Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!

August 13, 2026 by M S R

.

సమస్య ఏమిటి..? రోగి ఎంచుకున్న హాస్పిటల్ ఏమిటి..? అక్కడే ఎందుకు..? అని రోగి విచక్షణను, నిర్ణయాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు… వాళ్ల ఇష్టం- కానీ కొన్నిసార్లు కొన్ని పోలికలు అనివార్యంగా వస్తాయి… అదే ఇది…

రాంచరణ్‌కు పెద్ది షూటింగులో మణికట్టుకు గాయమైంది.,. ఎలాగోలా షూటింగు లేటయితే నిర్మాతకు నష్టం అనే భావనతో అలాగే నడిపించేశాడు… డబ్బింగ్, సినిమా ప్రిరిలీజ్ గట్రా పూర్తిచేసి, తరువాతే కుటుంబంతో సహా కేరళ, కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్‌కు వెళ్లాడు, సర్జరీ లేదా చికిత్స కోసం… గుడ్… తన చాయిస్…

Ads

కానీ తన అత్తింటి హాస్పిటల్స్ అపోలో… తన భార్య ఆ గ్రూప్ హాస్పిటల్స్‌కు వారసురాలు… ఆ హాస్పిటల్స్‌లో కూడా అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో ఆర్థోపెడిక్ చికిత్సలున్నాయి… (ముఖ్యంగా జూబ్లీహిల్స్ అపోలోలో)… చిటికె వేస్తే ఓ పది మంది ఆర్థోపెడిషియన్స్ వచ్చేస్తారు… అలాంటప్పుడు ఆ గంగా హాస్పిటలే ఎందుకు అనే ప్రశ్న మొన్న తలెత్తింది…

నిజమే, ఒకరకంగా అది అపోలో బ్రాండ్‌కే అవమానం… తమ సొంత అల్లుడే నమ్మలేదు అనే రాంగ్ మెసేజ్ వెళ్లింది జనంలోకి… ఇక అదే రాంచరణ్ క్లోజ్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వద్దాం… తనకు ఈమధ్యే ఏదో సినిమా షూటింగులో (డ్రాగన్?) గాయమైంది…

ఈ గాయం భుజానికి… తను గంగ హాస్పిటల్‌కు పరుగు తీయలేదు… జస్ట్, హైదరాబాద్‌లోనే కిమ్స్ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు… నిజానికి హైదరాబాద్ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేస్తూ మెడికల్ టూరిజం హబ్‌గా రూపుదిద్దుకున్నాయి… (అఫ్‌కోర్స్, పర్సులు, ఆస్తులు ఖాళీ అయ్యే ఛార్జీలు, దోపిడీ అనేది వేరే కథ)…

రాంచరణ్

మరి రాంచరణ్ అలా, జూనియర్ ఇలా… అదెలా అంటారా..? అదే ఈ కథనం… తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రఖ్యాత గంగా హాస్పిటల్ (Ganga Hospital)‌లో రాంచరణ్ సర్జరీ చేయించుకున్నారు… అక్కడి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ తో పాటు అమెరికా నుంచి వచ్చిన మయామి హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బాడియా ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు…

గంగా హాస్పిటల్ భారతదేశంలోనే హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ (Hand & Micro Surgery), కాంప్లెక్స్ ఆర్థోపెడిక్ ట్రోమాకు గ్లోబల్ హబ్‌గా పేరుగాంచింది. మణికట్టు, చేతి వేళ్లకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన నరాలు, ఎముకల సర్జరీలలో ఈ ఆసుపత్రిలోని వైద్యులు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు… ఎన్టీయార్ గాయం కేవలం భుజానికే కాబట్టి, ఇక్కడే కిమ్స్‌లో చేరాడు, సర్జరీ జరిగింది… కథ సుఖాంతం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!
  • ఢాకాలో ఏదో జరుగుతోంది – మళ్లీ రాజకీయ పరిణామాలు ?!
  • సన్నాసి ? సన్యాసి ? నదిలో వదిలేసిన శవం బతికి తిరిగొచ్చిందా !?
  • Credit Theft Politics … హరీశ్ రావు నీటి రూటే సపరేటు…
  • నాగదుర్గ – అఖిల్ రాజ్ ! రీల్ జంట కమ్ రియల్ జంట !!
  • Great Escape ! వ్యవస్థలన్నీ విఫలమైనవేళ – ఓ అరుదైన ఎయిర్ ఫీట్ !!
  • పోచారం గాచారమా..? పశ్చాత్తాపమా..? ఏమైంది వీళ్లందరికీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions