.
రాజగోపాలరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, అనిరుధ్ రెడ్డి… ఏవేవో మాట్లాడేస్తున్నారు… సీఎం టార్గెట్… సురేఖతో దూరం అలాగే ఉంది, ఆమె ఏకంగా సీఎం టూర్‌కే అటెండ్ కాలేదు… రేవంత్ ఒక్క మాట కూడా ఎక్కడా, ఏమీ మాట్లాడటం లేదు… ఎందుకీ మౌనం అని ప్రశ్నించాడు ఓ మిత్రుడు..?
తను ఔట్ స్పోకెన్ కదా, ఖుల్లంఖుల్లా మాట్లాడేస్తాడు కదా, మరి ఏమిటి ఈ బలహీనత, తను బలహీనపడినట్టు కేడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్లవా అనేది తన సందేహం… కాదు, మౌనం బలహీనత కాదు, మౌనం ఓ స్ట్రాటజీ..! నిశ్శబ్దానికీ లెక్కలుంటాయి… సైలెన్స్ అంటే ఆమోదం చెప్పడం కాదు, తలవంచడం కూడా కాదు…
Ads
పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రతినిధులు, నాయకులు కూడా పార్టీకి నష్టదాయకంగా మాట్లాడుతుంటే, వ్యవహరిస్తుంటే… పార్టీ ప్రధానంగా టాకిల్ చేయాలి, చేయలేం అనుకుంటే యాక్షన్ తీసుకోవాలి… సీఎం వ్యక్తిగతంగా సైలెన్స్ మెయింటెయిన్ చేయడమే ఉత్తమం, తను చేస్తున్నదీ అదే…
అసలు రాజగోపాలరెడ్డికి హైకమాండ్‌లో ఎవరి మద్దతు లభిస్తుందో, దీన్ని ఆయన ఎక్కడిదాకా తీసుకుపోతాడో కూడా చూడాల్సి ఉంది… తను పార్టీలో అంతర్గతంగా ఎవరెవర్ని ఆర్గనైజ్ చేస్తున్నాడో కూడా తెలియాలి… ఒక్కొక్కరూ ఎక్స్పోజ్ అయ్యేదాకా చూడాల్సిందే… సురేఖ వేరు, ఆమెకు ఎవరితోనూ పడదు, సీతక్కతో, పొంగులేటితో, చివరకు సీఎంతో కూడా… మంత్రివర్గ విస్తరణ జరిగితే ఫస్ట్ పడే వికెట్ ఆమే…
సో, వాళ్లను వదిలేసి వ్యూహాత్మకంగా రేవంత్ జగ్గారెడ్డిని పైకిలేపాడు… గతంలో వాళ్లకు పెద్ద సఖ్యత లేకపోయినా సరే పర్లేదు… సీనియర్లో, మరో లీడర్లో… తనకు ఇబ్బందిగా ఉన్నారు అనుకుంటే కీలెరిగి వాత పెట్టాల్సిందే తప్ప బహిరంగంగా ఏమీ చేయడానికి లేదు… కాంగ్రెస్ సంస్కృతిలో ఈ యవ్వారాలు అత్యంత సహజం… అవన్నీ అలవాటై, తోసుకుంటూ వచ్చాడు కాబట్టే సీఎం అయ్యాడు…
ఆ టెంపర్మెంట్ ఉంది కాబట్టే అంతటి బలమైన కేసీయార్‌ను, అత్యంత అధిక సాధన సంపత్తి ఉన్న బీఆర్ఎస్ను మట్టికరిపించాడు… ఇప్పటికీ బీఆర్ఎసే తన ప్రబల ప్రత్యర్థి, అందుకే కేసీయార్, కేటీయార్, హరీష్ రావులను గోకుతూనే ఉంటాడు… సరే, వాళ్లూ గోకుతూనే ఉంటారు, మిగతా బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి జస్ట్, వదిలేస్తాడు… స్పందించడు, అంటే, తనను తాను దించుకోడు దిగువకు…
పైగా పార్టీలో ప్రస్తుతం కనిపించేవి నిజానికి కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిలో చిన్నవి… కర్నాటకలోలాగా సీఎం మార్పిడి రాజకీయాలంత సీన్ ఇక్కడ ఎలాగూ లేదు… ఉండదు… ఏవో మంత్రి పదవుల కోసం ఆరాటాలు, పోరాటాలు తప్ప అంతకుమించిన సీన్ లేదు… అందుకే, అంత ధీమా ఉంది కాబట్టే ఇవన్నీ లైట్ తీసుకుని, తను నిక్షేపంగా, నిర్భయంగా, ఈ నెలాఖరు దాకా విదేశాలకు వెళ్లబోతున్నాడు…
మరి పార్టీ కట్టుబాటు, క్రమశిక్షణ, చర్యలు అంటారా..? భలేవారే… కొన్ని ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీలో జవాబులు ఉండవు !!
Share this Article