.
కృతి సనన్… దాదాపు బికినీని పోలిన డ్రెస్ వేసుకుని రాఖీ కడుతూ ఫోజు పెట్టింది, ఓ కుక్కకు కూడా రాఖీ కట్టింది… అది Giva జువెలర్స్ వాళ్ల యాడ్… రాఖీ పండుగ విశిష్టత ఏమిటి..? దాన్ని కట్టేప్పుడు ఆ రోత డ్రెస్ ఏమిటి..,? బుద్దుందా, సిగ్గుందా అంటూ నెటిజనం తిట్టిపోశారు…
బట్, ఆమె కృతి కదా… నా చాయిస్, నా దేహం, నా బట్టలు మన్నూమశానం అంటూ సమర్థించుకుంది… ఆ యాడ్ ఇచ్చిన జివా వాడు మాత్రం కిమ్మనలేదు… దొరికింది చాన్స్ అనుకుని కంగన ఎంటరైంది వివాదంలోకి… నీ తల్కాయ్, ఆ సందర్భం ఏమిటి..? ఆ బికినీ ఏమిటి..? బికినీ వేసుకుని ఎవరైనా రాఖీ కడతారా, నాన్సెన్స్ అని తనూ తిట్టి పోసింది…
Ads
హిందూ మతాన్ని కించపరిచే ఎవరినైనా సమర్థించడానికి, ఏ అంశానికైనా మద్దతు ప్రకటించడానికి రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ రెడీగా ఉంటుంది కదా… తనూ తెర మీదకు వచ్చాడు… కృతికి మద్దతు ప్రకటించాడు… ఎక్కడ స్పందించాలో, ఎక్కడ మౌనంగా ఉండటం తెలియని మనిషి కదా…
ఇంకా నయం, నా బాడీ, నా చాయిస్ అని మొత్తుకునే ఆ తెలుగు ఆంటీ గానీ, ది గ్రేట్ ప్రకాశ్ రాజ్ గానీ… నో, నో, కాక్రోచ్ పార్టీ గానీ స్పందించలేదు… నెటిజనం మాత్రం సదరు యాడ్స్ ఇచ్చిన జివా వాడిని తిడుతూనే ఉన్నారు… ఆ ఓనర్ ఎవడో గానీ వాచిపోయింది… దెబ్బకు ఆ యాడ్ వెనక్కి తీసుకున్నాడు…

సదరు ఆభరణాల బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది… “భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల మాకు అత్యంత గౌరవం, ప్రగాఢమైన అభిమానం ఉన్నాయి. ఒక బ్రాండ్‌గా, ఈ ఆనంద క్షణాలను కుటుంబం మొత్తంతో కలిసి జరుపుకోవాలని మేము ఎల్లప్పుడూ నమ్ముతాము, ఈసారి మేము ఆ ప్రేమను, వేడుకను మా పెంపుడు జంతువులకు కూడా అందించాలనుకున్నాము…”
మా ఇటీవలి ప్రకటన అనుకోకుండా సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను గనుక దెబ్బతీసి ఉంటే, అది మా ఉద్దేశ పూర్వక యాడ్ ఎంతమాత్రం కాదని గమనించగలరు. గౌరవ సూచకంగా, మేము ఆ ప్రకటనను అన్ని మాధ్యమాల నుండి ఉపసంహరించుకున్నాము. ఈ పండుగ సీజన్‌లో మీ అందరికీ ప్రేమ, సానుకూలత కలగాలని కోరుకుంటున్నాము!
అంతకుముందు కృతి కూడా తన డ్రెసింగ్‌ను సమర్థించుకుంది… కుక్కకు రాఖీ కట్టడాన్ని కూడా… నా దుస్తులు, నా బాడీ, నేనేం ధరిస్తే నీకేం నొప్పి? అన్నట్టుగా కంగనాకు కౌంటర్ ఇచ్చింది… కానీ వ్యవహారం ఆమె అనుకున్నట్టు సాఫీగా ఏమీ ముగియలేదు… వెరసి జివా యాడ్ ఉపసంహరణతో తన ఇజ్జత్‌తోపాటు రాహుల్ గాంధీ పరువు కూడా గోవిందా..!!
Share this Article