.
అనుపమ పరమేశ్వరన్ సంచలన కామెంట్స్: ఆ రెండేళ్లు నరకం.. కెరీర్ ముంచేసే ప్రయత్నం!
టాలీవుడ్ నుంచి కోలీవుడ్- బాలీవుడ్, ఏ వుడ్ వరకైనా ఆడది అంటేనే దోపిడీకి సరుకు… ఆర్థికంగా, మానసికంగా, లైంగికంగా…! తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
Ads
తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా తాను ఓ విషపూరితమైన బంధంలో నలిగిపోయానని, మానసికంగా తీవ్ర క్షోభను అనుభవించానని ఆమె కన్నీటి పర్యంతమైంది…

ఆ పోస్ట్ వెనుక అసలు కథ ఇదే!
ఇన్‌స్టాగ్రామ్‌లో అనుపమ రీసెంట్‌గా పెట్టిన బ్రేకప్, మానసిక ప్రశాంతత గురించిన పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్ చేయడానికి అసలు కారణం తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
వణకిపోయిన క్షణాలు: ఇన్‌స్టాగ్రామ్‌లో నటి మడోనా సెబాస్టియన్ నార్సిసిస్టిక్ అబ్యూజ్ (మానసిక వేధింపుల) గురించి మాట్లాడుతున్న రీల్ చూసినప్పుడు తాను ఒక్కసారిగా వణికిపోయానని అనుపమ గుర్తుచేసుకుంది. అప్పుడే తాను ఏ కేటగిరీకి చెందిన నరకాన్ని అనుభవించిందో స్పష్టత వచ్చిందని చెప్పుకొచ్చింది.
మూడు రకాల మనుషులు: ఈ రకమైన విషపూరిత బంధాల్లో చిక్కుకున్నవారిని మూడు రకాలుగా విభజించవచ్చని, అందులో తాము పడుతున్న వేదన ఇతరులకు అర్థం కాక, బయటపడలేక సతమతమయ్యే వర్గమే అత్యంత ప్రమాదకరమని ఆమె చెబుతోంది.
“పెళ్లి చేసుకుంటే కచ్చితంగా డివర్స్ తీసుకునేదాన్ని” ఆ వ్యక్తి పెట్టిన మానసిక, శారీరక ఒత్తిడి తట్టుకోలేక మెడిసిన్స్ వాడాల్సి వచ్చిందని అనుపమ బాంబ్ పేల్చింది. ఆ బంధం గురించి ఆమె చెబుతూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది…

పరిచయమైన కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఎంగేజ్మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారట. అయితే ఇదంతా తన కెరీర్‌ను నాశనం చేసి, పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి వేసిన ప్లాన్ అని ఆలస్యంగా గ్రహించానని, అందుకే పెళ్లిని పదే పదే వాయిదా వేస్తూ వచ్చిందట.
ఒక రోజు దేవుడిలా చూస్తూ విపరీతమైన ప్రేమ కురిపించడం.. మరుసటి రోజు కనీసం ముఖం కూడా చూడకుండా దారుణంగా నిర్లక్ష్యం చేయడం.. ఆ తర్వాత చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కాళ్లమీద పడటం.. ఇదంతా సైకలాజికల్ టార్చర్‌లా ఉండేదట.
ఈ మానసిక కుంగుబాటు కారణంగా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘డ్రాగన్’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా సరిగ్గా పాల్గొనలేకపోయానని చెప్పింది. ఒకవేళ పొరపాటున ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటే, కచ్చితంగా విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేదట.

ఆ చీకటి రోజులనుంచి బయటకొచ్చా!
ప్రస్తుతం ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్ నుంచి పూర్తిగా బయటపడ్డానని, మళ్లీ తన ప్రశాంతతను, ఆనందాన్ని తిరిగి సొంతం చేసుకున్నానని అనుపమ తెలిపింది. ఆ వ్యక్తి పేరు చెప్పడానికి ఇష్టపడనని, కానీ తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే వెంటనే అలాంటి బంధాలకు దూరంగా ఉండాలని ఆమె ఈ సందర్భంగా పరోక్షంగా హెచ్చరించింది…
Share this Article