Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!

August 13, 2026 by M S R

.

Just Asking అంటూ రకరకాల ట్వీట్లతో రోజూ వార్తల్లో ఉండే ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మాత కూడా… అప్పట్లో, అంటే 2006లోనే ఓ నాసిరకం మూవీ నిర్మించాడు… చేతులు మూతులు కాలిపోయి, ఇక మానేశాడు… పాపం, అంతటి బాలచందర్ కూడా ఈ సినిమాతో పరువు కోల్పోయాడు…

ఇప్పుడు ఇదెందుకు చెప్పుకోవడం అంటే..? సినిమా పేరు పొయి, తెలుగులో అబద్దం అని డబ్ చేశారు… ఇందులో మన ఉదయ కిరణ్ నటించగా… ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓ ‘టాక్సిక్’ రోత సినిమాను డైరెక్ట్ చేసిన గీతూ మోహన్‌దాస్ ఓ చిన్న పాత్రలో నటించింది…

Ads

యష్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ టాక్సిక్ సినిమా ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతోంది. టీజర్‌, ట్రైలర్‌తోనే ఇది సాధారణ కమర్షియల్‌ సినిమా కాదనే సంకేతాలు ఇచ్చేసింది. బోల్డ్‌నెస్‌, యాక్షన్‌, డార్క్‌ టోన్‌… అన్నీ కలిపి గీతూ మోహన్‌దాస్‌ తనదైన ప్రపంచాన్ని సృష్టించినట్టు కనిపిస్తోంది. తాజాగా వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో విమర్శలూ పెరిగాయి.

టాక్సిక్

కానీ ఇప్పుడు గీతూ మోహన్‌దాస్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు తీస్తే… ఆమె ఒకప్పుడు హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు… ఉదయ్ కిరణ్‌తో కలిసి ఓ చిన్న పాత్రలో కూడా నటించింది! అదీ మామూలు సినిమాలో కాదు. లెజెండరీ డైరెక్టర్‌ కె. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ‘పోయి’ సినిమాలో! అదే తెలుగులో అబద్ధం పేరుతో డబ్ చేయబడింది…

‘టాక్సిక్’ డైరెక్టర్‌… ఒకప్పుడు నటిగా! … దర్శకురాలిగా గీతూ మోహన్‌దాస్‌ పేరు ఇప్పుడు ఇండియన్‌ సినిమా పరిధిని దాటి వినిపిస్తోంది. కానీ ఆమె కెరీర్‌ మొదలైంది దర్శకురాలిగా కాదు… నటిగా. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మలయాళ, తమిళ సినిమాల్లో కనిపించిన గీతూ… ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. మోహన్‌లాల్‌ నటించిన Life Is Beautifulతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళ సినిమాల్లోనూ నటించింది.

అబద్ధం

ఆ ప్రయాణంలోనే ఆర్. మాధవన్‌తో కలిసి Nala Damayanthiలో నటించింది. ఈరోజు ‘టాక్సిక్’కు దర్శకురాలిగా ఏకంగా యష్‌ను డైరెక్ట్ చేస్తున్న గీతూ… దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉదయ్ కిరణ్‌ సినిమాలో ఓ చిన్న పాత్రధారిణి…

ఇదే విషయాన్ని ఇటీవల నయనతార కూడా గుర్తు చేసుకుంది… గీతూతో తాను దాదాపు 20 ఏళ్ల క్రితం కలిసి నటించానని, ఇప్పుడు ఆమెను దర్శకురాలిగా చూడటం ప్రత్యేకంగా ఉందని చెప్పింది… (20 ఏళ్ల క్రితం ‘Rappakal’ (రాప్పకల్) అనే మలయాళ సినిమాలో కలిసి నటించారు ఈ ఇద్దరూ…)

మరి ‘పోయి’ సినిమా ఏం చేసింది? … బాలచందర్‌ పేరు… ప్రకాశ్ రాజ్‌ నిర్మాత… ఉదయ్ కిరణ్‌ హీరో… అయినా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అప్పటికే బాలచందర్‌ పేరు అంటే తమిళ సినిమాలో ఒక బ్రాండ్‌. కమల్ హాసన్‌, రజనీకాంత్‌ లాంటి దిగ్గజాలను తీర్చిదిద్దిన దర్శకుడు. అలాంటి దర్శకుడి 101వ సినిమా కావడంతో ‘పోయి’పై అంచనాలు భారీగా ఉండేవి. (బాలచందర్ చివరి సినిమా)…

ఉదయ్ కిరణ్‌కు కూడా ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే అప్పటికి తెలుగులో అతని కెరీర్‌ క్రమంగా దిగజారుతున్న దశ. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి వరుస విజయాలతో “హ్యాట్రిక్‌ హీరో”గా పేరు తెచ్చుకున్న ఉదయ్‌ కిరణ్‌… తిరిగి నిలబడేందుకు తమిళ సినిమాను కూడా ఒక అవకాశంగా చూశాడు.

అందుకే పోయిపై అతనికీ చాలా ఆశలు ఉన్నాయి. కానీ… ఆ సినిమా ఆ ఆశలను నిలబెట్టుకోలేదు. ట్రేడ్‌ రిపోర్ట్స్‌ ప్రకారం సినిమాకు స్పందన బలహీనంగా ఉండటంతో దానికి ఫ్లాప్‌ verdict వచ్చింది. రివ్యూలు కూడా పెద్దగా మెప్పించలేదు. ‘బాలచందర్‌ సినిమా’ అనే పేరు కూడా కాపాడలేకపోయింది!

మరి గీతూ మోహన్‌దాస్‌? … ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. పోయి తర్వాత గీతూ నటిగా కొంతకాలం కొనసాగింది. కానీ చివరికి కెమెరా ముందు కంటే కెమెరా వెనుకే తన భవిష్యత్తు ఉందని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె దర్శకురాలిగా మారింది.

Liar’s Diceతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత నివిన్‌ పౌలీతో Moothon చేసింది. ఆ సినిమా కూడా గీతూ మోహన్‌దాస్‌ ఒక ప్రత్యేకమైన, డార్క్‌, రా కథన ప్రపంచాన్ని సృష్టించగల దర్శకురాలని నిరూపించింది.

geetu

ఇప్పుడు అదే గీతూ… యష్‌ లాంటి పాన్‌ ఇండియా స్టార్‌ను పెట్టుకుని ‘టాక్సిక్’ తీసింది. యష్‌ కూడా ఈ సినిమా కోసం సుమారు 200 రోజుల షూటింగ్‌, నాలుగున్నరేళ్ల ప్రయాణం జరిగిందని చెబుతూ, గీతూ విజన్‌పై నమ్మకంతోనే ఈ సినిమా చేశామని చెప్పాడు.

అంటే ఒకప్పుడు… బాలచందర్‌ సినిమాలో ఉదయ్ కిరణ్‌తో కలిసి చిన్న పాత్రలో కనిపించిన గీతూ మోహన్‌దాస్‌… ఇప్పుడు… ‘కేజీఎఫ్‌’ తర్వాత యష్‌ లాంటి స్టార్‌ను డైరెక్ట్‌ చేసే స్థాయికి వచ్చింది! ఇదే సినిమా ప్రపంచం. ‘పోయి’ నుంచి ‘టాక్సిక్’ వరకు… ఒకే వ్యక్తి కెరీర్‌లో రెండు దశాబ్దాల గ్యాప్‌. కాలం ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పడానికి గీతూ మోహన్‌దాస్‌ కథ కూడా ఒక మంచి ఉదాహరణే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టాటా చైర్మన్ చంద్రశేఖరన్ నిష్క్రమణ వెనుక ఏం జరిగింది ?!
  • ఆ దరిద్రుడు, నరకం చూపించాడు ! అనుపమ వేదనాగీతం !!
  • ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!
  • అడాప్టివ్ టెస్టింగ్ ! నీట్- పోటీ పరీక్షల అక్రమాలకు రియల్ చెక్ !!
  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions