.
నిజమే… పిల్లి కళ్లుంటే చాలు, కుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసాలతో పోల్చేయాలా..? అసలు ఆమె ఒరిజినల్ పేరు కాదు, జస్ట్, పూసలమ్ముకునే ఓ యువతి… ఎవరో ఓ సోషల్ మీడియా పోస్టు పెట్టేసరికి రాత్రికిరాత్రి ఫేమస్ అయిపోయింది…
ఏదైనా కొత్త సంగతి దొరికితే చాలు, పడిపోతుంది కదా నెటిజనం… అలా పాపులరైంది… సినిమా చాన్సులు, డబ్బు, ఒక్కసారిగా ఆమె జీవితం ఎక్కడికో వెళ్లిపోబోయింది… కానీ తన మూర్ఖత్వం తనను వెనక్కి లాగింది… కేసుల పాలైంది, ఎవరో కేరళ యువకుడిని ప్రేమపెళ్లి చేసుకుంది… లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా…
Ads
ఊరి వాళ్లు ఛీకొట్టారు, తల్లిదండ్రులు అతనిపై కేసులు పెట్టారు, లవ్ జీహాద్ అనే విమర్శలు… ఇప్పుడు భయంతో బయటికే రాలేని దురవస్థ… మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే…
ఓ వీడియో రీసెంటుగా బాగా వైరల్… యూపీకి చెందిన మాన్సి ఠాకూర్ @ మాన్సి రాజ్‌పుత్ ఆమె పేరు… ఉత్తర భారతంలో కన్వర్ యాత్ర చాలా ఫేమస్… అందులో ఈమె 61 లీటర్ల కన్వర్ మోసుకుంటూ 180 కిలోమీటర్లు నడిచింది… పెద్ద ఫీట్… ఐతే ఆమె అందంగా ఉండటం, ఆమె బలం, సంకల్పం, ఆధ్యాత్మికత, పట్టుదల చూసిన కొందరు ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు…
ఆ వీడియోలు కాస్తా వైరలయ్యాయి… కాకపోతే కొందరు ఆమెను అవే కళ్లు, అదే అందం అంటూ కుంభమేళా మోనాలిసాతో పోల్చేసరికి ఈమెకు చిర్రెత్తింది… ఎహె, ఆమెతో నాకు పోలిక ఏమిటి..? నేను సనాతని, మహాదేవుడి భక్తురాలిని… నా ఉనికి, నా రూపం, నా మార్గం నాకే ప్రత్యేకం, ఒకరితో పోల్చడం ఏమిటి..? మాన్సీ రాజ్‌పుత్ అనండి, కన్వర్ షేర్నీ అనండి… అని చెప్పుకొచ్చింది ఏదో వీడియోలో…
ఒకటి మాత్రం నిజం, ఆ మోనాలిసాతో ఈమెను పోల్చడం ఏ కోణం నుంచి చూసినా అసమంజసమే…
‘‘అమ్మాయిలు ఏమీ చేయలేరని చెప్పే అబ్బాయిలూ, ఇప్పుడు నన్ను చూడండి… నేను యూపీ పోలీస్ లాంటి ఎన్నో పరీక్షలు రాశాను కానీ రిజర్వేషన్ల వల్ల పాస్ కాలేకపోయాను… నేను కుంగిపోయాను, ఇప్పుడు నా కెరీర్ కోసం శివుడికి అంకితమయ్యాను…
భోలే బాబా నా కోరికను తప్పక తీరుస్తాడు… జేవార్‌లోని నా స్థానిక సమాజం నన్ను పట్టించుకోవడం లేదనే నేను భావిస్తున్నాను, కానీ బయటి మద్దతుదారులు, నా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో సాంత్వన, బలాన్ని పొందుతూ, శివునిపై నాకున్న భక్తిని ప్రదర్శించడానికే ఇలా 61 లీటర్ల కఠినమైన కన్వర్ యాత్రను చేపట్టాను’’ అని చెప్పుకొచ్చింది ఆమె…
హెలో… మోనాలిసాకు సినిమా చాన్సులిచ్చి, అర్థంతరంగా భంగపడిన మహానుభావులూ… ఇటు ఓ లుక్కేయండి…, అందంలో, సాహసంలో మోనాలిసా ఈమె ముందు ఎందుకూ పనికిరాదు..! ఆ కళ్లు సరేసరి !!

Share this Article