Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !

August 20, 2026 by M S R

.

విన్నాను ఎక్కడో… జలగం వెంగళరావు మరణించినప్పుడు పీపుల్స్‌వార్ బాధపడిందని! ఎందుకంటే, తమ చేతుల్లో ఎప్పటికైనా మరణించాల్సింన వ్యక్తిని తామేమీ చేయలేకపోయామే, ప్రతీకారం, వర్గకసి చూపించలేకపోయామని!!

ఖలిస్థానీలు కూడా బాధపడి ఉంటారు ఈరోజు… ఎందుకంటే…? ఎప్పటికైనా తమ చేతుల్లో ఖతం కావల్సినోడు మామూలుగా మరణించినందుకు..!! అలా మరణించిన వ్యక్తి పేరు సజ్జన్ కుమార్… అంత సజ్జనుడేమీ కాదు…

Ads

ఇప్పుడు నీతులు చెప్పే కాంగ్రెస్ చరిత్రలో కూడా క్రూరమైన అధ్యాయాలెన్నో… ఈ ‘సజ్జనుడు’ నేతృ‌త్వం వహించిన ఓ క్రుయల్ ఎపిసోడ్ ఏమిటో వివరాల్లోకి వెళ్దాం…



స‌జ్జ‌న్ కుమార్ పుట్టింది 1945 లో… రాజ‌కీయాల్లోకి రాకముందు బేక‌రీ వ్యాపారం… 1977 లో ఢిల్లీ కౌన్సిలర్‌గా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం షురూ… మొదట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నిక.,.. ఆ త‌ర్వాత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రధాన కార్యదర్శి…

స‌జ్జ‌న్ ఇందిరా గాంధీ కుమారుడు సంజ‌య్ గాంధీకి అత్యంత న‌మ్మ‌క‌మైన అనుచ‌రుడు… 1980లో కాంగ్రెస్ టికెట్‌పై ఔట‌ర్ ఢిల్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌… ఢిల్లీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర… తరువాత  1991లోనూ ఎంపీగా గెలుపు… 2004లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఔట‌ర్ ఢిల్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 855,543 ఓట్లతో విజయం…

1984 అక్టోబర్ 31న మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ త‌న సిక్కు బాడీ గార్డ్స్ సత్వత్ సింగ్, బీంత్ సింగ్ చేతిలో హ‌త్య‌కు గురైన సంగతి తెలిసిందే కదా… దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్ల‌ర్లు… సాయుధ గుంపులు రాజ‌ధాని ఢిల్లీవ్యాప్తంగా సిక్కుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని వారి ఇళ్లు, దుకాణాల‌పై దాడి చేశాయి. ఈ దాడిలో 3 వేల మందికిపైగా సిక్కులు హ‌త్య‌కు గుర‌య్యారు… దేశ చరిత్రలో ఓ బీభత్సమైన అధ్యాయం అది…

ఒక్కొక్కరికి 100 రూపాయలు, ఓ క్వార్టర్ బాటిల్ ఇచ్చి, వేలాది మందిని జమచేసి, సిక్కు సమాజంపై దాడికి పురికొల్పింది సజ్జనుడే అని తరువాత దర్యాప్తుల్లో ఆధారాలు లభించాయి…

1984 sikh riots | The Caravan

ఒక పెద్ద చెట్టు కూలినప్పుడు కొన్ని ప్రకంపనలు సహజమే అని అప్పట్లో రాజీవ్ గాంధీ ఈ అల్లర్లను సపోర్ట్ చేశాడు… తరువాత ఢిల్లీ మార‌ణ‌హోమం ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల నుంచి తన పేరును తొలగించడానికి స‌జ్జ‌న్ కుమార్‌… పోలీసులతో క‌లిసి కుట్ర పన్నాడు… సాక్షుల వాంగ్మూలాల నుంచి కుమార్ పేరును ఓ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో తొల‌గించిన‌ట్లు సీబీఐ కూడా నిర్ధారించింది…

కానీ కేసు బలంగానే నిలబడింది… సీబీఐ గట్టిగానే పోరాడింది… ఢిల్లీలోని రాజ్‌నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కులను హత్య చేసి, గురుద్వారాకు నిప్పు పెట్టిన కేసులో 2018 డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చి… జీవిత ఖైదు విధించింది… ఇది సుప్రీంకోర్టులో ప్ర‌స్తుతం పెండింగు…

నవంబర్ 1, 1984న సర్దార్‌ జస్వంత్‌ సింగ్‌, ఆయన కుమారుడు తరుణ్‌దీప్‌ సింగ్‌ను చంపిన కేసులోనూ 2025 పిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది… ఆ ఊచకోతల ప్రధాన బాధ్యుడు (80) ఈరోజు తీహార్ జైలులో అస్వస్థతకు గురై మరణించాడు… ఇది సహజ మరణమేనా, ఎవరైనా ఉన్నారా తేలాల్సి ఉంటుందేమో..!!

sajjan

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions