Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!

August 26, 2026 by M S R

.

1) కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్… మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం…
2) కాదు… కాపు ఈక్వేషన్‌తో జనసేనలోకి వెళ్లే ఆలోచన… మరో వార్త…
3) అయ్యో, కాదండీ బాబూ, ఆమె పక్కా జగన్ మనిషి, జగన్ ఆలోచన మేరకు తెలంగాణలో వైసీపీని పునరుద్ధరించే ప్లాన్, మురళికి పగ్గాలు… మరో కథనం…

4) కాదు, కాదు, ఖర్గేకు బ్రీఫ్ చేశారు, ఆమె కాంగ్రెస్‌లోనే ఉంటుంది, అసలు రేవంత్ రెడ్డికే కొండా, కోమటిరెడ్డి, చిన్నారెడ్డి ఎట్సెట్రా బ్యాచ్ కలిసి ఎసరు పెట్టబోతున్నారు… భట్టి, పొంగులేని, ఉత్తమ్ సపోర్టు… మరో విశ్లేషణ…
5) బీసీ కార్డు తీసింది, ఇక ఏమీ కాదు. ఆమె మంత్రి పదవికీ ఏ ఢోకా లేదు, మురళికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారు, రేవంత్ రెడ్డికి అక్షింతలే… మరో సమీక్ష…
……. చర్చోపచర్చలు, గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి… ఐతే పొలిటికల్ గాసిప్స్ కొన్ని మొదట్లో గాసిప్సే, కొన్నిసార్లు హఠాత్తుగా నిజమై కూర్చుంటాయి… ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్న మరికొన్నీ చూద్దాం…

Ads

నేను బీజేపీలో ఉండలేకపోతున్నాను, మా ఫాదర్ పుట్టు కాంగ్రెస్, కాంగ్రెస్ జెండా కప్పుకుని ఈలోకం విడిచాడు… నేనూ పార్టీలోకి వస్తాను, నాకు ఆర్ఎస్ఎస్ ఏమిటో కూడా తెలియదు… అని ఒక ఎంపీ కాంగ్రెస్ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో టచ్‌లోకి వెళ్లాడని మొన్న ఓ కథనం… (బహుశా ధర్మపురి అర్వింద్ గురించేమో…) అసలే నిజామాబాద్ ఇప్పుడు స్ట్రాండ్ బీజేపీ సీటు, తనెందుకు వదిలి వెళ్లిపోతాడు…

సీన్ కట్ చేస్తే… హరీష్ గురించిన ప్రచారాలు మరికొన్ని… ఆర్ఎస్ఎస్ ముఖ్యులు తనతో ఫ్రీక్వెంట్ సంప్రదింపుల్లో ఉన్నారట… పుష్పరాజ్ వెంచర్లలోని ఓపెన్ స్కైస్ విల్లా ఈ భేటీలకు, ఆ సంప్రదింపులకు అడ్డా అట.,.! వస్తే హైదరాబాద్ మూడు కార్పొరేషన్ల ఎన్నికలలోపు రాజీనామా చేసి వచ్చెయ్, లేదూ, ఎన్నికల ముందు వస్తాను అంటే నలుగురితోపాటు నారాయణ, నో ప్రయారిటీ, అంతే అని షరతు అట…

ఏం చేద్దామంటారు అని హరీష్ పాల, పూల మల్లారెడ్డి కుటుంబంతో చర్చలు… తన పట్టున్న పాత మెదక్ జిల్లా గులాబీ నేతలతోనూ మీటింగులు… ‘‘ఎన్టీయార్ పిల్లలు రాజకీయాలకు పనికిరాలేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, అల్లుడు చంద్రబాబే దిక్కయ్యాడు పార్టికి… కేసీయార్ కూడా చాలా గొప్పోడు, ఎన్టీయార్ రేంజ్, కానీ కేటీయార్‌కు జనంలో యాక్సెప్టెన్స్ లేదు, నేను అల్లుడిని… ఏం చేద్దామో చెప్పండి’’ అంటున్నాడని గాలి మోసుకొస్తున్న ప్రచారాలు… నిజానిజాలు ఫామ్ హౌజ్ దేవుడికెరుక!

మళ్లీ ఎప్పుడో ఆ కుటుంబం, ఆ రక్తం ఒక్కటే, అన్నాచెల్లెళ్లు, అయ్యాబిడ్డలు కలిసిపోతారు, నేను నిమిత్రమాత్రుడినై మిగిలిపోతాను, దారి చూసకుంటే బెటర్ కదా అంటున్నాడని సారాంశం… ఇక్కడ నమ్మబులా కాదా అనేది కాదు ప్రశ్న… తెలంగాణ రాజకీయాల్లో రకరకాల సమీకరణాల్లో సాగుతున్న ప్రచారాలు…

సురేఖ, కవిత, హరీష్ రావు, అర్వింద్… చాలామంది ఈ ప్రచారతెరపై పాత్రధారులు… ఎహె, ఎలాగూ కేసీయార్ ప్రాపకం కోసం, పొత్తు కోసం బీజేపీ అంగలారుస్తోంది… ఫామ్ హౌజ్ దయ కోసం ప్రాధేయపడుతోంది… అలా జరిగితే అధికారం ఖాయం, ఈ స్థితిలో హరీష్ ఎందుకు వదిలివెళ్తాడు, నో, నాటెటాల్ అని ఖండిస్తూ మరో ప్రచారపర్వం…

అబ్బే, రేవంత్ రెడ్డినే సీఎం కుర్చీ నుంచి దింపి.,.. శ్రీధర్‌బాబు, ఉత్తమకుమార్‌లలో ఒకరికి చాన్స్ ఇస్తారట తెలుసా అంటూ మరికొన్ని ప్రచారాలు… ఇంటెన్షనల్… నో, నో, చేజేతులా కాంగ్రెస్ ఆ పనిచేసి, తన చితికి తనే నిప్పు పెట్టుకుంటుందా అని మరో కౌంటర్ వాదనల పర్వం… వావ్, తెలంగాణ రాజకీయాలు ఎటు పోతున్నాయో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమండోయ్ ఇది విన్నారా..? ష్, ఆ చెవి ఇటు పడేయండి ఓసారి..!!
  • Very Toxic – పక్కా విషస్వభావి – Not for Grown-Ups also !!
  • అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు…
  • గవర్నర్‌పై ఐదు బుల్లెట్లు… ఆ 21 ఏళ్ల యువతి ఎవరు?
  • అసలే ఖర్చు తడిసిమోపెడు- పైగా ఇన్ని సుమోలు ఎందుకురా బుజ్జా..!
  • SLBC – ప్రకృతి కోపంతో దారిమూస్తే – మరో దారి తవ్వి గెలుస్తున్నాం !!
  • చిరంజీవి గ్లామర్ చీర నుంచి అన్నమయ్య చీర తత్వం దాకా..!
  • సర్.., మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారు ? స్పెర్మ్ బ్యాంకు !!
  • ఇరుముడి విషాదం! దిల్ రాజు ఎదుట సర్కారు సాగిలబడాలా?
  • ఈ తడారిన శ్వాసల తబలా చప్పుళ్లు ఓసారి వినండర్రా లీడర్లూ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions