Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!

August 17, 2026 by M S R

.

కేంద్రంలో అధికారం చలాయిస్తున్న ఓ జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడికి ఎంత పరిణతి, ఎంత సంస్కారం, ఎంత హుందాతనం ఉండాలి..? అబ్బే, తమిళనాడు అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై గానీ, తరువాత అధ్యక్షుడిగా ఉండి, హైకమాండ్ తీరుతో విరక్తితో బయటికి వచ్చేసిన అన్నామలై గానీ ఎప్పుడూ మాట తూలలేదు… బీజేపీ ఇజ్జత్ తీయలేదు…

కానీ ప్రజెంట్ అధ్యక్షుడు ఉన్నాడు, పేరు నైనార్ నాగేంద్రన్… బీజేపీ ఏరికోరి తెచ్చి నెత్తిన పెట్టుకుని పగ్గాలు అప్పగించింది… ఆమధ్య ఏమన్నాడో గుర్తుంది కదా… 2026 ఫిబ్రవరిలో… విజయ్‌ను ఉద్దేశించి… విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో… ‘‘విజయ్‌కు రాజకీయ అనుభవం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ముందు “హీరోయిన్ త్రిషను వదిలేసి రావాలి” అంటూ పిచ్చి కూతలకు దిగాడు…

Ads

దానిపై తమిళనాడు మేథోసమాజం ప్లస్ త్రిష కూడా ఘాటుగా రియాక్టయ్యారు… చివరకు ఢిల్లీ అక్షింతలు వేసినట్టుంది, ఏదో వివరణ ఇస్తూ లెంపలేసుకున్నాడు… కానీ మనిషి మారడు కదా… మళ్లీ ఈసారి ఇంకేదో క్షుద్ర వ్యాఖ్య… నిజానికి తను రియాక్ట్ కావల్సిన మాటలే కావు, కానీ గోకుడు అలవాటైన ప్రాణం కదా…

ఇటీవల తమిళనాడు అసెంబ్లీ (శాసనసభ) సమావేశాల్లో ముఖ్యమంత్రి విజయ్ ఒక ‘కుట్టి కథ’ (చిన్న కథ) చెప్పాడు… 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK) కూటమి ఓటమిని ఉద్దేశించి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను వ్యంగ్యంగా “మీ నాన్న ఎక్కడ?” (ఎంకే స్టాలిన్ ఎక్కడ?) అని ప్రశ్నించాడు…

అది పక్కా పొలిటికల్, నన్ను బాగా వెక్కిరించాడు కదా, మీ నాన్న ఇప్పుడు ఎక్కడ..? అని వ్యంగ్యం… విజయ్ వ్యాఖ్యల్లో తప్పులేదు… సరే, అది పక్కాగా డీఎంకేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య… ప్రజెంట్ డీఎంకేకు, టీవీకేకు నడుమ భగ్గుమంటోంది, ఇవన్నీ సహజం… నడుమ ఈ బీజేపీ అధ్యక్షుడికి ఏం నొప్పి..? మధ్యలో దూరాడు…

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ… ‘‘శాసనసభలో కొందరు తండ్రి కోసం వెతుకుతున్నారు… అడుగుతున్నారు… కానీ ఇంట్లో ఉన్న తల్లిని అడిగితేనే తండ్రి ఎవరో తెలుస్తుంది… అసెంబ్లీలో వెతికితే ఎవరు చెబుతారు..? ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి ఇలాగే ఉంది…” అని క్షుద్ర వ్యాఖ్యలు చేశాడు…

ఇంకేం..? ఈ వ్యాఖ్యలు నేరుగా విజయ్ తల్లిని వ్యక్తిగతంగా అవమానించేలా ఉన్నాయంటూ పెద్ద దుమారం రేగింది….

విజయ్ పార్టీ (తమిళగ వెట్రి కళగం) ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది… బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా వీధి రౌడీలా, అనాగరికంగా మాట్లాడటం సరికాదని మండిపడింది… సరైన స్పందన ఇది.., కాస్త మర్యాదపూర్వకంగానే కౌంటర్ ఇచ్చారు…

నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను స్వయంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా తప్పుబట్టాడు… రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలి కానీ, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లులను లాగడం “థర్డ్- రేట్” (దిగజారుడు) రాజకీయం అని అన్నామలై తీవ్రంగా ఖండించాడు… నటి, బీజేపీ నేత ఖుష్బూ కూడా ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైనవిగా పేర్కొంది….

నైనార్ నాగేంద్రన్‌పై చెన్నై డీజీపీ కార్యాలయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక ఫిర్యాదు కూడా నమోదైంది… క్షుద్ర వ్యాఖ్యలు, తరువాత లెంపలేసుకోవడం అలవాటే కదా… అబ్బే, కొందరు నా వ్యాఖ్యల్ని రాజకీయ లబ్ధి కోసం తప్పుగా చిత్రీకరిస్తున్నారని, తనకు మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషపై ఎంతో గౌరవం ఉందని నాగేంద్రన్ ఏదో కవరింగ్‌కు ప్రయత్నించాడు… ఇదీ అసలు సిసలు క్షుద్ర సమర్థన… ఫాఫం, తమిళ బీజేపీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!
  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !
  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!
  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!
  • దిమాగీ నక్సల్ ! మోదీ నోటి వెంట ఓ కొత్త మాట ! దేనికి ఈ సంకేతం !!
  • బిగ్‌బాస్ – ఇలాంటోళ్లను తీసుకొండి – పాజిటివ్ వైబ్స్ పక్కా…
  • ఇండియాకు వ్యతిరేకంగా చైనా- అమెరికా ఉమ్మడి లోతు కుట్రలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions