.
ఇంతకీ త్రిష ఎవరిని తిట్టింది…? తనను మళ్లీ బజారుకు లాగి, అల్లరిపాలు చేయబోయి, తనే అల్లరిపాలై, చివరకు కేసుల పాలై, అరెస్టు పాలైన ఉదయనిధి స్టాలిన్‌నా..? విడాకులకు అప్లయ్ చేసి, అడ్డగోలు భరణం అడిగి, విజయ్ సీఎం కాగానే విడాకులు వద్దు, కాంప్రమైజ్ అని కోర్టులో చెప్పేసి, విత్ డ్రా చేసుకుని, కలిసి ఉంటే కలదు సుఖం అని పాడుతున్న విజయ్ భార్య సంగీతనా..?
లేక తనను తానే తిట్టుకుంటోందా..? ఏజ్ మీద పడుతోంది, ఇంకా ఇంకా విజయ్ వెంట పడుతూ, వెంపర్లాడుతూ బజారున పడే బదులు… నాలుగు డబ్బులు సంపాదించుకుని, శాంతిగా, సుఖంగా ఉండక ఎందుకీ డ్రామాలు నీకు అంటూ అద్దం ముందు నిలబడి, వైరాగ్యంతో స్వీయ శాపనార్థాలు పెట్టుకుంటోందా..?
Ads
అవును… త్రిష క్రిప్టిక్ పోస్టులపై నెటిజనంలో చర్చలు ఇవే… వివరాల్లోకి వెళ్దాం… కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సతీమణి సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో తన డివర్స్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం, మరోవైపు నటుడు కం పొలిటిషియన్ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్- విడుదల వంటి పరిణామాల వేళ నటి త్రిష క్రిష్ణన్ పెట్టిన పోస్టులు ప్రస్తుతం దక్షిణాది సినీ వర్గాలలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి…

“ఈ వయసులో డ్రామాలు చేయడం సిగ్గుచేటు… వెళ్లి డబ్బు సంపాదించుకుని శాంతిగా ఉండు” అంటూ త్రిష పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించిందనే చర్చ జోరుగా సాగుతోంది…
ఇది విజయ్‌ని గురించా లేక ఉదయనిధి స్టాలిన్ గురించా అన్నది పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం కొందరు నెటిజన్లు దీన్ని తిప్పి కొడుతున్నారు. “ఈ విమర్శ తనకే వర్తిస్తుంది కదా! వివాదాలు, రూమర్లు చుట్టుముడుతున్న ఈ సమయంలో విజయ్ కోసం ఈ వేషాలు దేనికి? నాలుగు డబ్బులు సంపాదించుకుని ప్రశాంతంగా ఉండమనే సలహా త్రిష తనను తనే ఉద్దేశించుకుని రాసుకున్నట్లుంది” అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

త్రిష ఎవరి వయస్సును ప్రస్తావిస్తూ ఎవరిని విమర్శిస్తోంది? త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “Drama at this age is embarrassing… Go make some money and find peace” (ఈ వయసులో డ్రామాలు చేయడం సిగ్గుచేటు… వెళ్లి డబ్బు సంపాదించుకుని శాంతిగా ఉండు) అని పేర్కొంది… ఇందులో నేరుగా ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, విజయ్ భార్య సంగీత డివర్స్ పిటిషన్ ఉపసంహరణ పరిణామాలు, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం నడుమ ఈ పోస్ట్ రావడంతో ఇది కచ్చితంగా వారిద్దరిలో ఎవరో ఒకరి గురించేనని నెటిజన్లు బలంగా విశ్వసిస్తున్నారు.
వయసుల వివరాలు (Ages of Key Figures) … ప్రస్తుత వివాదంలో ప్రస్తావనకు వస్తున్న ప్రముఖుల వయసులు…
- విజయ్ (Vijay)…: 52 ఏళ్లు (జూన్ 22, 1974 జన్మించాడు)సంగీత సోర్నలింగం (Sangeetha Sornalingam)….: దాదాపు 51- 52 ఏళ్లుత్రిష క్రిష్ణన్ (Trisha Krishnan)…: 43 ఏళ్లు (మే 4, 1983 జన్మించింది)
త్రిష పెట్టిన పోస్టులపై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు: ఒకవైపు “ఇట్స్ ఏ ఛాయిస్ టు బి అన్‌బోథర్డ్. చూజ్ ఇట్” (నిర్భయంగా, పట్టించుకోకుండా ఉండటం ఒక ఎంపిక, దాన్ని ఎంచుకోండి) అని ఆస్ట్రేలియా నుండి పోస్టులు పెట్టిన త్రిష, మరోవైపు ఇలా వరుసగా క్రిప్టిక్ పోస్టులు పెట్టడం ఆమె అంతర్గత అశాంతికి, వైరాగ్యానికి, విడాకుల పిటిషన్ విత్‌డ్రాతో ఇక విజయ్ దక్కడనే నైరాశ్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది…
మొదట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్, తరువాత ఉదయనిధి, తాజాగా ఎవరో అన్నాడీఎంకే లీడర్… అందరూ త్రిషను ముందుపెట్టి విజయ్‌ను టార్గెట్ చేస్తున్నారు… పదే పదే ఆమె అల్లరిపాలవుతున్నదే తప్ప ఫాయిదా ఏమీ లేదు… అందుకేనా ఈ వైరాగ్యం..!!
Share this Article