Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…

August 17, 2026 by M S R

.

కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం పెద్ద విషయం కాదు.
కానీ కొన్ని ప్రశ్నలకు ఎలా సమాధానం చెబుతారు అన్నదే మనిషి స్థాయిని చెబుతుంది.

ఇప్పుడు యశ్ విషయంలో అదే జరిగింది…. ఎప్పుడో 2017లో జరిగిన ఒక చిన్న వ్యవహారం. రష్మిక మందన్న అప్పటికి కొత్త హీరోయిన్. ఒక ర్యాపిడ్‌ ఫైర్‌లో ‘‘కన్నడ ఇండస్ట్రీలో Mr Showoff ఎవరు?’’ అని అడిగితే, మొదట సమాధానం చెప్పడానికి నిరాకరించి, చివరకు సరదాగా యశ్ పేరు చెప్పింది. ఆ రెండు మాటలు బయటకు వచ్చాయి. యశ్ అభిమానులు రష్మికపై విరుచుకుపడ్డారు.

Ads

అది అక్కడితో ఆగలేదు. రష్మిక వివరణ ఇచ్చింది. తాను యశ్‌ను అవమానించే ఉద్దేశంతో చెప్పలేదని, తాను ఆయన ప్రతిభను అభిమానిస్తానని చెప్పింది. చివరకు క్షమాపణ కూడా చెప్పింది. తాను చెప్పిన మాటలను సందర్భం నుంచి విడదీసి పెద్ద వివాదంగా మార్చారని ఆమె అప్పుడే ఆవేదన వ్యక్తం చేసింది.

అంతకంటే ముఖ్యంగా యశ్ అప్పుడే ఆ వివాదాన్ని చాలా హుందాగా ముగించాడు. ‘‘ఆమెకు నాపై ఒక అభిప్రాయం ఉంది. దాన్ని గౌరవించండి. ఒకరి అభిప్రాయం మిమ్మల్ని నిర్వచించదు’’ అన్నాడు. అభిమానులను కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలని కోరాడు. ట్రూ సంస్కారి… (అప్పట్లో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తదితరులతో ఆమెకు పంచాయితీలు రగిలేవి, అది వేరే కథ, అప్పట్లో యశ్‌తోనూ ఆమెకు గొడవలేమీ లేవు కూడా…)

అంటే… ఆయనకు విషయం అర్థం కాలేదని కాదు. అర్థమైందే. కానీ దానిని తన ఈగో సమస్యగా మార్చుకోలేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అదే పాత విషయాన్ని Aap Ki Adalatలో రజత్ శర్మ మళ్లీ బయటకు తీశారు. ఇది కూడా ఒకరకంగా టీవీ షోల పాత ఫార్ములానే.

ఒకప్పుడు జరిగిన వివాదం.
దానికి అప్పుడే క్షమాపణ.
అందరూ మర్చిపోయిన వ్యవహారం.
కానీ సెలబ్రిటీ ఎదురుగా కూర్చుంటే…
‘‘అప్పట్లో ఆమె మీ గురించి అలా అనింది కదా?’’ అంటూ మళ్లీ గెలకడం.

ఎందుకంటే పాత గాయం ఉన్న చోట మళ్లీ వేలు పెట్టడం కంటే టీవీకి ఆసక్తికరమైన కంటెంట్ మరొకటి ఏముంటుంది? ఇక్కడ రష్మికను మళ్లీ తప్పుపట్టాల్సిన అవసరం అసలు లేదు. ఆమె అప్పుడే వివరణ ఇచ్చింది. అప్పుడే క్షమాపణ చెప్పింది. విషయం ముగిసిపోయింది. తొమ్మిదేళ్ల నాటి మాట ఇది…

కానీ యశ్ ఇప్పుడు ఇచ్చిన స్పందన మాత్రం గమనించాల్సినది. ఎందుకంటే ఈసారి ఆయనకు రెండు దారులున్నాయి.

ఒకటి —
‘‘అవును, ఆమె అప్పుడు అలా అంది. నన్ను అవమానించింది’’ అంటూ తన స్టార్‌డమ్‌కు తగ్గట్టు ఆ పాత విషయాన్ని మళ్లీ రగిలించడం.

మరొకటి —
‘‘అది అప్పటి విషయం. ఆమె అభిప్రాయం అది. నేను దాన్ని దాటి వచ్చాను’’ అని చెప్పడం. యశ్ రెండో దారినే ఎంచుకున్నాడు. అక్కడే ఆయన వ్యక్తిగా ఇంకో రెండు మెట్లు ఎక్కినట్టు అనిపించింది.

సినిమా స్టార్ కావడం ఒక విషయం.
వేల కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ కావడం మరో విషయం.
కానీ ఎదుటివారిని కిందకు లాగకుండా, తన స్థాయిని తానే నిలబెట్టుకోవడం ఇంకో విషయం.

యశ్ విషయంలో నాకు నచ్చింది ఇదే.

ఎవరైనా మన గురించి చెడ్డగా మాట్లాడితే వెంటనే సమాధానం ఇవ్వడం చాలా సులువు. అభిమానులను రంగంలోకి దించడం ఇంకా సులువు. ‘‘నేనెవరో తెలుసా?’’ అనే అహపు ధోరణి చూపించడం కూడా సెలబ్రిటీలకు పెద్ద కష్టం కాదు.

కానీ… ‘‘అది ఆమె అభిప్రాయం. దాంతో నేను మారను కదా’’ అని చెప్పగలగడం మాత్రం ఒక స్థాయి. అది అప్పుడూ యశ్‌లో కనిపించింది. ఇప్పుడూ కనిపించింది.

ఇక రష్మిక సంగతి. ఆమెను మళ్లీ ఈ వ్యవహారంలో నిందించడం అనవసరం. అప్పట్లో జరిగినది ఒక టీవీ గేమ్‌లో వచ్చిన మాట. అది వివాదమైంది. ఆమె వివరణ ఇచ్చింది. క్షమాపణ చెప్పింది. ఆ అధ్యాయం ముగిసింది.

కానీ మన టీవీ షోలకు అధ్యాయాలు ముగిసినా పర్లేదు…
TRP కోసం ఫుట్‌నోట్లు కూడా తవ్వి బయటకు తీసే అలవాటు ఉంది!

నిన్నటి గొడవను ఇవాళ్టి వినోదంగా మార్చడం వాళ్ల పని.

అయితే ఆ ప్రశ్నతో రజత్ శర్మ ఏం సాధించాడో తెలియదు కానీ… యశ్‌కు ఓరకంగా మేలు చేశాడు, తనలోని ఓ పాజిటివ్ యశ్‌ను చూపించుకోవడానికి తనకు ఓ చాన్స్ ఇచ్చినట్టయింది… నిజంగానే దీంతో యశ్ తన ఇమేజ్‌ను ఇంకాస్త పెంచుకున్నాడు.

ఎప్పుడో రష్మిక చెప్పిన ‘Showoff’ మాటను మళ్లీ గుర్తు చేస్తే… ఇప్పుడు యశ్ చూపించింది ‘Showoff’ కాదు. గ్రేస్.

‘‘అప్పట్లో రష్మిక ఇండస్ట్రీకి కొత్త… కొన్ని షోలలో యాంకర్లు రెండోమూడో ఆప్షన్లు ఇచ్చి ఇరికిస్తారు, ఏదో ఒకటి ఎంచుకొండి అనే దగ్గర ఆమె కన్‌ఫ్యూజ్ అయి ఉండవచ్చు, ఐనా ఎవరి అభిప్రాయమో ఎలాగో ఉంటే నేను మారను కదా, నా వ్యక్తిత్వం మారదు కదా… బట్, వన్ థింగ్, ఇతర నటులను గౌరవించలేని నా ఫ్యాన్‌ను నేను ఫ్యాన్‌గానే గుర్తించను…’’ అన్నాడు… సినిమా హీరోల్లో అరుదుగా కనిపించే మంచి పరిపక్వత ఇది..!!

స్టార్‌డమ్ అంటే కేవలం తెరపై పెద్దగా కనిపించడం కాదు.
కొన్ని సందర్భాల్లో ఎదుటివారిని చిన్నచేయడానికి వచ్చిన అవకాశాన్ని కూడా తిరస్కరించడం.

ఆ విషయంలో… రష్మికను ఇరికించాలనుకున్న పాత ప్రశ్నలో, యశ్ మాత్రం తన స్థాయిని మరో రెండు మెట్లు పెంచుకున్నాడు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చెప్పులు పోయాయ్ – కంగారెందుకు, చాట్‌జీపీటీ ఉందిగా, అడిగెయ్…
  • హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…
  • సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…
  • బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!
  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !
  • కృష్ణ, విజయనిర్మల … డెయిలీ పేపర్ల కార్గో ఫ్లయిట్‌లో చెన్నైకి !!
  • రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
  • Viral Mansi Sherni – ‘మోనాలిసాతో పోల్చితే మర్యాద దక్కదు సుమా’
  • తెలంగాణ కాన్వాస్ అంటే ఉరికేంత మైదానం ! చెడగొట్టకండి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions