.
Bharadwaja Rangavajhala …. ఒకే ట్యూను రెండు ట్యూనులుగా …….
ఇరానీ సంగీతం నుంచీ వచ్చి మన సంగీతంలో కలసి పోయిన రాగాల్లో ‘జిలా’ ఒకటి.
అందులో నషాద్ Nashad నౌషద్ కాదు.
ఆయన స్వరపరచిన ఓ హిందీ గీతం తెలుగులోకి రెండు విధాలుగా వచ్చేసింది.
అదేమనగా –
ఒక్కోసారి ఏం జరుగుతుందంటే …
ఓ టైమ్ లో విడుదలైన కొన్ని పరభాషా గీతాలు మన మీద ప్రభావం వేస్తాయి.
దీంతో ఆ వరుసల్లోనే స్వరాలు కూర్చి ఓ పాట కంపోజ్ చేసేస్తారు సంగీత దర్శకులు.
అలా … 1957లో వచ్చిన బడాభాయి చిత్రం కోసం Nashad చోరీ చోరీ దిల్ కా లగానా అంటూ ఓ పాట కంపోజ్ చేశారు.
Ads
https://youtu.be/FVmOQN5Z5C0?si=BlOB9xt8xyaVgHZk
ఈ కంపోజిషన్ బాగా నచ్చిన మాస్టర్ వేణు
1958 లో వచ్చిన మాంగల్యబలం చిత్రం కోసం ఇదే వరసల్లో ఒక పాట కంపోజ్ చేశారు.
ఆకాశవీధిలో అందాల జాబిలీ …
వయ్యారీ తారను చేరి …
అంటూ సాగుతుంది సాహిత్యం.
ఈ పాట రాసింది శ్రీశ్రీ.
https://youtu.be/ZC9re3fZYQ8?si=VB16BgEami0nneIW
అయితే రాజశ్రీ వారు 1959లో బడాభాయి సినిమా తెలుగులో రీమేక్ చేయడానికి సంకల్పించారు.
టైటిల్ శభాష్ రాముడు.
రాజశ్రీ వారి ఆస్థాన సంగీత దర్శకుడు ఘంటసాల ఈ చిత్రానికి పనిచేశారు.
హిందీలో హిట్ అయిన ట్యూనులనే తీసుకోవాలనేది కంపెనీ వారి నిబంధన.
దీంతో చోరీ చోరీ పాటను ఉన్నది ఉన్నట్టుగా తెలుగులోకి తీసుకున్నారు ఘంటసాల.
ఇక్కడ కామెడీ ఏమిటీ అంటే –
కలకల విరిసే జగాలే పులకించెనే అంటూ సాగే ఈ గీతాన్ని కూడా శ్రీశ్రీయే రాయడం విశేషం.
https://youtu.be/QPf7Ed8oRGw?si=HsiZ3vcHUhT2q4I7
- ఇలా ఒకే ట్యూనులో వచ్చిన రెండు పాటలు ఒకే కవి రాయడం విచిత్రం కదూ …
అలాగే ఆకాశవీధిలో పాడిన ఘంటసాల సుశీలలే రెండో పాట కూడా పాడారు.
ఆ పాట పాడిన ఘంటసాలయే ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించుట. ..
Share this Article