.
నెటిజనం నానా తిట్లూ తిట్టేసరికి… గతితప్పిన బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్… లెంపలేసుకుని దిద్దుబాటుకు పూనుకుంది… ఇద్దరిని బయటికి పంపించి, వైల్డ్ ఫైర్ అంటూ ఐదుగురిని ప్రవేశపెట్టిన ఎపిసోడ్ చూస్తే అర్థమైంది అదే…
ఏదో చేయబోతే ఇంకేదో అయింది అన్నట్టు… హౌజులోకి ఓ సవాల్ విసిరి, 15 లక్షలు పంపించి, ఎవరైనా వెళ్లిపోతారా అన్నాడు బిగ్‌బాస్… తొక్కలో ప్రైజ్ మనీ, తొక్కలో గేమ్, తీసుకుని పోతే పోలా అనుకుని మిథిలేష్ అనే స్పిరిిట్ లేని కేరక్టర్ ఆ సూట్‌కేసు తీసుకుని చక్కా పోయాడు…
Ads
ఆ దెబ్బకు బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్ దిమ్మతిరిగిపోయింది… హౌజులో ఉన్నోళ్ల మొహాలు మాడిపోయాయి… 50 లక్షల ప్రైజ్ మనీలో 15 లక్షలు పోతే, అది చిన్న అమౌంట్ కాదు కదా… షో చూసే నెటిజనం కూడా కామెంట్లలో క్రియేటివ్ టీమ్‌పై బూతులంకించుకున్నారు… నీ బొంద ఆట, నీ బొంద స్క్రిప్టు, ఇక ఆటలో మజా ఏముంది అంటూ…
ఆ దిద్దుబాటులో భాగంగా… వైల్డ్ ఫైర్ ఎంట్రీలుగా వచ్చిన ఐదుగురితో రెండేసి లక్షలు పంపించాడు… కాకపోతే టాస్కులు పెట్టాడు… నలుగురు హౌజ్ మేట్స్ కొత్త ఎంట్రీలతో ఆయా టాస్కుల్లో గెలవడంతో 35 లక్షలకు మరో 8 లక్షలు జమయ్యాయి… వెరసి 43 లక్షలు… చూస్తూ ఉండండి… మిగతా 7 లక్షలు కూడా రాను రాను కవర్ చేస్తారు…
పిచ్చి ప్రయోగం చేయడం దేనికి..? ఈ దిద్దుబాటు ప్రయాస దేనికి..? సరే, అరుపూర్వ అలియాస్ అపూర్వ ఔట్… ఊహించిందే… ఆమె తీరు పెద్దగా ఎవరికీ నచ్చలేదు కూడా… తరువాత చరణ్ కూడా ఔట్… అదీ బిగ్‌బాస్ స్క్రిప్టు ప్రకారమే శాలినిని కాపాడి, చరణ్‌ను పంపించేశారు… ఫస్ట్ వీక్ వెళ్లిపోయి, రీఎంట్రీ ఇచ్చినా కాపాడుకోలేకపోయాడు… వెరసి ఇద్దరూ ఔట్‌కు అర్హులే…

వైల్డ్ ఫైర్ పేరిట వచ్చిన వాళ్లలో శివకుమార్… పాత బిగ్‌బాస్ సీజన్లో చాన్నాళ్లు ఉన్న ప్రియాంక జైన్ సహచరుడు… (లివ్ ఇన్)… అందరినీ మేడమ్, సార్, గారు అంటూ మొదట్లోనే చిరాకు పుట్టించాడు… పెళ్లాన్ని కూడా ప్రియాంక గారు అనీ ప్రస్తావించాడు… తెలుగు ఉచ్చరణ సరిగ్గా లేదు… (ప్రియాంక తెలుగు బాగుంటుంది)…
తరువాత దక్షి… పర్లేదు, కానీ తెలుగు సరిగ్గా లేదు… నటరాజ్ మాస్టర్ గతంలో ఓ సీజన్లో కంటెస్టెంట్, ఆయన భార్య నీతూ వచ్చింది… కత్తిసాము చేసింది, డాన్స్ చేసింది… పర్లేదు… కానీ శ్వేతానాయుడు అదరగొట్టింది… ఆమె ఆట బాగుంది, పాట బాగుంది, చివరకు దేబ్జానీని భలే ఇమిటేట్ చేసింది… గుడ్…
ఇక రామకృష్ణ… హౌజులోకి ఎంట్రీ దగ్గర నిరాశ… తరువాత మరోసారి నిరాశ… ఇప్పుడిక ఎంట్రీ దొరికింది… చరణ్ ఎలిమినేషన్ టైములో హౌజ్ మేట్స్ 11 మంది 10 మంది శాలినికి వోటేశారు… అఫ్కోర్స్, అదీ స్క్రిప్టు ప్రకారమే అనిపించింది… ఎందుకంటే… ఆమె వెళ్లిపోతే శాలిని, రోహిత్ జంట పులిహోర వినోదం, అంటే లవ్వు ట్రాక్ పోతుంది కదా… అందుకని..!!
Share this Article