Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇరుముడి విషాదం! దిల్ రాజు ఎదుట సర్కారు సాగిలబడాలా?

August 25, 2026 by M S R

.

ఒక్క చేదు నిజాన్ని, మనవాళ్ల వెధవాయిత్వాన్ని చెప్పుకుని మిగతా అంశాల్లోకి వెళ్దాం… మన హీరోలను మన సౌత్ మలయాళ, తమిళ, కన్నడ ఇండస్ట్రీలు కానవు, అంటే పట్టించుకోవు, దేకవు, తీసిపడేస్తాయి… కానీ ఆ హీరోలను మనం నెత్తిన పెట్టుకుని పూజిస్తాం… ఎందుకంటే..? మనకు వాళ్లకున్నంత సిగ్గూశరాలూ ఉండవు కాబట్టి… (నాన్సెన్స్, మనది విశాల హృదయం అనే వాళ్లు కాస్త పక్కకు వెళ్లి ఆడుకొండమ్మా…)

సూర్య, కమల్ హాసన్, రజినీకాంత్ దగ్గర నుంచి చివరకు కార్తి, అజిత్ ఎట్సెట్రాల వరకు దశాబ్దాలుగా తమిళ హీరోలను మోస్తున్నాం, నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నాం, ఫ్యాన్ బేస్, మన్నూమశానం… మలయాళ మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్, పృథ్విరాజ్‌లనూ మోస్తున్నాం… కన్నడం నుంచి యశ్, రిషబ్ ఎట్సెట్రాలనూ కీర్తిస్తున్నాం…

Ads

ఇరుముడి

కానీ మన సినిమాలను ఆ రాష్ట్రాల్లో ఎవడూ దేకడు… వాళ్ల హీరోల్ని మనం మన తెలుగువాళ్లలాగే మోస్తున్నాం… కానీ వాళ్లు..? ఉదాహరణకు… రవితేజ ఇరుముడికి తమిళనాట సినిమా థియేటర్లు లేవు… ఒకటీ అరా ఇచ్చారు… పోనీలే పాపం, అని ముష్టి వేసినట్టు… మొత్తం 4 రోజుల్లో వసూళ్లు తెలుసా..? 14 లక్షలు…

అవును, జస్ట్, 14 లక్షలు… సరే, దాన్నలా వదిలేద్దాం… ఇక్కడ సూపర్ హిట్ కదా, 88 కోట్ల వసూళ్లు 4 రోజుల్లో… చౌకగా చుట్టిపడేశారు, మస్తు లాభం… ఇంకా నడుస్తుంది, థియేటర్లు హౌజ్ ఫుల్… కానీ ఏం జరగబోతోంది… ఓ మలయాళీ దర్శకురాలు, ఓ కన్నడ హీరో… కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి, తారా సుతారియా… ఎవరూ తెలుగువాళ్లు లేరు…

ఇరుముడి

నిర్మాత ఎవరు..? వెంకట్ కే నారాయణ, యశ్… ఈ వెంకట్ నారాయణ పక్కా తమిళ్… సీఎం విజయ్‌కు అత్యంత సన్నిహితుడు… జననాయగన్ నిర్మాత… ఒక్కడంటే ఒక్కడికీ తెలుగుతో సంబంధం లేదు కదా… ఎడాపెడా థియేటర్లు ఇచ్చేశారు… ఈ దెబ్బకు మాంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఇరుముడిని ఈ థియేటర్ల నుంచి పీకిపడేస్తున్నారు… తెలుగుకు ఇంతకు మించిన ద్రోహం ఏముంది..?

ఇరుముడి

ఎందుకు అంటే… దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓ దశ లేదు, ఓ దిశ లేదు కదా… పైగా ఎగ్జిబిటర్స్ సిండికేట్లు… అంతేకాదు, అత్యంత ఉదారంగా ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుకి అనుమతి ఇచ్చారు… ఓ డబ్బింగ్ సినిమాకు, తెలుగుతో సంబంధమే లేని సినిమాకు ఎందుకింత ఔదార్యం..?

అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఓ పాలసీ అంటూ ఏమీ లేదా..? పోనీ, ఆ సినిమా షూటింగు ఏమైనా తెలంగాణలో జరిగిందా..? మరెందుకు ఈ సాగిలబాటు… చివరకు కాలేజీల ప్రాంగణంలో ప్రిరిలీజుకు పర్మిషన్ కూడా ఇచ్చింది ప్రభుత్వం…. అంతగా దిల్ రాజు ఎదుట సాగిలబడాలా..?

పాపం శమించుగాక… తెలుగు ఇండస్ట్రీ పెడుతున్న శాపం ఏమిటో తెలుసా…? ఎలాగూ టాక్సిక్ అనేది ఓ రోత సినిమా… దానికన్నా జబర్దస్త్ షో నయం అంటున్నారు… సో, దాన్ని ప్రేక్షకులు తిరస్కరిస్తే ఇరుముడి పవిత్రత పెరుగుతుంది… టాక్సిక్ పీకేసి మళ్లీ ఇరుముడి ప్రదర్శిస్తారు… స్వామియే శరణం అయ్యప్పా..!!

ఇరుముడి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇరుముడి విషాదం! దిల్ రాజు ఎదుట సర్కారు సాగిలబడాలా?
  • ఈ తడారిన శ్వాసల తబలా చప్పుళ్లు ఓసారి వినండర్రా లీడర్లూ..!!
  • Irumudi – రవితేజ ‘ఇరుముడి’పై స్పష్టంగా ఓ మాలీవుడ్ ముద్ర !
  • ‘గ్లోబరీనా’ తవ్వకాలు షురూ ! కేటీయార్‌పైకి మరో అస్త్రం రెడీ !!
  • అబద్దాలు- తప్పుడు బాష్యాలు – కాళేశ్వరంపై అవే వక్రీకరణ కథలు !!
  • రాఖీకి ఈ ర్యాంప్ లుక్ ఎందుకు..? దారితప్పుతున్న క్రియేటర్లు…!!
  • కులం నిజం – వివక్ష నిజం – కులాధిపత్యం గుప్పిట్లో టాలీవుడ్‌ !!
  • రేవంత్ రెడ్డే టార్గెట్ ! తెర వెనుక ఒక్కటవుతున్న వేర్వేరు శక్తులు !!
  •  2029 టార్గెట్‌గా చకచకా పావులు..! జమిలి, డీలిమిటేషన్, మహిళా కోటా…?
  • రేవంత్‌ రెడ్డి చాణక్యం ! ‘తెలంగాణ ఆత్మగౌరవం’ ఎవడబ్బ సొత్తు ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions