్వం చేసిన- ఆ జర్నలిస్టులు, లాయర్లపైనా కేసు ?!
  • బాపు అంటే..? ఇదుగో ఈ కథ చదివితే అర్థమవుతుంది ఆ పదం విలువ..!!
  • మొత్తం 1000 – రెండు లివర్లు ఎక్స్‌ట్రా… ఈ మీల్స్ ఆంటీ ఇక సినిమా ఆంటీ !!
  • పిచాయ్ భార్య కోపం- మ్యాప్స్ పుట్టుకకు బీజం..! ఈ కథ నిజమా? అబద్ధమా?
  • పాడిందే పాటరా ! మోదీ పేరెత్తలేక… రేవంత్ మీద పెడ శోకాలు !!
  • రావణాయణం – ఒక ‘విలన్’ వెనుక పది తలల మేధో వైభవం !
  • KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions