Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!

August 16, 2026 by M S R

.

మోదీ నోటి వెంట ఓ మాట వచ్చిందంటే దానికి ప్రాముఖ్యత ఉంటుంది… తను ప్రధాని… తన మాటకు ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది… తన మాటలే తన సంకేతాలు… పంద్రాగస్టు వేడుకల సందర్భంగా తను ఓ మాటన్నాడు… దిమాగీ నక్సల్…

ఎస్, ఆ పదం కాయిన్ చేయడం వెనుక ఏదో యాక్షన్ ప్లాన్ ఉందని అర్థం చేసుకోవాలి… అయిపోయింది, పలు రాష్ట్రాల్లో విప్లవ మంటలు రేపిన మావోయిజం, నక్సలిజం కొడిగట్టింది… దాదాపు అంతరించినట్టే ఆ సాయుధ పోరాటం… ఈ స్థితిలో రాజ్యం దాన్ని తుడిచిపెడుతుందని రెండుమూడేళ్ల క్రితం వరకు కూడా ఎవరూ నమ్మలేదు… కానీ జరిగిపోయింది..,

Ads

  • జెన్‌జీ కానీ, ఇతర యువత గానీ… వీథుల్లోకొచ్చి ఆందోళనలు చేస్తారు తప్ప తుపాకులు పట్టుకుని, అడవుల్లోకి వెళ్లే బాపతు కాదు… సో, నో రిక్రూట్‌మెంట్స్… జనం కూడా ఆదరించడం మానేశారు, సరే, అరయగ కర్ణుడీల్గె అనేకుల చేతన్ అనుకుందాం… మరి మోదీ వెంట ఈ మాట ఎందుకొచ్చింది..?

దిమాగీ నక్సల్… అంటే మేధో నక్సల్, ఇంటలెక్చువల్ నక్సల్… జాగ్రత్తగా గమనించండి… పంజాబ్, హర్యానా రైతుల పేర్లతో ఆందోళనకారులు, ప్రత్యేకించి ఖలిస్థానీ, ఆప్ మద్దతుదారులు ఢిల్లీని ముట్టడించి, రోజుల తరబడీ స్తంభన నెలకొన్నప్పుడు ‘ఆందోళన జీవి’ అనే పదం కాయిన్ చేశాడు… తరువాత అర్బన్ నక్సల్ అనే పదాన్ని పాపులర్ చేశాడు… (నిజానికి ఈ పదం కాయిన్ చేసింది కాషాయ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి)…

  • తరువాత తెలుసు కదా… ఎల్గార్ పరిషద్, బీమా కోరేగావ్ కేసుల్లో అనేక మంది విప్లవ సానుభూతిపరుల్ని ఉపా కింద అరెస్టు చేశారు… బెయిళ్లు లేక ఏళ్ల తరబడీ మగ్గారు… చివరకు స్టాన్ స్వామికి తిండి తినలేకపోతున్నాను, ఓ కప్పు, ఓ స్ట్రా ఇవ్వండి అని మొత్తుకున్నా వినలేదు… క్రూరత్వాన్ని చూపారు… వరవరరావు కూడా చాన్నాళ్లు జైలులోనే ఉన్న సంగతి తెలుసు కదా…

సుధా భరధ్వాజ్, గౌతమ్ నవ్లాఖా, ఆనంద్ తెల్తుంబే, అరుణ్ ఫెరీరా వంటి 16 మందిని బుక్ చేశారు, మరో కేసులో సాయిబాబాను జైలులో వేసి, అంత అవస్థ పెట్టారో కూడా తెలుసు కదా… సాయుధ నక్సల్స్ ఖతం, ఇక దిమాగీ నక్సల్స్ పనిపట్టే ఆలోచన… ఉపా ఉందిగా… ఇక కాన్సంట్రేషన్ మేధో నక్సల్స్ పై ఉండబోతోంది… మోదీ ఇస్తున్న సంకేతాలివే…

  • ‘‘ఆయుధాలతో తిరిగిన నక్సల్స్ ను అంతమొందించాం. కానీ ఈ దిమాగీ నక్సల్స్ సమాజంలో హింసను, అశాంతిని ప్రేరేపించేందుకు ఎప్పుడు అవకాశమొస్తుందాని ఎదురుచూస్తున్నారు. వీళ్లే పవర్ కారిడార్స్ లో తిష్ట వేసుకొని కూర్చొనేవారు. సర్కారు కమిటీల్లో ఉండేవారు. సలహాదారులుగా కూడా పనిచేశారు. వీళ్ల మైండ్ సెట్ అంతా మావోయిజంతో నిండి ఉంటుంది. వీళ్లే పాలసీలను ప్రభావితం చేసేవారు. ఇటువంటి దిమాగీ నక్సల్ ను మనం ఓ కంట కనిపెట్టాలి. వాళ్లను ఐసొలేట్ (ఒంటరి) చేయాలి”… అని స్పష్టంగానే చెప్పాడు ఎర్రకోట వేదికగా…

జెన్‌జీ, కాక్రోచ్ పెట్టిన మంటతో తీవ్ర నిస్పృహలో పడిన ప్రధాని… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారినే దిమాగీ నక్సల్ అంటున్నాడని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ అంటున్నాడు… ఎవరు ఎలా అర్థం చేసుకున్నా సరే, ఉపా చట్టం భీకరంగానే విరుచుకుపడబోతుందేమో..!! ప్రస్తుతం కాండం, కొమ్మలు నరికారు, లోతుగా దిగిన వేళ్ల నుంచీ మావోయిజాన్ని నిర్మూలించే పనేమో..!! ఐతే యాక్షన్ ఎలాంటివారిపై, ఎలా గుర్తిస్తారు అనేది వేచి చూడాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!
  • ANR – VaniSri – తెలుగు వెండి తెరపై ఓ సూపర్ హిట్ పెయిర్ !
  • ‘గూగుల్ మ్యాప్స్‌’కు చిక్కిన సూపర్‌స్టార్‌… సరైన దారి తెలియక తిప్పలు …
  • పాంచాలి పంచభర్తృక – చీప్ పబ్లిసిటీ టాక్టిక్ – ద్రౌపది పేరూ వదల్లేదు !!
  • 60 వేల కోట్ల విడాకుల కేసు ! ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది !!
  • ‘‘మీ రాజకీయ కక్షలకు కోర్టు వేదిక కాదు’’ – హరీశ్ రావుకు చుక్కెదురు !!
  • కపిల్ సాహూ ! టీవీకే విజయ్ గెలుపు వ్యూహకర్త ఇప్పుడిక జగన్ వెనుక !!
  • రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions